Stones pelted at Allu Arjun's house at Hyderabad(video grab)

Hyderabad, Dec 23: సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇంటిపై రాళ్ల దాడి (Stones pelting) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. దాడి చేసినవారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆరుగురిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్టు వెల్లడించారు.  నిందితులపై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు వివరించారు.  అనంతరం వీళ్లు బెయిల్ పై విడుదలయ్యారు. కాగా ఇకపై ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Here's Video:

అసలేం జరిగింది?

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్‌ నివాసం ముందు ఆదివారం ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు. బన్నీ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు. కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో