సినిమా

Raghavendra Rao YouTube Channel: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన రాఘవేంద్రరావు, కేఆర్ఆర్ వర్క్స్ ద్వారా కొత్తవారి టాలెంట్ వెలికి తీస్తామని వెల్లడి, ఛానల్ లాంచ్ చేసిన రాజమౌళి

Hazarath Reddy

దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్రరావు డిజిటల్ బాట పట్టారు. కేఆర్ఆర్ వర్క్స్’ పేరిట సరికొత్త యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేశారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. కొత్త వారిని వెండి తెరకు పరిచయం చేయాలని ‘కేఆర్ఆర్ వర్క్స్’ చానెల్ ఏర్పాటు చేశారు.

K. Vishwanath: కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్, చంద్రబాబు

Rudra

ప్రముఖ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

K Viswanath Passed Away: కన్నుమూసిన కళా తపస్వి కె. విశ్వనాథ్, దివికేగిన శంకరాభరణం, శివైక్యమైన స్వాతిముత్యం..

kanha

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు

Director Sagar Dies: ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత, అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు సాగర్‌(విద్యాసాగర్‌ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఈ ఉదయం గం. 6.03ని.లకు తుదిశ్వాస విడిచారు.

Advertisement

Actress Flora Saini: ఆ ప్రముఖ నిర్మాత నా ప్రైవేట్ పార్టుల్లో అది పెట్టి దారుణంగా గాయపరిచాడు, బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు, అయితే ఆ నిర్మాత ఎవరనేది వెల్లడించని బాలీవుడ్ భామ

Hazarath Reddy

బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ.. ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. గత 14 నెలలుగా నేను నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది.

Ileana: ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపిన ఆమె తల్లి

Rudra

గోవా బ్యూటీ ఇలియానా అనారోగ్యంపై ఆమె తల్లి స్పందించారు. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో, ఆమె డీహైడ్రేషన్ కు గురయిందని... ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు. మరోవైపు ఇల్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

Tarakaratna Health Update: తారకరత్న కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి

Hazarath Reddy

సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి..ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు.

Tarakaratna Health Update: ఇంకా వెంటిలేటర్ పైనే తారకరత్న, ఎక్మో సపోర్ట్ వార్తల్లో నిజం లేదని తెలిపిన వైద్యులు, ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని వెల్లడి

Hazarath Reddy

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు.

Advertisement

Pathaan Bromance: వీడియో, జాన్ అబ్రహం బుగ్గపై ముద్దుపెట్టిన షారూఖ్ ఖాన్,చాలా తియ్యగా ఉందని ఖుషీ అయిన అబ్రహం, జాన్‌తో ఇది మొదటిదని తెలిపిన షారూఖ్

Hazarath Reddy

సోమవారం జరిగిన 'పఠాన్' సక్సెస్ ఈవెంట్‌లో షారుక్ ఖాన్ జాన్ అబ్రహం చెంపపై ముద్దు పెట్టాడు.SRK మాట్లాడుతూ "నేను దీపికకు చాలా సార్లు ముద్దులు ఇచ్చాను. జాన్‌తో ఇది మొదటిది. చాలా భిన్నంగా ఉందని షారూఖ్ అన్నాడు.

Kajal Aggarwal Visited Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కాజల్ అగర్వాల్, వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో..

Hazarath Reddy

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు #TTD అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.

Mega Family Photo: మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫొటో పంచుకున్న నాగబాబు

Rudra

మెగా బ్రదర్ నాగబాబు తమ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో పంచుకున్నారు.

Taaraka Ratna Health Update: తారకరత్న 100శాతం కోలుకుని తిరిగి వస్తాడు, ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన మంచు మనోజ్, భావోద్వేగంగా పోస్టు పెట్టిన హీరో

VNS

తొందరలోనే రికవరీ అయి మన ముందుకు వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో తారకరత్న ఆరోగ్యంపై నిన్నటి దాకా టెన్షన్‌ పడ్డ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లిన మంచు మనోజ్‌.. ఐసీయూలో ఉన్న తారకరత్నను (taraka ratna) చూశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీని పరామర్శించారు.

Advertisement

Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న తరలింపు.. నిలకడగానే ఆరోగ్యం

Rudra

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరుకు తరలించారు.

Actor Naresh: నా హత్యకు రమ్య రఘుపతి కుట్ర.. సినీ నటుడు నరేష్ సంచలన ఆరోపణలు

Rudra

ప్రముఖ సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Unstoppable With Pawan Kalyan: పవన్ నీ మూడు పెళ్లిళ్ల గోలేంటి? అన్ స్టాపబుల్ షో లో ఆసక్తికర సమాధానాలు చెప్పిన పవన్ కల్యాణ్

VNS

పవన్‌ను పలు సీరియస్ ప్రశ్నలు అడిగాడు బాలయ్య. మూడు పెళ్లిళ్ల గొడవ (marriages) ఏమిటని బాలయ్య అడగ్గా.. పవన్ సమాధానం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇంతటి మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య అడగడంతో ఈ ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.

NBK X PSPK Part 1 Promo: అన్నయ్య రూంలోకి వెళ్లి పిస్టల్ తీసుకుని, పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ ప్రోమో ఇదిగో.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వీడియో..

Hazarath Reddy

బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‏స్టాపబుల్ సీజన్ కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి విదితమే. దీనికి సంబంధించి ఇప్పటికీ అప్ డేట్ ఇచ్చిన టీం తాజాగా ప్రోమోను విడుదల చేసింది.బాలయ్యతో పవర్ స్టార్ వీడియో అదిరిపోయింది. వీడియో ఇదిగో..

Advertisement

Jabardasth Racha Ravi: రోడ్డు ప్రమాదంలో రచ్చరవికి తీవ్ర గాయాలంటూ వార్తలు, ఇదంతా ఫేక్ అంటూ ఖండించిన జబర్దస్త్ ఆర్టిస్ట్, తాను క్షేమంగా ఉన్నానని వెల్లడి

Hazarath Reddy

పుణే నుంచి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రచ్చరవికి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సూర్యాపేట - మునగాల వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు కథనాలొచ్చాయి.

Taraka Ratna Health Update: తారకరత్నకు హార్ట్‌లో కుడి,ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్, మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌ లెఫ్ట్‌ సైడ్‌తో కుప్పకూలారని తెలిపిన బాలకృష్ణ, బెంగుళూరు తరలించేందుకు ఏర్పాట్లు

Hazarath Reddy

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్‌లు వేయలేదు. యాంజియోగ్రామ్‌ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్‌ వేస్తారా?.. ఇతర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారా? అనేది వేచిచూడాలి.

Srinivasa Murthy Dies: మీ మరణం నాకు తీరని లోటు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతపై ఎమోషనల్ ట్వీట్ చేసిన స్టార్ హీరో సూర్య

Hazarath Reddy

శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. సూర్య ట్విటర్‌లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు.

Jamuna No More: ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని చెప్పారు.

Advertisement
Advertisement