తాజా వార్తలు

Ram Gopal Varma Reacts On Allu Arjun Arrest: దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వ‌ర్మ నాలుగు ప్ర‌శ్నలు

VNS

అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు (Bail For Allu Arjun) చేయాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాల‌కు మ‌రోసారి భారీ వ‌ర్ష‌సూచ‌న‌, రాబోయే వారం రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలు

VNS

బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా (Low Pressure) బలపడుతుందని పేర్కొంది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లు పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది.

Dindigul Hospital Fire: వీడియో ఇదిగో. ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం, మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మంటల్లో సజీవ దహనం

Hazarath Reddy

తమిళనాడు దిండుక్కల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిండుక్కల్‌-తిరుచ్చి రహదారిలో నాలుగు అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి.

Sudden Death Video: షాకింగ్ వీడియో, కూర్చున్న చోటే అకస్మాత్తుగా వెనక కాలువలో పడిపోయిన ఓ వ్యక్తి, ఆస్పత్రికి తరలించేలోపే మృతి

Hazarath Reddy

వినుకొండ నూజండ్ల మండలంలో పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసరావు కల్వర్టుపై కూర్చున్నాడు.కల్వర్టుపై కూర్చున్న శ్రీనివాసరావు అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కింద పడ్డాడు. అక్కడ ఉన్న వారంతా పరుగున వచ్చి పైకి లేపగా మాట్లాడలేదు.వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Advertisement

CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి, సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడని వెల్లడి

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్

Andhra Pradesh: తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు , బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టిన పోలీసులు

Arun Charagonda

తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. కాలేజ్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గతంలో పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం.

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్‌ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది

Advertisement

Rashmika Mandanna: అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో గుండె పగిలింది...సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం కానీ ఈ ఘటనలో ఒకే వ్యక్తిని నిందించడం సరికాదన్న రష్మికా మందన్నా

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్టుపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్స్ వేదికగా స్పందించింది. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని...ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఓ వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని తెలిపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నానని, గుండె పగిలే వార్త ఇదన్నారు.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డ దాఖలాలు లేవని వెల్లడి

Hazarath Reddy

అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, యాక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు, నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్, కీలకంగా మారిన సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేఖ ఇదే..

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది

Advertisement

YS Jagan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన జగన్, ఈ ఘటనకు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్న వైసీపీ అధినేత

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్..హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది అన్నారు.

Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది.

Varun Dhawan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదన్న ధావన్

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం అని...నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరని చెప్పారు. కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్నారు.

Mohan Babu: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం...మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం?

Arun Charagonda

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కదురు అయింది. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. దీంతో మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? చేశారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు అరెస్ట్‌ పై ప్రభుత్వంపై జర్నలిస్టులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Advertisement

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు, కేసు విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన మృతురాలు రేవతి భర్త, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని వెల్లడి

Hazarath Reddy

అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు

Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, చంచల్‌గూడ జైలుకు తరలించనున్న పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Bandi Sanjay On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపాటు

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను తప్పుబట్టారు కేంద్రమంత్రి బండి సంజయ్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరం అని..ఈ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు.

Allu Arjun With Allu Aravind: నన్ను సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు..అరెస్ట్ చేశారు, అల్లు అరవింద్‌తో బన్నీ మాటలు వైరల్..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ బన్నీని అరెస్ట్ చేయగా అరెస్ట్ చేసే ముందు అల్లు అరవింద్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనని సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు.. అరెస్ట్ చేశారని చెప్పారు బన్నీ.

Advertisement
Advertisement