World

Coronavirus in India: టీకా తీసుకున్నా..అమెరికాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్, వేగంగా పెరుగుతున్న కేసులు, బ్రిటన్‌లో టీకా తీసుకున్న వారికి సోకుతున్న ప్రమాదకర డెల్టా వేరియంట్‌, దేశంలో తాజాగా 39,070 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 491 మంది మృతి (COVID 19 deaths) చెందారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. దేశంలో మొత్తం కరోనాతో 4,27,862 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,10,99,771 మంది రికవరీ అయ్యారు.

Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అదితి అశోక్ సంచలనం, గోల్ఫ్‌లో పతకం చేజారినా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గోల్ఫ‌ర్, అదితిపై ప్రశంసల వర్షం కురిపించిన రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు

Hazarath Reddy

గోల్ఫ్‌లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతే చాలామందికి తెలియదు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ సుపరిచితమైపోయింది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఆమె (Aditi Ashok At Tokyo Olympics 2020) చూపించిన తెగువ ఇప్పుడు అందర్నీ ఆమె వైపు తిప్పుకునేలా చేసింది.

Tropical Storm Mirinae: దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

: జపాన్‌లోని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2020 గేమ్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే చివరి రోజుల్లో టోక్యోలో వాతావారణ పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఇప్పుడు వేడి తేమతో కూడిన పొడి వాతావరణం ఉంది. అయితే రానున్న కాలంలో ఉష్ణమండల తుఫాను (Tropical Storm Mirinae) టోక్యో నగరాన్ని తాకబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి జపాన్ వాతావరణ సంస్థ (JMA) మిరినే (Mirinae) అని నామకరణం చేసింది.

India's COVID19 Report: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, కొత్తగా 44,643 పాజిటివ్ ఇన్ఫెక్షన్లు మరియు 464 మరణాలు నమోదు; వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటికీ చాలా వెనకబాటు, కేవలం 8% జనాభాకే రెండు డోసులు పూర్తయినట్లు రిపోర్ట్

Team Latestly

ప్రపంచంలోని చాలా దేశాలు తమ జనాభాలో ఎక్కువమందికి టీకాలు వేయడం పూర్తి చేయడంతో, ఆయా దేశాలు ఇప్పుడు బూస్టర్ డోసుపై ఫోకస్ పెట్టాయి, అంతేకాకుండా ఇతర దేశాల కోసం కోవిడ్ టీకాల అభివృద్ధి మరియు సరఫరాను ప్రారంభించాయి. అయితే భారత్ లో మాత్రం...

Advertisement

Tokyo Olympics 2020: హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి, చేజారిన కాంస్య పతకం; మరో మ్యాచ్‌లో భారత రెజ్లర్ సీమా బిస్లా ఓటమి, ఈరోజు టోక్యో ఒలంపిక్స్ క్రీడా విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

భారత్ పై మళ్లీ 4-3 తో లీడ్ లోకి వచ్చింది, దీని తర్వాత బ్రిటన్ భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, సమయం మించి పోవడంతో చివరకు బ్రిటన్ విజేతగా నిలిచింది. బ్రిటన్ విజయోత్సవంతో భారత మహిళలు కన్నీళ్లలో మునిగిపోయారు...

Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న భారత రెజ్లర్ రవికుమార్ దహియా, ఫైనల్లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి; పోరాట స్పూర్థిని మెచ్చుకున్న రాష్ట్రపతి మరియు ప్రధాని

Team Latestly

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం జరిగిన 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ ఫైనల్స్ లో బంగారు పతకం సాధిస్తాడనుకున్న రవికుమార్ ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు....

Tokyo Olympics 2020: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు; మరో మ్యాచ్‌లో మహిళా రెజ్లర్ దూకుడు.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్

Team Latestly

టోక్యోలో భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు మరో పతకాన్ని ముద్దాడింది....

Bus Collides With Truck: ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న బస్సు, 41 మంది మృతి, 33 మందికి తీవ్ర గాయాలు, దక్షిణ మధ్య మాలిలో విషాద ఘటన

Hazarath Reddy

మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ మధ్య మాలి, సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం లారీ బస్సు ఢీకొన్న (Bus Collides With Truck) ఘటనలో 41 మంది మరణించారు. మరో 33 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదుపు తప్పిన ట్రక్కు బస్సు మీదికి దూసుకురావడంతో (Truck collides with bus in Mali) ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Coronavirus in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్, ఆ దేశంలో డేంజర్‌గా మారిన డెల్టా వేరియంట్, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో డెల్టా కేసులు నమోదు, వుహాన్‌లో అందరికీ కరోనా టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు

Hazarath Reddy

చైనాలో మళ్లీ కరోనా పంజా విప్పుతోంది. వూహాన్ నగరంలో మొట్టమొదటి కరోనా (Coronavirus in China) కేసు 2019వ సంవత్సరం డిసెంబర్ నెలలో బయటపడిన తర్వాత ఆ దేశం క్రమంగా ఈ వైరస్ నుంచి కోలుకుంది. అయితే తాజాగా ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న డెల్టా వేరియంట్ ( Delta outbreak spreads) ఉనికి ఆ దేశంలో బయటపడింది.

Afghanistan: ఆఫ్ఘాన్‌పై విరుచుకుపడిన తాలిబన్లు, కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్లతో దాడి, విమాన రాక‌పోక‌ల‌కు తాత్కాలికంగా అంతరాయం

Hazarath Reddy

ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా బ‌ల‌గాలు వెనుదిరిగిన నేప‌థ్యంలో.. ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల ప్ర‌భావం మ‌ళ్లీ పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబ‌న్లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త రాత్రి రెండు రాకెట్లు విమానాశ్ర‌యంలోని రన్‌వేపై వ‌చ్చి ప‌డ‌డంతో విమాన రాక‌పోక‌ల‌కు తాత్కాలికంగా అంతరాయం ఏర్ప‌డింది.

Tokyo Olympics 2020: సహనం కోల్పోయిన వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, ఓటమితో రాకెట్‌తో నెట్‌పై బలంగా బాదేసిన సెర్బియా ఆటగాడు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

ఒలింపిక్‌ స్వర్ణ పతకంతో పాటు క్యాలెండర్‌ సంవత్సరంలో ‘గోల్డెన్‌ స్లామ్‌’ సాధించాలనే లక్ష్యంతో టోక్యోకు వచ్చిన టెన్నిస్‌ సెర్బియా ఆటగాడు వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆశలు అడియాసలు అయ్యాయి.

COVID in Japan: ఒలింపిక్స్ దెబ్బ..జపాన్‌లో కరోనా కల్లోలం, టోక్యోతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచన

Hazarath Reddy

ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతున్న జపాన్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (Japan imposes state of emergency in Tokyo) విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

Advertisement

Delta Variant: కరోనా థర్డ్ వేవ్..ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్, 132 దేశాలకు పాకిన ప్రమాదకర వైరస్, ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి, దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ డెల్టా వేరియంట్‌ ప్రమాదకరంగా (Delta Is A Warning) మారింది., ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అన్ని దేశాలకు కీలక సూచనలు చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టకముందే కరోనా మహమ్మారిని అదుపు చేయాలన్న హెచ్చరిక జారీ చేస్తోందని వ్యాఖ్యానించింది. కరోనాను అంతం చేసే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది.

Tokyo Olympics 2020: టొక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, బాక్సింగ్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా బోర్గాహిన్, మరోవైపు ఆర్చరీలో జోరు కొనసాగిస్తున్న దీపిక కుమారి

Team Latestly

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది...

COVID19 in India: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కొత్తగా 43,509 పాజిటివ్ ఇన్ఫెక్షన్లు మరియు 640 మరణాలు నమోదు; కేరళ నుంచే 50 శాతం కొత్త కేసులు ఉంటున్నాయని నివేదిక వెల్లడి

Team Latestly

దేశంలో హఠాత్తుగా కోవిడ్ కేసుల పెరుగుదలకు ప్రధానంగా కేరళ రాష్ట్రం కారణంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో రోజురోజుకి పెద్ద ఎత్తున కేసుల పెరుగుదల ఉంది, ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో 50% పైగా కేరళ నుంచే ఉండటం గమనార్హం...

Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు

Vikas Manda

టోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....

Advertisement

Delta Covid-19 Variant: రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్, అమెరికాలో హైఅలర్ట్, తప్పనిసరిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ ఆదేశాలు, రెండు డోసులు తీసుకున్న వారిని సైతం వదలని డెల్టా

Hazarath Reddy

యుఎస్‌లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆ దేశ ఆరోగ్య‌శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు (US tells vaccinated people) తప్పనిసరిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని ఆదేశించింది. ఇండోర్స్‌లో ఉన్న‌వాళ్లు త‌ప్ప‌కుండా మాస్క్ పెట్టుకోవాల‌ని (Must mask again) సూచించింది.

Mia Khalifa Divorce: భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన పోర్న్ స్టార్ మియా ఖలీఫా, రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్, కలిసి ఉండలేమని..స్నేహితులుగా ఉంటామని తెలిపిన మియా

Hazarath Reddy

వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు (Mia Khalifa announces divorce) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను ట్వీట్ (Mia Khalifa Instagram) ద్వారా వెల్లడించింది.

Covid In Tokyo: టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

Hazarath Reddy

టోక్యోలో కరోనా పంజా విసిరింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 2,848 కేసులు టోక్యోలో (Tokyo Reports Highest Single-Day Spike) నమోదయ్యాయి. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కాగా జపాన్ రాజధానిలో గత జనవరిలో 2520 కేసులు నమోదు కాగా ఈ సారి ఆ రికార్డును తిరగరాస్తూ నిన్న ఒక్కరోజే 2,848 కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో ఆందోళన మొదలయింది

New COVID-19 Variant B.1.621: వణికిస్తున్న మరో కొత్త వేరియంట్, బ్రిటన్‌లో 16 మందిలో B.1.621 రకం కరోనావైరస్, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో యూకేలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Hazarath Reddy

కరోనా వైరస్‌కు చెందిన మరో కొత్త వేరియంట్‌ను బ్రిటన్‌లో గుర్తించారు. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను (New COVID-19 Variant B.1.621) గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్‌ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను (Found in UK With 16 Confirmed Cases) లండన్‌లోనే గుర్తించినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement