World

AI-Powered Sex Robots: పడక గదిలోకి సెక్స్ రోబోలు వస్తే ఇకపై భార్యల అవసరం ఉండదు, గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో రోజురోజుకు గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం, కృత్రిమ మేధస్సు అనేక పరిశ్రమలలో అధిక భాగాన్ని కవర్ చేస్తుంది. ఈ విధంగా, కృత్రిమ మేధస్సు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. Google మాజీ ఎగ్జిక్యూటివ్ దీనిపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.

USA Horror: అమెరికాలో ఘోరం.. భారతీయ విద్యార్థినిపై పిడుగు.. స్నేహితులతో పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఘటన.. పిడుగుపాటుతో పక్కనే ఉన్న కొలనులో పడిపోయిన విద్యార్థిని.. 20 నిమిషాల పాటు ఆగిన గుండె.. బ్రెయిన్ డ్యామేజ్.. యువతి పరిస్థితి విషమం

Rudra

అమెరికాలో ఘోరం జరిగింది. పై చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె లయ తప్పింది.

Trailer-Truck Accident Video: పట్టాలు దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్, పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో

VNS

ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ ట్రైన్ (Brantas collided with a trailer truck) ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ గాయపడ్డాడు. వెస్ట్ సిమరాంగ్ లోని (West Semarang) జలన్ మదుకొరోలో (Jalan Madukoro) రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కును ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది.

Earthquake in El Salvador: పసిఫిక్ తీరంలో భారీ భూకంపం, ఎల్‌ సాల్వడార్‌ లో 6.5 తీవ్రతతో కంపించిన భూమి, కేవలం 70 కి.మీ లోతులోనే భూకంప కేంద్రం

VNS

ఎల్ సాల్వడార్ పసిఫిక్ తీరంలో బుధవారం తెల్లవారుజామున భారీభూకంపం సంభవించింది. మళ్లీ రెండో సారి బుధవారం ఉదయం 5.52 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. (El Salvadors San Salvador Earthquake) మంగళవారం ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని ఎల్ సాల్వడార్‌ పర్యవరణ మంత్రిత్వశాఖ తెలిపింది.

Advertisement

Typhoon Talim: ఆసియా దేశాలను వణికిస్తున్న తాలిమ్ టైఫూన్, 20 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న రాకాసి అలలు, చైనా, వియాత్నం, హాంగ్‌కాంగ్ దేశాలు విలవిల

Hazarath Reddy

US Shooting: తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ఏడాది వయసున్న చెల్లిని కాల్చేసిన మూడేళ్ల చిన్నారి, తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఓ చిన్నారి తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున తన ఏడాది వయసున్న సోదరిని చంపేసింది ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కిడంతో అక్కడే ఆడుకుంటున్న చెల్లి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది

Mystery Object in Australia: ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 శకలం? రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న వస్తువు.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ..

Rudra

పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు కలకలానికి దారితీసింది. రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటో అర్థంకాక స్థానికులు పెద్దయెత్తున చర్చించుకుంటున్నారు.

2,600 Flights Cancelled in US: అమెరికాలో 2600 విమానాలు రద్దు, భారీ వరదలకు తోడైన పిడుగులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక

Hazarath Reddy

అమెరికా(USA)లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో కూడిన పిడుగుల కారణంగా ఆదివారం యునైటెడ్ స్టేట్స్ అంతటా 2,600 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి.

Advertisement

iPhone Ban in Russia: రష్యాలో ఐఫోన్లు బ్యాన్, సంచలన నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు పుతిన్, ఉద్యోగులు ఇకపై కార్యాలయంలో ఐఫోన్‌లను వాడరాదని ఆదేశాలు

Hazarath Reddy

ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSS) వేలాది మంది అధికారులకు చెప్పిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.

China: బాబోయ్.. బ్రా లోపల ఐదు బతికున్న పాములను పెట్టుకుని మహిళ స్మగ్లింగ్, చైనా ఎయిర్ పోర్టులో పట్టుబడిన ప్రయాణికురాలు

Hazarath Reddy

చాలా విచిత్రమైన పనులు చేయడం, దాని కోసం ఇబ్బందులు పడడం అనేవి సర్వసాధారణం. తాజాగా అలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. ఎయిర్‌పోర్టులో ఓ మహిళ తన బ్రాలో ఐదు బ్రతికున్న పాములను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడింది.

Pakistan: పాకిస్థాన్‌లో 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న హిందూ దేవాలయం కూల్చివేత, కరాచీలోని మారిమాత ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని బిల్డర్

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌ కరాచీలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. కరాచీలోని సోల్జర్‌ బజార్‌లో 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న మారిమాత ఆలయం ఉంది. అయితే, షాపింగ్‌ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్‌ ఆలయాన్ని కూల్చివేశారు.

