తాజా వార్తలు
Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
Arun Charagondaహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
Allu Arjun Arrest Live Updates: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, రిమాండా లేదా క్వాష్ పిటిషన్‌పై విచారణా? అనే ఉత్కంఠ
Arun Charagondaసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. అక్కడి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడి
Hazarath Reddyరాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు
CM Revanth Reddy On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం
Arun Charagondaనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్య తీసుకున్నారని ఇందులో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సాయంత్రం నాలుగు గంటలకు విచారణ, ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం కానున్నాయా..
Hazarath Reddyఅల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు.
Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేఏ పాల్, లక్ష్మీ పార్వతి...గతంలో చంద్రబాబు వెళ్లిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు..చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న?
Arun Charagondaసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. బన్నీ అరెస్ట్‌ను ఖండించారు కేఏపాల్, లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? చెప్పాలని డిమాండ్ చేశారు.
Allu Arjun Arrest: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ, మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బన్ని మండిపాటు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyచిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు.
Allu Arjun Emotional: అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్, భార్య స్నేహకు ధైర్యం చెప్పి పోలీస్ వాహనం ఎక్కిన బన్నీ...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.
Allu Arjun Arrest: గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు, వైద్య పరీక్షలు తరువాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్
Hazarath Reddyసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు
KTR On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేటీఆర్...సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్, జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు.ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.
Tamil Or Telugu? గుకేష్..నీవు తెలుగోడివా తమిళోడివా, స్టాలిన్, చంద్రబాబు ట్వీట్లతో ఆన్‌లైన్‌లో రచ్చ రచ్చ, అతని పూర్వీకుల అంశంపై మొదలైన చర్చ
Hazarath Reddyప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్ మా రాష్ట్రం వాడు అంటూ తెలుగు, తమిళ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. విశ్వవిజేతగా నిలిచి గుకేశ్ తమవాడే అంటూ తమిళులు, కాదు మావాడే అంటూ తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తున్నారు.
Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా..వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaఓ కాలనీలోకి వచ్చిన కోబ్రా రెండిళ్ల మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఇంటి మహిళ బయటికి వచ్చి కర్ర తీసుకుని పదే పదే చప్పుడు చేస్తుంది. దీంతో పాము భయపడి ఆమె ఉన్న వైపు వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Baba Vanga's 2025 Predictions: తూర్పున రగిలే యుద్ధంతో పశ్చిమం మొత్తం కనుమరుగు, 2025లో భయంకర వినాశనం, భయపెడుతున్న బాబా వంగా జోస్యాలు ఇవిగో..
Hazarath Reddyబాబా వంగా అని కూడా పిలువబడే వాంజెలియా పాండేవా గుష్టెరోవా ఒక అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, ఆమె 85 సంవత్సరాల వయస్సులో 1996లో మరణించింది. ఆమె మరణించిన తర్వాత కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆమె ప్రవచనాలకు ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారు.
Allu Arjun Arrest FIR Copy: అల్లు అర్జున్ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు
Arun Charagondaపుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు.
Daaku Maharaaj: డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది, డేగ డేగ అంటూ దుమ్మురేపుతున్న బాలయ్య సాంగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. డాకుస్ రేజ్ పేరుతో ఈ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. 'డేగ డేగ' అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది
Allu Arjun Arrested: అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇవే, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు, బెయిల్ మంజూరు చేసే అవకాశాలకు సంక్లిష్టం
Hazarath Reddyబీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
Allu Arjun Arrested Video: అల్లు అర్జున్ వీడియో ఇదిగో, నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బన్నీ
Hazarath Reddyబీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు, సెక్షన్ 105 నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం!
Arun Charagondaఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
GST Notices To Zomato: జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు, కస్టమర్ల నుండి వసూలు చేసిన రూ.803.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశం
Arun Charagondaప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంది.ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.