సినిమా

#LionInLamborghini: లంబోర్గిని కారులో రజనీకాంత్, ఖుషీ అవుతున్న ఫ్యాన్స్, కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్

Hazarath Reddy

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ లంబోర్గిని కారును (Lamborghini Car) స్వయంగా నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఓ ఫొటో సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రజనీకాంత్ (Rajinikanth) ముఖానికి మాస్క్‌ ధరించి కారును డ్రైవ్‌ చేస్తున్నారు. కాగా ఆయన డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రపంచంలో అత్యంత వేగంవంతమైన కార్లలో ఒకటి. సాధారణమైన తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్‌లో లంబోర్గిని కారును నడుపుతున్నట్లు సూపర్‌ స్టార్‌ కనిపిస్తున్నారు.

Suicide or Murder: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఇతివృత్తంగా సినిమా, సూసైడ్ ఆర్ మర్డర్ పేరిట తెరకెక్కిస్తున్న బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా, టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ లీడ్ రోల్

Hazarath Reddy

ఇటీవలే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ( Sushant Singh Rajput Suicide) చేసుకోగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలేంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొందరు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు కాని..ఆయన మరణంపై సినిమాలు మాత్రం వస్తున్నాయి. సుశాంత్ మృతిని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా 'సూసైడ్ ఆర్ మర్డర్' ( Suicide or Murder) పేరిట సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.

Upasana Konidela Birthday: ద‌యా హృద‌యంతో నీవు చేసే పనులు ఎప్పటికీ వృధాకావు, శ్రీమతికి చెర్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు, పూల హరివిల్లు మధ్యన ఉపాసన

Hazarath Reddy

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) స‌తీమ‌ణి ఉపాస‌న ఈ రోజు 31వ వ‌సంతంలోకి (Upasana Konidela Birthday) అడుగుపెట్టింది. ఈ సంద‌ర్బంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆమెకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా ఆమె భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ .. త‌న శ్రీమ‌తికి సంబంధించిన ఫోటో ఒక‌టి షేర్ చేస్తూ.. ద‌యా హృద‌యంతో నువ్వు చేసే ప‌నులు చిన్న‌వైన ఎప్ప‌టికీ వృధాకావు. రివార్డులు వ‌చ్చిన కూడా నీ ప‌నుల‌ని ఇలానే కొన‌సాగిస్తావ‌ని ఆశిస్తున్నాను.. హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ చ‌ర‌ణ్ త‌న పోస్ట్‌లో తెలిపారు. ఫోటోలో పూల హ‌రివిల్లు మ‌ధ్య కూర్చున్న ఉపాస‌న (Upasana Kamineni Konidela) దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

#Prabhas21: ప్రభాస్ 21లో సర్‌ప్రైజ్, డార్లింగ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ దీపిక, అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్

Team Latestly

ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధా కృష్ణ కుమార్ పాత్రలో 'రాధే శ్యామ్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఇటీవలే ఆవిష్కరించబడింది. యూరప్‌లో ఓ జంట మధ్య ఆవిష్కరింపబడే ప్రేమ కథగా రాధేశ్యామ్ రూపొందుతోంది. మరోవైపు దీపిక తన భర్త రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న '83 సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన 1983 క్రికెట్ ప్రపంచ కప్..

Advertisement

Sushant Singh Rajput Death Case: సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు

Hazarath Reddy

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై (Sushant Singh Rajput Suicide) సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు బీహార్ ఎంపి పప్పు యాదవ్ (Bihar MP Pappu Yadav) లేఖ పంపారు. బీహార్ ఎంపి పప్పు యాదవ్ ఈ లేఖను షాకు జూన్ 16 న సంబంధిత విభాగం ముందుకు తీసుకెళ్లినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా సుషాంత్ మరణించిన సరిగ్గా నెల తరువాత జూలై 14 న పప్పు యాదవ్ అమిత్ షా నుండి నిర్ధారణ లేఖను పంచుకున్నారు.

