World

Sonia Gandhi: ప్రజల హక్కులను ప్రభుత్వం పూర్తిగా తొక్కి వేస్తోంది, వారి గోడును అసలు పట్టించుకోవడం లేదు, బీజేపీ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Hazarath Reddy

దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Congress president Sonia Gandhi) అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియోను (video message) విడుదల చేశారు.

Earthquake In Delhi: దేశ రాజధానిలో భూకంపం, వణికిన ఉత్తర భారతం, ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు, ఆఫ్గనిస్తాన్‌లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన భూకంపం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలు(earthquake) స్థానికులను వణికించాయి. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, (northern India)పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

AAP's New Slogan: అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్, మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును, కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

Hazarath Reddy

వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక సమరం (Delhi Assembly poll) మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను వెతికే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ (Arvind Kejriwal) మళ్లీ ఢిల్లీలో ఆప్ జెండాను పాతాలని చూస్తోంది.

Advertisement

Keonjhar Rape And Murder Case: 3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు, నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో మానవ మృగాలు వీర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి పండు మసలి వరకు ఎవర్నీ వదలడం లేదు. మద్యం మత్తులో వారేం చేస్తున్నారో అర్థం కాకుండా ఉన్మాద ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి కోర్టు ఉరిశిక్ష విధించినా, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసినా మార్పు రావడం లేదు. మొన్న దిశ ఘటనలో(Disha rape and murde case) పోలీసుల మీద ఎదురుదాడికి దిగిన నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter)చేశారు.

Donald Trump Impeached: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం, ఆమోదం తెలిపిన ప్రతినిధుల సభ, సెనేట్‌లో దర్యాప్తు, సిగ్గుచేటు రాజకీయాలని వైట్ హౌజ్ వ్యాఖ్య

Vikas Manda

అమెరికా చరిత్రలో అత్యంత సిగ్గుపడే రాజకీయ ఎపిసోడ్లలో ఇది ఒకటి. తప్పు చేసినట్లు ఎలాంటి రుజువు లేకుండా, ఒక్క రిపబ్లికన్ ఓటు తీసుకోకుండా, డెమొక్రాట్లు ఆమోదించిన అభిశంసన చట్ట విరుద్ధమైంది" అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.....

PM's Open Challenge To Congress: దమ్ముంటే పాకిస్తానీలకు పౌరసత్వం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రజలే మీకు సమాధానం చెబుతారు, కాంగ్రెస్ చేతుల్లో పావులుగా మారొద్దని విద్యార్థులకు హితవు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం(Central GOVT) తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై (Citizenship Act) దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Narendra Modi) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

Sadistic Parents: శాడిస్టు తల్లిదండ్రులంటే వీళ్లే, ఇంటికి లేటుగా వచ్చాడని కఠిన శిక్ష, పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలు, రక్తమే ఆ విత్తనాలకు నీరు, తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

రష్యాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వేసిన శిక్షకు పిల్లాడు అల్లాడిపోయాడు. ఆ తల్లిదండ్రులు వేసిన శిక్ష వల్ల పిల్లాడి కాళ్లలో గింజలు మొలకెత్తాయి. ఆ పిల్లాడి శరీరంలోని రక్తమే నీరుగా ఆ విత్తనాలు(Buckwheat) మొలకెత్తాయి. కథనం వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన సార్జే కాజకోవ్, అలీనా యుమషేవ భార్యాభర్తలు, వీరికి 8 ఏళ్ల పిల్లవాడు(eight-year-old boy) ఉన్నాడు. ఆ ఎనిమిదేళ్ల ఆ పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్‌గా వచ్చాడు.

Advertisement

Musharraf: ముషారఫ్‌కు ఉరిశిక్ష, దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్ హైకోర్టు, నాలుగేళ్ల నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టుకు వెళ్లనున్న పర్వేజ్ ముషారఫ్ తరపు న్యాయవాదులు

Hazarath Reddy

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు (former president Pervez Musharraf) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌కు(Pervez Musharraf) పాకిస్థాన్ (Pakistan)లోని పెషావర్ హైకోర్టు ( Peshawar High Court) ఉరిశిక్షను విధించింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన హైకోర్టు... మరణదండనే (Death Penalty) ఆయనకు తగిన శిక్ష అని తేల్చింది. నాలుగేళ్ల నుంచి ముషారఫ్ దుబాయ్ లో తలదాచుకుంటున్నారు.

'Nitish Kumar Missing': బీహార్ సీఎం కనిపించుట లేదు, పాట్నాలో కలకలం రేపుతున్న పోస్టర్లు, కాబ్, ఎన్ఆర్‌సీలపై మౌనం వహించిన నితీష్ కుమార్, పోర్న్ సైట్లు వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధానికి మోడీకి బీహార్ సీఎం లేఖ

Hazarath Reddy

బీహార్ సీఎం (Bihar Chief Minister)కనిపించడం లేదంటూ రాజధాని పాట్నాలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై మౌనంగా ఉన్నందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను(Nitish Kumar) ఎగతాళి చేస్తూ సీఎం మిస్సింగ్ (Nitish Kumar Missing)అంటూ పాట్నాలో పోస్టర్లు అంటించారు.

Barack Obama: మహిళలకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచమే మారిపోతుంది, సగం సమస్యలు ముసలివాళ్ల వల్లే, సోషల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం, మగవాళ్ల కన్నా ఆడవాళ్లే బెటర్ అంటున్న ఒరాక్ ఒబామా

Hazarath Reddy

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆడవాళ్లను తెగ పొగిడేశాడు. వారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. సింగ‌పూర్‌లో (Singapore)జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా పురుషుల క‌న్నా ఆడ‌వాళ్లే చాలా నయం (Women are better leaders than men)అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Kamal Haasan: సుప్రీంకోర్టు గడప తొక్కిన కమల్‌హాసన్, సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఎంఎన్ఎం పార్టీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమంటున్న మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టానికి (Citizenship Amendment Act 2019) వ్యతిరేకంగా మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సీఏఏని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Ram Temple In Ayodhya: అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం, నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తాం, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే తెరదించిన సంగతి తెలిసిందే. చారిత్రాత్మక తీర్పు ( Ayodhya verdict) వచ్చిన తర్వాత అందరిలోనూ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం (Ram Temple In Ayodhya) ఎప్పుడు ప్రారంభిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

Narendra Modi On Anti-CAA Protest: స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు, హింసాత్మక నిరసనలు మన ధర్మం కాదన్న ప్రధాని మోడీ

Hazarath Reddy

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై(Citizenship Amendment Act) ఈశాన్య రాష్ట్రాలు సహా పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో (Jamia Millia Islamia University) పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi)విచారం వ్యక్తం చేశారు.

Jharkhand Polls: జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు, బరిలో ప్రముఖులు, అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.25 కోట్లు,75 మంది అభ్యర్థులకు నేర చరిత్ర, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

Hazarath Reddy

జార్ఖండ్ (Jharkhand)రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగో విడత పోలింగ్ ( Jharkhand Assembly Elections 2019 Phase 4) ప్రశాంతంగా జరుగుతోంది. 15 అసెంబ్లీ స్థానాలకు (15-assembly-seats) పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 221 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓటర్లున్నారు.

Uttar Pradesh: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో రాని మార్పు, యువతిపై అత్యాచారం చేసి నిప్పంటించిన దుండుగుడు, ఉన్నావ్ రేప్ ఘటన మర్చిపోక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య యువతి

Hazarath Reddy

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఉన్నావ్‌ ఘటన (Unnao Rape Case) మర్చిపోక ముందే ఆ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. 18ఏళ్ల యువతిపై దుండగుడు అత్యాచారం చేసి తర్వాత నిప్పు(Teenager Raped And Set On Fire)పెట్టాడు. 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

Advertisement

Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పు నేడే, బీజేపీ ఎమ్మెల్యే భవితవ్యాన్ని తేల్చనున్న ఢిల్లీ కోర్టు, తీర్పు ఇవ్వనున్న జిల్లా జడ్జ్‌ ధర్మేష్‌ శర్మ, 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌‌లో అత్యాచార ఘటన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు (Delhi's Tis Hazari Court) ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. యువతిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఈ కేసులో(Unnao Rape Case) బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌ (former BJP MLA Kuldeep Singh Sengar) నిందితుడిగా ఉన్నారు.

Vartika Singh: నా రక్తంతో రాస్తున్నా, వారిని ఉరి తీసే అవకాశం నాకివ్వండి, హోం మంత్రి అమిత్ షాను కోరిన ఇంటర్నేషనల్ షూటర్ వర్తిక సింగ్‌, త్వరలో నిర్భయ నిందితులని ఉరి తీసే అవకాశం

Hazarath Reddy

2012 డిసెంబరులో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన (Nirbhaya gang-rape case) దేశ వ్యాప్తంగా తీవ్ర పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఈ నెలలో తెలంగాణాలో జరిగిన దిశ ఘటన (Disha Rape Murde case) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘోరమైన ఘటనలే కాకుండా ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, ఆపై హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.

Biryani Seller: బిర్యాని అమ్మాడని చావబాదారు, కుల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ నోయిడా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం

Hazarath Reddy

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం(Casteism) మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మళ్లీ ఈ కుల జాడ్యం పడగవిప్పింది. అక్కడ ఓ దారుణం చోటు చేసుకుంది.దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడా(Greater Noida)లోని రబుపురాలో ఈ దాడి జరిగింది.

CAA Stir: రైల్వే స్టేషన్లకు నిప్పు, పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ బిల్లును నిరసిస్తూ మిన్నంటిన ఆందోళనలు, కఠిన చర్యలు తప్పవన్న మమతా బెనర్జీ, ఆందోళనకారుల ధాటికి పలు రైళ్లు రద్దు

Hazarath Reddy

అధికార పార్టీ బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (amended Citizenship Act) కొన్ని రాష్ట్రాల్లో నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు మిన్నంటాయి.

Advertisement
Advertisement