World

COVID-19 in India: దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య (COVID-19 in India) భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలోకి చేరింది. ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలను (Lockdown Relaxation) మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి (Coronavirus) విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 230 మంది మృతిచెందారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,90,535కి పెరిగింది.

India Coronavirus: లాక్‌డౌన్ 5 తప్పదా..? 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,466 కేసులు నమోదు, దేశంలో లక్షా అరవై ఐదు వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 4,706 మంది మృతి

Hazarath Reddy

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు (India Coronavirus) నమోదు కాగా, 175మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Locust Attack in TS: ఇక తెలుగు రాష్ట్రాలే టార్గెట్, పశ్చిమ భారతాన్ని వణికించిన మిడతల గుంపు, మహారాష్ట్రలో ప్రస్తుతం తిష్ట వేసిన రాకాసి మిడతలు

Hazarath Reddy

కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు (Locust) క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి. పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం (Locust Attack) కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.

India Coronavirus: రెండు రాష్ట్రాల్లో 30 వేల పెళ్లిల్లు వాయిదా, దేశంలో లక్షా యాభై ఎనిమిది వేలు దాటిన కరోనా కేసులు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్‌ (India Coronavirus) విజృంభణ కొనసాగుతుంది.గత 24 గంట‌ల్లో దేశంలో కొత్త వైర‌స్ కేసుల సంఖ్య 6566గా న‌మోదు అయ్యింది. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 194గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ (Health Ministry, India) వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 1,58,333గా ఉంది. దీంట్లో 86110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67692 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531కి చేరుకున్న‌ది.

Advertisement

India-China LAC Standoff: బరితెగించిన చైనా, వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలను మోహరింపు, గస్తీ ముమ్మరం చేసిన భారత్, సరిహద్దు రక్షణ కోసం ఆర్మీ కమాండర్లతో నరవాణే చర్చలు

Hazarath Reddy

తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ కొందరిని గాయాలపాలు చేసింది. లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో (India-China LAC Standoff) చైనా ఇటీవల 100 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది. సిక్కిం, టిబెట్‌లను కలిపేనుకులా పాస్‌ మార్గంలోనూ ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తోంది. భారత్‌కు కేవలం 3 కి.మీ. ఆవల పాంగాంగ్‌ సరస్సు సమీపంలోని 1,200 నుంచి 1,300 సైనికుల్ని మోహరించింది.

Rahul Gandhi Talk Show: రెండు రకాలుగా దెబ్బ తీసిన కరోనా, కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం అవుతుందని తెలిపిన రాహుల్ గాంధీ, ఇంకా ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

ప్రపంచ రూపురేఖలను కోవిడ్‌-19 (COVID 19) పూర్తిగా మార్చివేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. కోవిడ్ 19 సంక్షోభం మీద కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం మాట్లాడుతూ.. ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రెండు రకాలుగా తన పంజాను విసురుతుందని... మొదటిది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, ఇక రెండోది ప్రపంచ స్థితిగతులపై ప్రభావం చూపుతుందని ఆయన అంచనా వేశారు. కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం కానుందని ఆయన తేల్చి చెప్పారు.

COVID-19 in India: లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి

Hazarath Reddy

కరోనా మహమ్మారి భారత్‌ను (COVID-19 in India) వణికిస్తోంది. దాని వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతి (COVID-19 Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్‌ కేసులు (2020 Coronavirus Pandemic India) ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా రోజువారి కేసుల సంఖ్యలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది.

Hydroxychloroquine: హైడ్రాక్సీక్లోరోక్వీన్‌‌తో ప్రమాదమేమి లేదు, వైద్యుల పర్యవేక్షణలో వాడండి, స్పష్టం చేసిన ఐసీఎంఆర్‌, ఇదివరకే దీనిపై నిషేధం విధించిన డబ్ల్యూహెచ్‌ఓ

Hazarath Reddy

కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో (Hydroxychloroquine) సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా లేవని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. కాగా కోవిడ్‌-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన విషయం విదితమే. అయితే మరుసటి రోజు ఐసీఎంఆర్‌ ఈ ప్రకటన చేసింది.

Advertisement

COVID-19 Treatment: హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్ర‌య‌ల్స్ ఆపేయండి, ఈ డ్రగ్ తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో

Hazarath Reddy

యాంటీ మ‌లేరియా ఔష‌ధం హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ (hydroxychloroquine) కోవిడ్‌19 (COVID-19) చికిత్స కోసం కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. వాస్త‌వానికి ఈ డ్ర‌గ్ క‌రోనా చికిత్స (COVID-19 Treatment) కోసం త‌యారు చేసింది కాదు. కానీ కోవిడ్ స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ మాత్ర‌లు వేసుకుంటున్న‌ట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే తాత్కాలికంగా హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను నిలిపివేసినట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొన్న‌ది.

Coronavirus in India: మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి

Hazarath Reddy

భారత్‌లో కరోనావైరస్‌ (Coronavirus in India) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,535 కరోనా కేసులు నమోదు కాగా, 146 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 60,490 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,167 మంది (Coronavirus deaths in india) మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 80,722 కరోనా యాక్టివ్‌ కేసులు (2020 Coronavirus Pandemic in India) ఉన్నాయి.

Eid Mubarak 2020: ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచన

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు (Eid Mubarak 2020) తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పండగ చేసుకోవాలని ఆయన కోరారు. ‘ఈద్‌ ఉల్‌ పితర్‌ (Eid-ul-Fitr) సందర్భంగా ఈద్‌ ముబారక్‌. ఈ పర్వదినం కరుణ, సోదర భావాన్ని, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ఆశిసస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

COVID19 in India: భారత్‌లో 1,31,868 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, ఒక్కరోజులోనే అత్యధికంగా 6,767 పాజిటివ్ కేసులు నమోదు, 3,867 కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా, మొత్తం COVID-19 కేసుల సంఖ్య 5.3 మిలియన్లకు దాటింది, మరణాల సంఖ్య కూడా 342,000 పైగా నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆదివారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోఫైన మొత్తం COVID-19 కేసుల 5,309,698 కాగా, మరణాల సంఖ్య 342,078 గా ఉంది....

Advertisement

India Coronavirus: దేశాన్ని వణికిస్తున్న ప్రధాన నగరాలు, తాజాగా 24 గంటల్లో 5,609 కరోనా కేసులు, 132 మంది మృతి, దేశ వ్యాప్తంగా లక్షా 12 వేలు దాటిన కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ (India COVID-19) విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,609 కరోనా కేసులు (Coronavirus) నమోదు కాగా, 132 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 45,229 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 3,435 మంది మృతిచెందారు.

Harsh Vardhan: డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా హర్ష్ వర్ధన్, డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎంపిక, ఈ నెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో బాధ్యతలు

Hazarath Reddy

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ (WHO Executive Board Chairman) గా ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ (Dr Harsh Vardhan) బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ (WHO) నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎంపికైంది. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని (Dr Hiroki Nakatani) స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెళ్లనున్నారు. హర్షవర్దన్ నియమాకాన్ని సభ్యదేశాలు కూడా అంగీకరించాయి. దీంతో ఈనెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలు చేపడతారు.

Viral Video on Trump: అమెరికా అధ్యక్షునికి కరోనా పాజిటివ్ వచ్చిందా..?, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, అసలు ఈ వార్తలో నిజమెంత..?

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కరోనా భారీన పడ్డారా.. ఆయనకు కోవిడ్ 19 (COVID-19) పరీక్షలు చేస్తే అది పాజిటివ్ అని వచ్చిందా...దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో (Fake Video in Social Media) చక్కర్లు కొడుతోంది. ఫాక్స్ న్యూస్ పేరుతో ట్రంప్ కు కరోనా పాజిటివ్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి పుకారు ప్రచారకులు ఫాక్స్ న్యూస్ యొక్క న్యూస్ క్లిప్‌ను అటు ఇటూగా మార్చి సోషల్ మాడియా ద్వారా వైరల్ చేశారు. వాస్తవ తనిఖీలో అది ఫేక్ అని తేలింది.

Coronavirus in India: కేవలం 64 రోజుల్లోనే లక్ష కోవిడ్-19 కేసులు, అత్యధిక కేసులతో దడ పుట్టిస్తున్న దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఇండియాలో లక్షా ఆరువేలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దాంతో పాటుగా మృతుల‌ సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు (COVID-19) నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Health Ministry) బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Advertisement

COVID-19 in India: 75 రోజులకు 10 వేల కేసులు, ఇప్పుడు ఏకంగా లక్ష దాటేశాయి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో 11వ స్థానానికి చేరుకున్న భారత్

Hazarath Reddy

భారత్‌లో కరోనా మహమ్మారి (Coronavirus Outbreak) విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases in India) లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా, మృతుల సంఖ్య 3,163కు చేరింది. దేశంలో ఇంకా 58,802 యాక్టివ్‌ కేసులు ఉండగా, 39,173 మంది బాధితులు కోలుకున్నారు. రోగుల రికవరీ (కోలుకుంటున్న వారు) 38.29 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Delhi Lockdown 4 Guidelines: 20 మంది ప్రయాణీకులతో బస్‌లకు అనుమతి, సెలూన్‌, బార్బర్‌ షాపుల మూసివేత, భారీ సడలింపులు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను (Lockdown 4) మే 31 వరకు పొడిగించిన సంగతి విదితమే. కాగా లాక్ డౌన్ 4లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0 అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) భారీ సడలింపులు (Delhi Lockdown 4 Guidelines) ప్రకటించారు. 20 మంది ప్రయాణీకులతో బస్‌లను అనుమతిస్తామని, ఇద్దరు ప్రయాణీకులతో కార్లను, ఒక ప్రయాణీకుడితో ఆటోలు, ఈ రిక్షాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. సరి-బేసి పద్ధతిలో అన్ని షాపులు తెరుచుకుంటాయని, అన్ని కార్యాలయాలను అనుమతిస్తామని వెల్లడించారు.

US Deportation India: అమెరికాలోకి అక్రమంగా భారతీయుల చొరబాటు, 161 మందిని వెనక్కి తిప్పి పంపిస్తున్న యుఎస్ఏ, అమెరికాలోని 95 జైళ్ల‌లో బందీలుగా 1739 మంది ఇండియన్లు

Hazarath Reddy

అమెరికాలోకి అక్ర‌మంగా చొర‌బ‌డిన 161 మంది భార‌తీయుల‌ను (US Deportations India) వెన‌క్కి పంపిస్తున్నారు. మెక్సికో (Mexico) స‌రిహ‌ద్దు నుంచి వారంతా అమెరికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారిని ప్రత్యేకమైన విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి (Punjab's Amritsar) పంపించనున్నారు.

COVID19: కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్, దేశవ్యాప్తంగా 85,940కు పెరిగిన కోవిడ్-19 బాధితులు, వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రపంచ దేశాలలో 11వ స్థానానికి ఎగబాకిన ఇండియా

Team Latestly

ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ 1,442,819 కేసులు మరియు 87,530 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. 262,843 పాజిటివ్ కేసులతో రష్యా 2వ స్థానంలో, ఆ తరువాత స్థానాలలో వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (238,004), స్పెయిన్ (230,183)....

Advertisement
Advertisement