సినిమా

Allu Arjun Approached High Court: హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్, సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో కేసు కొట్టివేయాల‌ని పిటీష‌న్

VNS

హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును (High Court) ఆశ్రయించాడు. హైదరాబాద్‌ ఆర్జీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశాడు.

Mohan Babu Health Update: మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు, మరో రెండు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడి

Hazarath Reddy

మోహన్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మోహన్ బాబు ఎడమవైపు కంటి కింద గాయాలు అయ్యాయని తెలిపారు. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్‌కి వచ్చేటప్పటికి మోహన్ బాబు హైబీపీతో బాధ పడుతున్నారు.

Akhanda 2 Release Date: ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది, గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య అఖండ 2 ప్రోమో, వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సినిమా విడుదల

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు.

Manchu Manoj: రాచకొండ సీపీకి మంచు మనోజ్ రూ.లక్ష బాండ్, ఎలాంటి గొడవలకు దిగగని బాండ్ సమర్పించిన మనోజ్

Arun Charagonda

రాచకొండ సీపీకి రూ.లక్ష బాండ్ సమర్పించారు మంచు మనోజ్‌. తాను ఎలాంటి గొడవలకు దిగనని శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని సీపీకి బాండ్‌ సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారరని మండిపడ్డారు. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

Manchu Family Dispute: ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం

Hazarath Reddy

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మధ్య ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వివాదం ముద‌ర‌డంతో తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్‌ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Manchu Family Dispute: ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం వల్లే మా నాన్నకు కోపం వచ్చింది, తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలిపిన మంచు విష్ణు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Mushtaq Khan Kidnapped: ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్‌ కిడ్నాప్, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా, సమీపంలోని మసీదులోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న నటుడు

Hazarath Reddy

వెల్‌కమ్‌ చిత్రం ద్వారా పేరుగాంచిన బాలీవుడ్ నటుడు ముష్తాక్ ఖాన్ కిడ్నాప్ కలకలం రేపింది. ఆయనను అగంతుకులు ఢిల్లీ-మీరట్ హైవే మీద కిడ్నాప్ చేసి రెండు లక్షల రూపాయలు దోచుకున్నారు.

Advertisement

Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియాపై తండ్రి మోహన్ బాబు దాడిపై కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తానని వెల్లడి

Hazarath Reddy

తండ్రి మంచు మోహన్ బాబు మీడియాపై దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. మీడియాపై మా నాన్న దాడి చేయడం బాధ కలిగించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా అని వీడియో ద్వారా తెలిపారు. నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు.

Sobhita Dhulipala :పెళ్లికూతురిగా శోభిత ధూళిపాళ మాస్ స్టెప్పులు..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగిన తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది శోభిత. తాజాగా తనుపెళ్లి కూతురు అవుతున్న సమయంలో డాన్స్ వేసింది. ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్ర‌ద్ధా, నాకు పెళ్ల‌వుతోంది.. నాకు సిగ్గేస్తోంది అంటూ త‌న స్నేహితురాలికి చెబుతూ, మాస్ స్టెప్పులు వేసింది.

Mohan babu: వీడియో ఇదిగో...ఆస్పత్రిలో మోహన్ బాబు...పోలీస్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం!

Arun Charagonda

గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. ఇవాళ ఉదయం పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని పహాడిషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు.

Manchu Family Dispute: మోహన్‌ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ

Arun Charagonda

మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు అయింది. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

Advertisement

Manchu Family Dispute: రాచకొండ సీపీ విచారణకు మోహన్ బాబు, మనోజ్, విష్ణు...జల్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సుధీర్‌బాబు, మీడియాపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు

Arun Charagonda

సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం తారాస్థాయికి చేరింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మనోజ్‌ను భద్రతా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లారు మనోజ్. ఆ తర్వాత చిరిగిన చొక్కాతో మనోజ్ రావడం, మీడియాను లోపలికి తీసుకెళ్లడం ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Mohan Babu Health Update: మోహన్ బాబుకు అస్వస్థత, కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు..

Hazarath Reddy

సినీ నటుడు మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరో కుమారుడు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Manchu Family Dispute: మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావంటూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

గత రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. ఈ ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు.

Salman Khan in RC16? రామ్ చరణ్ RC16 మూవీలో కీలక పాత్రలో సల్మాన్ ఖాన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు

Hazarath Reddy

ఈ చిత్రంలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు వస్తున్నాయి. సరైన నటుడి కోసం టీమ్ వేటలో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం సల్మాన్ ఖాన్ ని పరిశీలిస్తున్నారట చిత్రబృందం.

Advertisement

Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియా మీద చేయి చేసుకున్న మోహన్ బాబు, నా కూతురు లోపల ఉంది అంటూ గేట్లు నెట్టుకుని వెళ్లిన మంచు మనోజ్

Hazarath Reddy

జల్‌పల్లిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్‌ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేట్లు నెట్టుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.

Manchu Family Disputes: వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య

Hazarath Reddy

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Manchu Family Conflict: మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్ట్, మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని మనోజ్ కొట్టాడు అంటున్న ఆ ఇంటి పనిమనిషి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబును కొట్టాడని ఆ ఇంటి పనిమనిషి చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని కూడా మనోజ్ కొట్టాడని ఆమె తెలిపింది.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని సూచన

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement