తాజా వార్తలు

Padi Kaushik Reddy Gets Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్.. రెండు షూరిటీల‌తో పాటు రూ. 5 వేల జ‌రిమానాతో బెయిల్ మంజూరు చేసిన న్యాయ‌మూర్తి

Rudra

పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పీఎస్‌ లో కౌశిక్ రెడ్డిపై కేసు న‌మోదైంది.

Keerthy Suresh Wedding Invitation: కీర్తి సురేష్ పెళ్లి ప‌త్రిక లీక్, డిసెంబ‌ర్ 12 న గోవాలో పెళ్లి, ఇంత‌కీ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ లో ఏముందంటే?

VNS

మహానటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌తో గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం జరిపిన ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కీర్తితో పాటు ఆమె తండ్రి సురేశ్‌కుమార్‌ కూడా ధృవీకరించాడు.

Harish Rao Fire on Revanth Reddy: ఎఫ్ఐఆర్ లు గాంధీభ‌వ‌న్ నుంచే వ‌స్తున్నాయ్, రేవంత్ రెడ్డి పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వజం, పోలీస్ స్టేష‌న్ నుంచి హ‌రీష్ రావు రిలీజ్

VNS

అవ్వాతాతలకు 4వేల పెన్షన్‌ ఇస్తానన్నావ్‌ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, స్కూళ్లలో పిల్లలకు ఏఐ రంగంలో ట్రైనింగ్

Hazarath Reddy

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.రాష్ట్రంలో యువతకు అవకాశాలపై సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు జరిగాయి.

Advertisement

ISRO Proba 3 Mission: సూర్యుడిపై ప్ర‌యోగాల కోసం ఇస్రో మిష‌న్, విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్రోబా-3

VNS

ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. ఇదొక కమర్షియల్ మిషన్. రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది ఇస్రో. పీఎస్ ఎల్వీ రాకెట్ల ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.

Zimbabwe Beat Pakistan: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే, క్లీన్ స్వీప్ జ‌స్ట్ మిస్

VNS

సల్మాన్‌ అఘా (32), తయ్యబ్‌ తాహిర్‌ (21), ఖాసిమ్‌ అక్రమ్‌ (20), అరాఫత్‌ మిన్హాస్‌ (22 నాటౌట్‌), అబ్బాస్‌ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్‌ బర్ల్‌ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్‌ చేసి పాక్‌ను కట్టడి చేశారు.

Police Case on Allu Arjun: అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

VNS

నిన్న రాత్రి అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రీమియర్ షోలు వేయగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక (Rashmika), మరికొంతమంది మూవీ టీమ్ వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది.

Kakinada Shares Case: చంద్రబాబుకు ఈ కేవీ రావు ఒక చెంచా, అలాంటి వాడిపై మేము బెదిరింపులకు దిగడమేంటి ? మీడియా వేదికగా మండిపడిన విజయసాయి రెడ్డి

Hazarath Reddy

కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా మండిపడ్డారు.

Advertisement

TGSRTC Renamed As TGTD: టీజీఎస్ఆర్టీసీని టీజీటీడిగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాలు వేడుకల్లో భాగంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం TGSRTCని తెలంగాణ రవాణా శాఖ (TGTD) గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది .

Indiramma Illu Mobile App: ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు

Hazarath Reddy

తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Kerala Shocker: దారుణం, రెండున్నరేళ్ల బాలిక ప్రైవేట్ భాగాల్లో వేలి గోర్లతో రక్కిన గాయాలు, షాకయిన ఆస్పత్రి వైద్యులు, ముగ్గురు అరెస్ట్

Hazarath Reddy

మంచాన్ని తడిపినందుకు శిక్షగా రెండున్నరేళ్ల బాలిక ప్రైవేట్ భాగాలను గాయపరిచినందుకు తిరువనంతపురంలోని ప్రభుత్వ బాలల గృహంలో ముగ్గురు కేర్‌టేకర్లను అరెస్టు చేశారు. కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (KSCCW) నిర్వహించే సదుపాయంలో ఈ సంఘటన జరిగింది

Advertisement

Pushpa 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప 2 ఓటీటీ రైట్స్, దాదాపు రూ. 250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Hazarath Reddy

డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌-ర‌ష్మిక మంద‌న్న జంట‌గా వ‌చ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్

Hazarath Reddy

శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి.

Telangana Shocker: లైంగిక వేధింపులు..కామారెడ్డి జిల్లాలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్య...దుబాయ్‌లో ఉంటున్న మృతురాలి భర్త, స్థానికంగా విషాదం

Arun Charagonda

లైంగిక వేధింపులు భరించలేక ఫార్మాసిస్ట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుంది శిరీష (28). బిచ్కుందలో కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది శిరీష. పని చేస్తున్న చోట శిరీషను కొందరు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దుబాయ్ లో ఉంటున్నారు శిరీష భర్త.

Kakinada Shares Case: కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాల‌ను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన క‌ర్నాటి వెంకటేశ్వ‌ర‌రావు

Hazarath Reddy

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్‌చంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్‌రెడ్డిలపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది.

Advertisement

Mythri Movie Makers: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించిన మేకర్స్

Arun Charagonda

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకరమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం..ఆ బాలుడి గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది

Pushpa 2: The Rule: సంధ్య థియేటర్లో సృహ కోల్పోయిన బాలుడు పుష్ప డ్యాన్స్ వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ వేసిన స్టెప్స్ నెట్టింట వైరల్

Hazarath Reddy

అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ పుష్ప డాన్స్..సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. పుష్ప పాటకు శ్రీతేజ వేసిన డాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Pushpa 2: The Rule: పుష్ప 2 లో ఎవడ్రా బాస్ అనే డైలాగ్‌ నిజంగా అలానే ఉందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంట్రవర్సీ డైలాగ్ అసలు వాస్తవం ఇదే..

Hazarath Reddy

పుష్ప 2 నుండి "ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? ఆడికి, ఆడి కొడుకుకి, ఆడి తమ్ముడికి నేనే బాస్" అనే డైలాగ్ ఇలా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపిస్తుంది . మెగా ఫ్యామిలీకి బన్నే బాస్ అని చెప్పేందుకు ఈ ఫేక్ డైలాగ్ ప్రచారం జరుగుతోంది. ఈ పుకారు ఎందుకు వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు-

Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్ ముసుగులో రెచ్చిపోయిన ఆకతాయిలు, ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చించివేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆళ్లగడ్డలో బన్నీ ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చింపేశారు. సినిమా ప్రదర్శింస్థుడగానే రెండవ పాట ఫీలింగ్స్ పాటకు స్క్రీన్ ముందు స్టెప్పులు వేసిన ఫ్యాన్స్. అదే సమయంలో స్క్రీన్ ను చింపేశారు.

Advertisement
Advertisement