Sarrainodu Hindi Version: బన్ని సినిమా సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 300 మిల్లియన్స్ వ్యూస్ కొల్లగొట్టిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్‌, ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ మాస్ యాక్షన్

Hazarath Reddy

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ (Sarrainodu Hindi Version) యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ (300 million YouTube views) క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు

Love Story: నాగ చైతన్య సినిమాకు కొరియోగ్రఫీ చేయనున్న సాయి పల్లవి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న 'లవ్ స్టోరీ'!

Team Latestly

సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు, తన డాన్సింగ్ స్కిల్స్ తో కూడా ఎంతో మందిని ఫిదా చేసింది, తాను స్వతహాగా మంచి శిక్షణ పొందిన డాన్సర్ కూడా. దీనిని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీలో...

Chiranjeevi's 'Acharya': మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఆసక్తికరం, చెర్రీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ ఫిక్స్, మరిన్ని విశేషాలు చదవండి

Team Latestly

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. మరోవైపు రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఎస్.ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR సినిమాపై కూడా అభిమానుల్లో ఆత్రుత నెలకొని ఉంది...

Advertisement

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, ముంబై నానావతి ఆసుపత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల సంఘీభావం

Team Latestly

నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను, ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక నాతో....

Radhe Shyam First Look: ప్రభాస్ న్యూ లుక్ వెరీ రొమాంటిక్, అదరగొడుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే, రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల

Hazarath Reddy

అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన ప్ర‌భాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ (Prabhas 20 First Look) రానే వ‌చ్చింది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏమాత్రం మెరుపు త‌గ్గ‌ని ప్ర‌భాస్ (Prabhas) రాయ‌ల్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. బాహుబలి' తరువాత గత సంవత్సరం 'సాహో'తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఇప్పుడు 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి 'రాధే శ్యామ్' అనే (Radhe Shyam First Look) టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

Suddala Ashok Teja: నేను మీ దయతో బాగానే ఉన్నాను, పుకార్లు నమ్మకండి, వీడియో ద్వారా సందేశాన్ని పంపిన గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ

Hazarath Reddy

ప్రముఖ తెలుగు సినిమా గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో (health condition) ఎలాంటి నిజం లేదని అలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Dil Bechara: 'పుట్టుక, చావు మన చేతుల్లో లేవు కానీ ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉంది'! కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్

Team Latestly

ఒక రాజు.. ఒక రాణి, ఇద్దరు చనిపోయారు.. కథ సమాప్తం'! అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా జూలై 24న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌ షో వేయబడుతోంది...

Advertisement

Bigg Boss 14: రేటు పెంచేసిన సల్మాన్‌ ఖాన్‌, బిగ్‌బాస్‌ 14కు ఒక్కో వారానికి 16 కోట్లు తీసుకోనున్నారని వార్తలు, అక్టోబర్‌ నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ 14..!

Hazarath Reddy

బిగ్‌బాస్‌ షోకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న విషయం విదితమే. ఈ షోకి కర్త,కర్మ,క్రియ అన్నీ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) అని చెప్పవచ్చు. 2010 నుంచి దాదాపు 10 సీజన్‌లుగా సల్మాన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఏడాది కరోనా కారణంగా బిగ్‌బాస్‌ షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి బిగ్‌బాస్‌ షో ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nick Cordero Dead: కరోనాతో హాలీవుడ్ న‌టుడు మృతి, కోవిడ్-19తో పోరాడి ఓడిన నిక్ కార్డెరో, బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే చిత్రానికి సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డు అందుకున్న కెనడా సూపర్ స్టార్

Hazarath Reddy

హాలీవుడ్ న‌టుడు టోనీ అవార్డు గ్రహిత నిక్ కార్డెరో క‌రోనా కార‌ణంగా తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. కోవిడ్-19 వైర‌స్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఆదివారం ఆయ‌న (Nick Cordero Dead) శాశ్వ‌త విశ్రాంతి తీసుకున్నారు. 41 ఏళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో క‌రోనా సోకడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌ అత‌ని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో వైద్యులు ఆయ‌న‌ కాలును సైతం తీసేశారు. తాజాగా అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత‌ విష‌మించ‌డంతో ఆదివారం తుది శ్వాస విడిచారు.