Pakistan: గోధుమ పిండి కిలో 320 రూపాయలు, దాయాది దేశంలో ఒక్కసారిగా పెరిగిన ధర, ద్రవ్యోల్భణం పెరగడంతో పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు

Hazarath Reddy

పాకిస్థాన్‌ (Pakistan) తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకుంది. దాయాది దేశంలో ద్రవ్యోల్భణం (Inflation) పెరగడంతో దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గోధుమ పిండి ధర అయితే భారీగా పెరిగింది. అక్కడ గోధుమ పిండికి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Advertisement

USA Earthquake: అమెరికాలో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై ఏకంగా 7.4 నమోదు, సునామీ హెచ్చరికలు..ఆందోళన చెందుతున్న NRI భారతీయులు..

kanha

అమెరికాలోని అలస్కాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంపం సంభవించిన తరువాత, ఇక్కడ సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ భూకంపం యొక్క తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది.

Jai Ho Song: జయహో సాంగ్ విని మంత్రముగ్ధుడైన ఫ్రాన్స్ అధ్యక్షుడు, రెండుసార్లు పాటను ప్లే చేసిన అధికారులు, పారిస్‌లో ప్రధాని మోదీతో విందులో ఘటన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జులై 14న ప్యారిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందులో 'జై హో' పాట రెండుసార్లు ప్లే చేయబడింది. అతిథులు విందు హాలులోకి ప్రవేశించిన వెంటనే ఈ పాటను మొదట ప్లే చేశారు, విందు ముగింపులో ప్లే చేయబడింది.

Zarina Hashmi Google Doodle: జరీనా హాష్మీ 86వ జయంతి, ఇండియన్ అమెరికన్ ప్రింట్ మేకర్ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ డూడుల్ ఇదిగో..

Hazarath Reddy

ఇండియన్ అమెరికన్ ప్రింట్ మేకర్ అయిన జరీనా హాష్మీ స్మృతిలో నేటి డూడుల్‌ను రూపొందించడం జరిగింది. మినిమలిస్ట్ మూవ్‌మెంట్‌కు చెందిన అత్యంత ముఖ్యమైన ఆర్టిస్ట్‌లలో ఒకరిగా ఈమె విశేష గుర్తింపు పొందారు.జరీనా పేపర్‌మేకింగ్ టెక్నిక్‌లతో ప్రయోగాలు చేసింది, భారతదేశంలోని నిపుణులైన కళాకారులతో ఆమె పని చేసింది.

PM Modi UAE Visit: యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహార భద్రత, శాస్త్ర సాంకేతికత, విద్య తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు

kanha

యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబిలోని కసర్ అల్ వతన్‌లో ప్రధానమంత్రిని సత్కరించారు.

Advertisement

Japan Rocket Explode: ఇటు చంద్రయాన్ సక్సెస్.. అటు పేలిపోయిన రాకెట్‌ .. జపాన్ లో పరీక్ష దశలోనే పేలిపోయిన రాకెట్‌ ఇంజిన్ (వీడియోతో)

Rudra

చంద్రయాన్ సక్సెస్ తో ఒకవైపు ఇండియన్స్ సంబురాలు చేసుకొంటుంటే ప్రపంచంలో అతి భారీ అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో ఒక‌టైన జపాన్‌కు షాక్ తగిలింది. జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎప్సిలాన్‌ రాకెట్ ఇంజిన్‌ పరీక్షల స‌మ‌యంలోనే పేలిపోయింది.

Indian Student Attacked in Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కారులోంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టిన ఖలిస్థానీ మద్దతుదారులు

Rudra

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిపై(23) దాడి జరిగింది. అతడిని ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సిడ్నీ నగరంలోని మెర్రీల్యాండ్స్‌లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

Plane Veers Off Runway: రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం, ఏయిర్‌పోర్ట్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలైన ప్లేన్, మిరాకిల్‌ గా చిన్న చిన్నగాయాలతో బయటపడ్డ ప్రయాణికులు, వీడియో ఇదుగోండి!

VNS

ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది (Plane veers off runway). ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్‌ జరిగింది. జూలై 11న మధ్యాహ్నం 12:23 గంటలకు హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 విమానం క్రాష్‌ ల్యాండ్‌కు ప్రయత్నించింది.

Doctors Reattach Boys Head: మొండెం నుంచి వేరుపడ్డ తలను తిరిగి అతికించిన డాక్టర్లు, ఇజ్రాయిల్‌ వైద్యుల అద్భుతం, 12 ఏండ్ల బాలుడికి పునర్జన్మ

VNS

ఇజ్రాయెల్‌ వైద్యులు అధ్బుతం సాధించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మనిచ్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏండ్ల బాలుడు: సులేమాన్‌ హసన్‌ సైకిల్‌పై వెళ్తుండగా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హసన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయింది. వెంటనే అతడిని విమానంలో హదస్సా మెడికల్‌ సెంటర్‌కు తరలించారు.

Advertisement
Advertisement