World
India- China Border Row: భారత్ - చైనా సరిహద్దు వివాదం.. బలగాలను ఉపసంహరించుకుంటున్న చైనా; ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ ప్రసంగం
Team Latestlyతూర్పు లడఖ్‌లో మోహరించిన ఇరు దేశాలకు చెందిన దళాలను "వెంటనే మరియు పూర్తిగా" ఉపసంహరించుకోవాలని భారత్ మరియు చైనా శుక్రవారం రోజున ఒక ఏకాభ్రియానికి వచ్చాయి. ఆ మరుసటి రోజే ఈ అభివృద్ధి జరిగింది. సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించే దిశగా...
Unlock 3.0 or Lockdown Again?: అన్‌లాక్‌ 3.0 లేక లాక్‌డౌన్ కంటిన్యూ? వచ్చేవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో విశ్వరూపం దాల్చిన కరోనా
Hazarath Reddyభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ఈ నెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ( PM Modi to Meet CMs) కానున్నారు. ఈ సమావేశంలో దేశంలో కరోనావైరస్ తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, రాష్ట్రాల సన్నద్ధత, వైరస్‌ నియంత్రణ చర్యలు, అలాగే అన్‌లాక్‌ 3.0పై (Unlock 3.0) చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత (COVID-19 pandemic), లాక్‌డౌన్ (Lockdwon) మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video Conference) నిర్వహించారు.
Coronavirus in India: శవాల ద్వారా కరోనా వచ్చే అవకాశం లేదు, మృతదేహాల్లో వైరస్ 3-4 గంటలు మాత్రమే బతికి ఉంటుందని వైద్యులు వెల్లడి, దేశంలో 30 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
Hazarath Reddyదేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 49,310 మంది క‌రోనా పాజిటివ్‌లుగా (Coronavirus in India) నమోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 30,601 మంది (Coronavirus Deaths) చ‌నిపోయారు. నిన్న ఒకేరోజు కొత్త‌గా 720 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో రోజువారి క‌రోనా కేసుల్లో బ్రెజిల్‌ను (Brezil) వెన‌క్కి నెట్టిన భార‌త్‌ (India), అమెరికా (America) త‌ర్వాత రెండోస్థానంలో నిలిచింది.
Thyrocare Survey: భారత్‌లో 18 కోట్ల మందికి కరోనా భయమే లేదు, వారి శరీరం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, థైరోకేర్‌ సర్వేలో వెల్లడి
Hazarath Reddyభారత్‌లో 18 కోట్ల మందికి (18 crore Indians) కరోనా భయమే లేదు. దీనికి ప్రధాన కారణం వారంతా ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా (Thyrocare Survey) పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కోవిడ్-19 వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ (Antibodies Against Coronavirus) కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని సర్వే తెలియజేసింది.
COVID-19 in India: నెగిటివ్ వచ్చిన 12 మందికి మళ్లీ పాజిటివ్, మధ్యప్రదేశ్ గవర్నరు అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా, మ‌ణిపూర్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్, దేశంలో 12 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు
Hazarath Reddyదేశంలో గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు (Coronavirus cases in India) న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనావైరస్ బారిన‌ప‌డ్డారు. భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,720 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య (COVID-19 in India) 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు.
America vs China Corona War: చైనాపై నిప్పులు చెరిగిన అమెరికా, హౌస్టన్‌ చైనా రాయబార కార్యాలయం మూసివేత, కోవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయన పత్రాలు చైనా హ్యాక్ చేసిందని ఆరోపణలు
Hazarath Reddyఅమెరికా, చైనా మధ్య విభేదాలు (America vs China War) రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని(Beijing’s consulate in Houston) మూసివేయాలని అమెరికా ఆదేశించింది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ జనరల్‌ (Chinese Consulates in US) గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం (America Govt) కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. దీని కోసం 72 గంటలు గడువు ఇచ్చినట్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ హు జిజిన్ బుధవారం ట్వీట్ చేశారు.
Vladimir Putin: ప్రియమైన వారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది, భారత్‌లో వరదల విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
Hazarath Reddyభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల( India Floods) విధ్వంసం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) బుధవారం ప్రధాని మోడీ (PM Narendra Modi), దేశ అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ కు (President Ram Nath Kovind) సంతాపం తెలిపారు.ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. "అనుకోని విపత్కర పరిస్థితులకు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను రష్యా పంచుకుంటుంది. గాయపడిన వారందరినీ త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది" అని పుతిన్ (Vladimir Putin) సందేశంలో పేర్కొన్నారు.
