Bollywood Actor Saif Ali Khan injured.. here are the details(Insta)

Mumbai, January 16:  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలయ్యాయి. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడినట్లు తెలుస్తోండగా ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జనవరి 15న ఉదయం ముంబై, బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఉదయం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరుగగా సైఫ్, దొంగల్ని ఆపే ప్రయత్నంలో కత్తితో దాడి చేయగా గాయపడ్డారని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు.  సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు, బాగా ఎంజాయ్ చేశానని తెలిపిన సూపర్ స్టార్

బాంద్రా డివిజన్ డీసీపీ సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. దొంగతన ప్రయత్నం రాత్రి 2:30 గంటల సమయంలో జరిగింది. ఇంట్లో ఉన్నవారు అప్రమత్తం కావడంతో దొంగ పారిపోయాడని చెప్పారు. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డారని అయితే తీవ్ర గాయాలు ఏమి కాలేదని తెలిపారు.

బాంద్రాలోని "సత్వగురు శరణ్" భవనంలో ఉంటున్నారు సైఫ్ ఫ్యామిలీ. 3 బెడ్‌రూం అపార్ట్‌మెంట్, టెర్రస్‌, బాల్కనీతో పాటు స్విమ్మింగ్ పూల్ సైతం ఉంది. సైఫ్ -కరీనాతో పాటు పిల్లలు తైమూర్ , జెహ్ కూడా వారితోనే ఉంటున్నారు.