World

Indian Officials Missing in Pak: పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు మిస్సింగ్, అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన భారత్

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ఇద్దరు భారత దౌత్యాధికారులు అదృశ్యం కావడం (Indian Officials Missing in Pak) కలకలం రేపుతోంది. పాక్ లోని ఇస్లామాబాద్‌లో (Islamabad in Pakistan) గల భారత హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు ఒకేసారి కనపడకుండాపోయారని తెలుసుకున్న భారత్‌ దీనిపై స్పందింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి వారు ఒక్కసారిగా అదృశ్యమైనట్లు తెలిసింది. ఇటీవలే న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌లో ఇద్దరు పాక్‌ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

COVID-19 in India: గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్‌ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్‌

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ప్రతి రోజూ పదకొండు వేల మార్కును దాటుతున్నాయి. . గత 24 గంటల్లో దేశంలో 11,502 కేసులు రికార్డు అయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ (Coronavirus in India) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్‌ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 325 మంది మృతి చెందారు.

COVID Treatment Bill: కోవిడ్ చికిత్సకు హార్ట్ ఎటాక్ తెప్పించే బిల్లు! కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడికి రూ. 8,52,61,811 బిల్లు వేసిన ఆసుపత్రి, నవ్వులు పోయి నువ్వులైన వేళ ఊరటనిచ్చిన ఆరోగ్య బీమా

Team Latestly

70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడాడు, మరణం అంచుల దాకా వెళ్లి మరీ ఈ మహమ్మారిని జయించాడు. దీంతో ఆ పెద్దాయనకు, ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇక ఆనందంతో డిశ్చార్జ్ అయ్యే సమయంలో చికిత్సకు సంబంధించిన బిల్లు...

COVID-19 Patients Treatment: క‌రోనా పేషెంట్ల‌ను జంతువులు కన్నా హీనంగా చూస్తారా, ఢిల్లీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్, కుళ్లిన మృతదేహాల వీడియో ఫేక్ అంటూ కొట్టి పారేసిన పశ్చిమ బెంగాల్‌ వైద్యారోగ్య శాఖ అధికారులు

Hazarath Reddy

కోవిడ్-19 కట్టడి చర్యలపై ఢిల్లీ సర్కార్‌ తీరును దేశ అత్యున్నత న్యాయస్ధానం (Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 రోగులను (COVID-19 Patients Treatment) పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు మండిపడింది. కరోనా రోగులకు సరైన చికిత్స ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య తగ్గించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని ఆదేశించింది.

Advertisement

Coronavirus in India: కరోనా కేసుల్లో బ్రిటన్‌ను దాటి 4వ స్థానానికి వచ్చిన భారత్, గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10956 కేసులు నమోదు, మొత్తం 8,498 మంది మృతి

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ఒక్క రోజే పది వేల మార్కును దాటింది. . గత 24 గంటల్లో దేశంలో 10956 కేసులు రికార్డు అయ్యాయి. ఒకే రోజులో పదివేల మార్క్‌ను దాటడం దేశంలో ఇదే మొదటిసారి. తాజాగా కరోనా వైరస్‌ (Coronavirus in India) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్‌ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. శుక్రవారం రోజున కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 396 మంది మృతి చెందారు. మొత్తంగా 2,97,535 కేసులు, 8,498 మరణాలతో (Coronavirus Death Toll) నాలుగో స్థానానికి చేరుకుంది.

Coronavirus Outbreak: కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారట, స్పానిష్ ఫ్లూ మాదిరిగా కరోనా వ్యాప్తి భయకరంగా ఉంటుందని తెలిపిన ప్రముఖ జర్నల్ లాన్సెట్

Hazarath Reddy

కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారంటూ ఇప్పుడు సరికొత్త వాదన బయటకు వచ్చింది. ప్రముఖ జర్నల్ లాన్సెట్ (The Lancet) ఈ వాదనను తెరపైకి తెచ్చింది. 1918 లో సంభవించిన స్పానిష్ ఇన్ ఫ్లు ఎంజా ( Spanish Flu) మాదిరిగానే కరోనా వ్యాప్తి కూడా భయంకరంగా ఉంటుందని ఈ పత్రికలో ప్రచురించిన ఒక పరిశోధన తెలిపింది. ప్రఖ్యాత మెడికల్ జనరల్ ది లాన్సెట్‌లో ప్రచురించబడిన పరిశోధనా పత్రానికి 'యాక్టివ్ కేస్ ఫైండింగ్ విత్ కేస్ మేనేజ్‌మెంట్: ది కీ టు ట్రాకింగ్ ది కోవిడ్ -19 పాండమిక్' అని పేరు పెట్టారు. కాగా గతంలో వచ్చిన HINI ఇన్ ఫ్లు ఎంజా కారణంగా ప్రపంచంలో 10 మిలియన్ల మంది మరణించారు.

Coronavirus in India: కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India) రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 286579గా నిలిచింది. ఇందులో యాక్టివ్‌ కేసులు 137448గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వైరస్‌ సంక్రమించిన వారిలో 141029 మంది కోలుకున్నట్లు పేర్కొన్నది.

Coronavirus in India: పుట్టినరోజే కరోనాతో ఎమ్మెల్యే మృతి, కోవిడ్-19 కేసుల్లో వూహాన్ నగరాన్ని మించిపోయిన ముంబై, దేశ వ్యాప్తంగా 2 లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus in India) రోజులు గడుస్తున్న కొద్దీ వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య (Coronavirus Deaths) 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు.

Advertisement

WHO on Coronavirus: ముప్పు మరింతగా పెరుగుతోంది, కోవిడ్-19 వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, నిర్లక్ష్యమే పెను ప్రమాదంగా మారిందని తెలిపిన సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై (coronavirus situation) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ (Tedros Adhanom Ghebreyesus) హెచ్చరించారు. . ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ ఆందోళనతో కూడని హెచ్చరికలు చేసింది.

India Coronavirus: దేశంలో కరోనా కల్లోలం, రికార్డు స్థాయిలో కొత్తగా 9,987 కొత్త కేసులు, 2,66,598కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్ కల్లోలం (India Coronavirus) కొనసాగుతూనే ఉంది. కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది. గడచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 9,987 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,66,598కు పెరిగింది.

Global COVID-19 Deaths: ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృతి, 70 లక్షలు దాటేసిన కోవిడ్-19 కేసులు, కేసుల వివరాలను ఇక వెల్లడించమని తెలిపిన బ్రెజిల్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Global COVID-19) పెరుగుతూనే ఉన్నాయి. లాటిన్‌ అమెరికా, రష్యా భారత్‌లో కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాటికి 70 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్త మృతుల సంఖ్య నాలుగు లక్షలు (Global COVID-19 Deaths) దాటింది. అమెరికాలో మృతులు 1.10 లక్షలకు చేరువ కాగా, యూరప్‌ దేశాల్లో 1.75 లక్షల మందికి పైగా మరణించారు.

COVID-19 Deaths in India: చైనాను దాటేసిన మహారాష్ట్ర, దేశ వ్యాప్తంగా 7 వేలమందికి పైగా మరణం, ఇండియాలో 2,56,611కి చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus Outbreak) తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. వరుసగా ఆరో రోజూ తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు, 206 మంది (COVId-9 Deaths in India) మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,56,611కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది బాధితులు కోలుకోగా, మరో 1,25,381 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 7135 మంది మరణించారు.

Advertisement

COVID19 in India: భారత్‌లో 2,36,657 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 9.887 పాజిటివ్ కేసులు నమోదు, 6,642 కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

నిన్న దేశవ్యాప్తంగా 4,610 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,14,072 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,15,942 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....

Dawood Ibrahim: దావూద్ ఇబ్రాహీంకు కరోనా పాజిటివ్, అతని భార్యకు కూడా కోవిడ్ 19 పాజిటివ్, క్వారంటైన్‌లో దావూద్ పర్సనల్ స్టాఫ్, వార్తలను ఖండిస్తున్న పాక్ ప్రభుత్వం

Hazarath Reddy

భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు (Underworld Don Dawood Ibrahim) కూడా కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్‌కు(His Wife Test Positive) కూడా కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అతని సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం, అతని భార్య పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Coronavirus in India: గత 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు, దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు, ఆందోళన కలిగిస్తున్న మహారాష్ట్ర

Hazarath Reddy

భారత్‌లో కోవిడ్ 19 (Coronavirus in India)విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రతి రోజు 200 పైగా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు ( Coronavirus Cases) వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 9,851 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు ఈ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,26,770 కరోనా కేసులు నమోదవ్వగా, 6,348 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకొని 1,09,462 మంది డిశ్చార్జి అయ్యారు.

Vijay Mallya: లిక్కర్ కింగ్‌ను ఇప్పట్లో ఇండియాకు పంపలేం, విజయ్ మాల్యా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపిన యూకే ప్రభుత్వం

Hazarath Reddy

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను (Vijay Mallya) భారత్‌కు అప్పగించే విషయంలో యూకే ప్రభుత్వం (UK Govt) ఊహించని మెలిక పెట్టింది. ఇంకా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదనీ.. పెండింగ్‌లో ఉన్న సమస్య పూర్తయ్యే వరకు మాల్యాను భారత్‌కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ (British High Commission) పేర్కొంది. చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది.

Advertisement

International Flight Operations: జులై నుంచి విదేశాలకు విమాన సర్వీసులు, జూన్ 30 వరకూ నిషేధం అమల్లోకి, దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flight Operations) తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation ministry) వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.

Gandhi Statue Vandalised: అమెరికాలో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం, క్షమాపణలు కోరిన అమెరికా, ఆర్మీని రంగంలోకి దింపుతామని తెలిపిన ట్రంప్

Hazarath Reddy

గత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు (Ongoing Protests in US) మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సెగ ఇండియా మహత్ముడికి (Mahatma Gandhi) కూడా తగిలింది. అమెరికాలో ఆందోళ‌న‌కారులు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం (Gandhi Statue Vandalised) చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని ఇండియ‌న్ ఎంబ‌సీలో ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని న‌ల్ల‌జాతీయులు ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ నిర‌స‌న‌కారులు ఈ విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్న‌ది.

Coronavirus in India: ఆరు వేలు దాటిన మృతుల సంఖ్య, దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 2,16,919కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు

Hazarath Reddy

క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య భార‌త్‌లో (Coronavirus Deths in India) ఆరు వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 2,16,919కి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 60 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం 106737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 104107 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6075కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.

India COVID-19: గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

భారత్‌లో కరోనా (Coronavirus Cases in India) మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,07,615కు ఎగబాకింది. కరోనా (Coronavirus) మహమ్మారి బారి నుంచి 1,00,303 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement
Advertisement