COVID-19 Cases in India: దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది, 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదు, భారత్‌లో 12 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య (COVID-19 Cases in India) 11,92,915కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరట ఇస్తోంది. దేశంలో మొత్తం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య (Coronavirus deaths in india) 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.
COVID-19 Scare in India: బీహార్‌లో పేషెంట్ల పక్కనే కరోనా మృత‌దేహం, దేశంలో 24 గంటల్లో 37,418 కోవిడ్-19 కేసులు నమోదు, 11,55,191కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 తాజా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,55,191కు చేరుకుంది. కోవిడ్-19 భారీనపడి ఒక్కరోజే 587 మంది మరణించారు. కోవిడ్‌-19తో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 28,084 మంది (Coronavirus Deaths) మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక 7,24,578 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,02,529 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.
Oxford COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించిన ఆక్స్‌ఫర్డ్, ట్వీట్ చేసిన ది లాన్సెట్ ఎడిటర్
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ (COVID-19 Vaccine) కోసం ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో 140కి పైగా ప్రయోగాలు కొనసాగుతుండగా.. ఆక్స్‌ఫర్డ్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌పై ఎక్కువ మంది నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకానికి మరింతగా ముందుకు తీసుకువెళుతూ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు (Oxford COVID-19 Vaccine Trials) ప్రకటించింది.
Coronavirus in India: నాలుగు రోజుల్లో 1.30 ల‌క్ష‌ల కరోనా కేసులు నమోదు, దేశంలో 11 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 27,497కు చేరుకున్న మరణాలు
Hazarath Reddyదేశంలో ప్ర‌తిరోజు 34 వేల‌కు కేసులు (Coronavirus in India) న‌మోద‌వుతుండ‌టంతో నాలుగు రోజుల్లోనే 1.30 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో క‌రోనా కేసులు 11 ల‌క్షల మార్కును దాటాయి. ‌తాజాగా గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో కొత్త‌గా 40,425 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య (coronavirus tally in India) 11,18,043కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 3,90,459 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,00,087 మంది బాధితులు కోలుకుని ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Free Wi-Fi Used for Porn Videos: ఫ్రీ వైఫై‌తో 80 వేల పోర్న్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసింది, ఆస్పత్రి బెడ్ మీద నుంచే వీడియోలు చూసింది, యూకేలో పోలీసులకు షాకిచ్చిన ఘటనపై ఓ లుక్కేయండి
Hazarath Reddyఆస్పత్రిలోని ఉచిత వైఫై సాయంతో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ (Trans Woman) పోర్న్ ప్రపంచాన్ని మొత్తం చూసింది. యూకేలోని ఓ ఆస్ప‌త్రిలోని వైఫై ఉప‌యోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ చిత్రాలను (child sexual abuse images), వందల వీడియోలను డౌన్‌లోడ్ చేసింది. ఇంకా విచిత్రకర అంశం ఏమిటంటే.. ఆమె ఆ ఆస్పత్రిలో పేషెంట్ గా చేరి ఈ పని చేయడం.. ఈ ఘటన అక్కడ పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది.
Bitcoin Scam in Twitter: రెండు గంటలు..రూ.90ల‌క్ష‌లకు పైగా సంపాదన, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లే లక్ష్యంగా రెచ్చిపోయిన బిట్ కాయిన్ హ్యాకర్లు, చరిత్రలో చీకటి రోజని తెలిపిన ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే
Hazarath Reddyనిన్నంతా ట్విట్టర్ హ్యాకింగ్ తో (Twitter Accounts Hack) వణికిపోయింది. అమెరికాలో రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నుల అకౌంట్లే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయారు. ధనవంతుల అకౌంట్లను హ్యాక్ (US Twitter accounts) చేసి భారీ మొత్తంలో హ్యాకర్లు సంపాదనను పోగేసుకున్నారు. హ్యాక్ అయిన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (US Former president Barack Obama), డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (Joe Biden), టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, మీడియా మొఘల్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్ (Mike Bloomberg), అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్ (Amazon CEO Jeff Bezos), మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో (Bill Gates) పాటు యాపిల్, ఉబర్‌ వంటి సంస్థల అకౌంట్లు ఉన్నాయి. నిన్న మూడు నాలుగు గంటల పాటు వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగాక్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
International Flights: నేటి నుండి అమెరికా, ఫ్రాన్స్‌కు విమాన సర్వీసులు, తొలి దశలో మొత్తం 46 విమాన సర్వీసులు, వెల్లడించిన పౌర విమానయాన శాఖ
Hazarath Reddyకోవిడ్-19 కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు (India resumes some international travel) నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి నేటి నుంచి పాక్షికంగా విమానాలు (International Flights) నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఢిల్లీ-న్యూయార్క్‌ (Delhi- New york) మధ్య ప్రతి రోజూ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep singh puri) తెలిపారు.