Tuticorin Deaths: అవి క్రూర‌మైన హ‌త్య‌లు, తూత్తుకుడి తండ్రీకొడుకులు చనిపోయిన ఘటనపై స్పందించిన రజినీకాంత్, వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రభుత్వాన్ని కోరిన తలైవార్

Hazarath Reddy

త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు (Tuticorin father-son) పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌నపై సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను ర‌జ‌నీకాంత్ ‘క్రూర‌మైన హ‌త్య‌లు’గా (brutal killing) ప‌రిగ‌ణించారు. నిబంధ‌న‌లకు విరుద్ధంగా కొంత‌మంది పోలీసులు పైశాచికంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ర‌జ‌నీకాంత్ మండిప‌డ్డారు. ఇలాంటి త‌ప్పు చేసిన‌వారిని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని ఆయన డిమాండ్ చేశారు.

Vikas Gupta: ఈ బాలీవుడ్‌ నిర్మాత బైసెక్సువల్‌, తనను ద్విలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి

Hazarath Reddy

బాలీవుడ్‌ నిర్మాత, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా (Vikas Gupta) పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటారా.. ట్విట్టర్లో (Twitter) ఆయన ఓ సంచలన ట్వీట్ చేశారు. తన జీవితం గురించి ఓ నిజాని బయటపెట్టారు. ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా తాను బైసెక్సువల్‌ (I am bisexual) అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Advertisement

Thalapathy Vijay Birthday: తమిళనాడులో వైయస్ జగన్ హవా, విజయ్ బర్త్‌డే సంధర్భంగా పోస్టర్లలో ఏపీ సీఎం ఫోటో, విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్ అంటూ క్యాప్షన్

Hazarath Reddy

నేడు తమిళ్ తలపతి విజయ్ పుట్టిన రోజు (Thalapathy Vijay Birthday). ఆయన పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో వెలసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. విజయ్ పుట్టిన రోజుపై బ్యానర్లను ఏర్పాటు చేసిన అబిమానులు అంందులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఫోటోని పెట్టారు. ఇది సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు ( Happy Birthday Thalapathy) సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలు ముద్రింపబడ్డాయి.

Hoax Bomb Threat: రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు, అణువణువునా గాలించిన బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలు, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Hazarath Reddy

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు (Rajinikanth hoax bomb threat) వచ్చింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని అది ఏ క్షణమైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ (bomb threatening call) రావడంతో పోలీసులు పరుగు పరుగున తలైవా ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువునా గాలించారు. అయితే ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో ఫేక్ కాల్‌గా గుర్తించారు.

Sushant Singh Rajput's Death: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని మర్డర్ చేశారు, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, సిబీఐ విచారణ జరిపించాలని కోరిన జ‌న్ అధికార్ పార్టీ చీఫ్ ప‌ప్పూ యాద‌వ్

Hazarath Reddy

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని త‌న నివాసంలో నిన్న ఉరి వేసుకుని చ‌నిపోయిన (Sushant Singh Rajput's Death) విష‌యం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ చేసుకున్న‌ట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ హీరో మ‌ర‌ణంపై కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్‌ను మ‌ర్డ‌ర్ చేశార‌ని జ‌న్ అధికార్ పార్టీ (Jan Adhikar Party) చీఫ్ ప‌ప్పూ యాద‌వ్ ఆరోపించారు. పాట్నాలోని సుశాంత్ ఇంటికి వెళ్లిన ప‌ప్పూ యాద‌వ్‌ (Pappu Yadav) అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ హీరో సుశాంత్‌ ఆత్మ‌హ‌త్య చేసుకునే వ్య‌క్తి కాద‌న్నాడు. సుశాంత్ మ‌ర‌ణం కేసులో సీబీఐ విచార‌ణ (CBI Inquiry) చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Sushant Singh Rajput: కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్

Team Latestly

ఒక బాలీవుడ్ యంగ్ హీరో, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరం అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాని, అతడి కుటుంబ సభ్యులకు దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని బాలీవుడ్ స్టార్స్ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు...

Advertisement
Advertisement