Entertainment

Actress Pragya Nagra: ఆ వీడియో నాది కాదు.. ఏఐ కంటెంట్‌తో ఫేక్ వీడియోలు, అలాంటి వారిని చూస్తే జాలేస్తోందన్న నటి ప్రగ్యా నగ్రా

Arun Charagonda

తన ప్రైవేట్ వీడియోలు లీక్ అంశంపై స్పందించింది నటి ప్రగ్యా నగ్రా. ఆ వీడియో నాది కాదు.. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారి చూస్తే జాలేస్తోందన్నారు. తనకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్ చెప్పారు. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదని చెప్పారు.

Dil Raju As TFDC Chairman: టీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్‌ గా నిర్మాత‌ దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వం నియామకం

Rudra

ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌ డీసీ) ఛైర్మ‌న్‌ గా రాజును నియ‌మిస్తున్నట్టు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన అల్లు అర్జున్, త్వరలో కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి

Hazarath Reddy

Gango Renuka Thalli Audio Song: పుష్ప‌-2 గంగ‌మ్మ జాత‌ర సాంగ్ వ‌చ్చేసింది, థియేట‌ర్ లో ఈ పాట‌కు గూస్ బంప్స్ ఖాయం

VNS

తాజాగా ‘గంగో రేణుక తల్లి’ (Gango Renuka Thalli) జాత‌ర ఆడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాల‌కు పైగా ఉన్న ఈ సీన్ బ‌న్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్ర‌బోస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించ‌గా.. మ‌హాలింగం పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

Advertisement

Sobhita Dhulipala & Naga Chaitanya: 66 ఏళ్ళ వయసులో కూడా 6 ప్యాక్, నాగార్జున బాడీ చూసి షాకవుతున్న నెటిజన్లు, మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు

Hazarath Reddy

శ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.

Allu Arjun on Sandhya Theatre Stampede: సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్, ఏమన్నారంటే..

Hazarath Reddy

సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో తీవ్ర హృదయ విదారకంగా ఉంది. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో ఘటనలో దుఃఖిస్తున్న మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని , ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.

Naga Chaitanya: నాగార్జున మొదటి మాజీ భార్య ఈమే, తల్లితో ఉన్న ఫోటోను విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య, రెండు రోజుల క్రితం శోభిత దూళిపాళ్లతో చై వివాహం

Hazarath Reddy

అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.

Actress Pragya Videos Leak: నటి ప్రగ్యా ప్రైవేట్ వీడియోలు లీక్?, ఆన్‌లైన్‌లో పెట్టిన దుండగులు...నిందితులపై చర్యలకు ఫ్యాన్స్ డిమాండ్!

Arun Charagonda

నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రగ్యా వీడియోలను ఆన్ లైన్ లో దుండగులు పెట్టినట్లు తెలుస్తోండగా వారిపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఎక్స్ లో #pragyanagra హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Advertisement

Suresh Gopi: శంకరాభరణం సినిమాలో బ్రోచే వారెవరురా పాటపాడిన కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

శంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు.

Pushpa 2: The Rule: ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ

Hazarath Reddy

పుష్ప: ది రూల్‌’ తొలి రోజునే భారీ టాక్‌ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్‌ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది.

Pushpa-2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Keerthy Suresh Wedding Invitation: కీర్తి సురేష్ పెళ్లి ప‌త్రిక లీక్, డిసెంబ‌ర్ 12 న గోవాలో పెళ్లి, ఇంత‌కీ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ లో ఏముందంటే?

VNS

మహానటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌తో గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం జరిపిన ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కీర్తితో పాటు ఆమె తండ్రి సురేశ్‌కుమార్‌ కూడా ధృవీకరించాడు.

Advertisement

Police Case on Allu Arjun: అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

VNS

నిన్న రాత్రి అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రీమియర్ షోలు వేయగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక (Rashmika), మరికొంతమంది మూవీ టీమ్ వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది.

Pushpa 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప 2 ఓటీటీ రైట్స్, దాదాపు రూ. 250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Hazarath Reddy

డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌-ర‌ష్మిక మంద‌న్న జంట‌గా వ‌చ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Mythri Movie Makers: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించిన మేకర్స్

Arun Charagonda

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకరమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం..ఆ బాలుడి గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది

Pushpa 2: The Rule: సంధ్య థియేటర్లో సృహ కోల్పోయిన బాలుడు పుష్ప డ్యాన్స్ వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ వేసిన స్టెప్స్ నెట్టింట వైరల్

Hazarath Reddy

అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ పుష్ప డాన్స్..సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. పుష్ప పాటకు శ్రీతేజ వేసిన డాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Advertisement

Pushpa 2: The Rule: పుష్ప 2 లో ఎవడ్రా బాస్ అనే డైలాగ్‌ నిజంగా అలానే ఉందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంట్రవర్సీ డైలాగ్ అసలు వాస్తవం ఇదే..

Hazarath Reddy

పుష్ప 2 నుండి "ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? ఆడికి, ఆడి కొడుకుకి, ఆడి తమ్ముడికి నేనే బాస్" అనే డైలాగ్ ఇలా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపిస్తుంది . మెగా ఫ్యామిలీకి బన్నే బాస్ అని చెప్పేందుకు ఈ ఫేక్ డైలాగ్ ప్రచారం జరుగుతోంది. ఈ పుకారు ఎందుకు వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు-

Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్ ముసుగులో రెచ్చిపోయిన ఆకతాయిలు, ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చించివేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆళ్లగడ్డలో బన్నీ ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చింపేశారు. సినిమా ప్రదర్శింస్థుడగానే రెండవ పాట ఫీలింగ్స్ పాటకు స్క్రీన్ ముందు స్టెప్పులు వేసిన ఫ్యాన్స్. అదే సమయంలో స్క్రీన్ ను చింపేశారు.

Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వచ్చి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణమని మృతురాలి భర్త ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్

Hazarath Reddy

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానంటూ రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప 2 మార్నింగ్ షో సందర్భంగా ధియేటర్లో అగ్నిప్రమాదం, నల్గొండ వెంకటేశ్వరా థియేటర్లో బాణసంచా కాల్చడంతో ఎగసిపడిన నిప్పురవ్వలు

Hazarath Reddy

నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్‌ షోలో పుష్ప 2 ది రూల్‌ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్‌ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి.

Advertisement
Advertisement