Coronavirus in india: సెప్టెంబర్ 1నాటికి 35 లక్షలకు కరోనా కేసులు, అంచనా వేసిన ఐఐఎస్సీ, దేశంలో 10 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు..25 వేల మరణాలు, ఒక్క రోజులో 34,956 మందికి కొత్తగా కోవిడ్ 19 పాజిటివ్
Hazarath Reddyభారతదేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in india) మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. మొత్తం కరోనావైరస్ కేసులు (Coronavirus Cases in India) 10,03,832 కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ( Coronavirus Deaths in india) 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే రికవరీ రికార్డు స్థాయిలో పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవెల్లడించింది. 24 గంటల్లో 22,942 బాధితులు కోలుకున్నట్టు ప్రకటించింది. కాగా దేశంలో తొలి కోవిడ్‌-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనేబాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది.
Red Alert for Medicos: 1302 మంది డాక్టర్లకు కరోనా, 99 మంది వైద్యులు కోవిడ్-19కు బలి, రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎంఏ, దేవుడే కాపాడాలని నిర్వేదం వ్యక్తం చేసిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (coronavirus) పంజా విసురుతోంది. ఇంకా మెడిసిన్ అందుబాటులోకి రాకపోవడంతో అది కల్లోలాన్ని రేపుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో వైద్యులు పోరాడుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా విధుల్లో వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఇప్పటి వరకు దేశంలో 1,302 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 99 మంది ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(IMA) తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులను ఐఎంఏ అలర్ట్‌ చేసింది.
Coronavirus in India: కరోనాని జయించిన 103 ఏళ్ల బామ్మ, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 కోవిడ్-19 కేసులు, 9,70,169కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో క‌రోనా వైర‌స్ (Coronavirus in India) విజృంభిస్తున్న‌ది. గ‌త ప‌ది రోజులుగా 25 నుంచి 29 వేలకు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌గా, మొద‌టిసారిగా 30 వేల మార్కును దాటాయి. దీంతో దేశంలో కరోనా కేసులు పది లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇంత అధిక మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Coronavirus lockdown: దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తప్పదా? మరోసారి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్న పలు రాష్ట్రాలు, కొవిడ్‌-19 కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానానికి భారత్
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు (Coronavirus Cases in India) పెరిగిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కల్లోలాన్ని రేపుతోంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ల జాబితాలో ప్రపంచంలోనే భారత్‌ ( India Coronavirus) మూడోస్థానానికి చేరింది. దేశంలో 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) విధిస్తే కాని పరిస్థితులు అదుపులోకి వచ్చేలా కనబడటం లేదు.
Coronavirus Outbreak in India: 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 24 గంటల్లో రికార్డు స్థాయిలో 29,429 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు, ఇప్పటివరకు 5,92,032 మంది డిశ్చార్జ్
Hazarath Reddyదేశంలో గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 582 మంది మరణించారు. కరోనా బయటపడినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉండగా, వైరస్ బారినపడినవారిలో 5,92,032 మంది బాధితులు కోలుకున్నారు.
India's Coronavirus Report: దేశంలో 24 గంటల్లో 28,498 కొత్త కేసులు, 540 మరణాలు, 9,07,645కు చేరుకున్న కోవిడ్-19 కేసులు, కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,71,460 మంది
Hazarath Reddyభారత్‌లో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య ( Coronavirus Cases in India) 9,06,752కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య (COVID Deaths in India) 23,727కు చేరింది. ప్రస్తుతం 3,11,565 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.