తాజా వార్తలు

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో విషాదం, రైలు నుండి దూకి మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య, సీటు రాకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని రైలు నుండి దూకి డాక్టర్ కావలసిన తనుజ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడం పట్టడానికి చెందిన తనుజ అనే వ్యక్తి ఇటీవల డాక్టర్ కోర్స్ కోసం పరీక్షలు రాసింది.

CM Revanth Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు వెసులుబాటు కల్పించేలా విధివిధానాలు రూపొందించాం, ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల కేటాయింపు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వచ్చి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణమని మృతురాలి భర్త ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్

Hazarath Reddy

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానంటూ రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు

PDSU On Pushpa 2: అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి..పీడీఎస్‌యూ డిమాండ్, పుష్ప 2 సినిమా చూసేందుకు వెళ్లి ఓ మహిళ ప్రాణం పోయింది..సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిక

Arun Charagonda

హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది PDSU. పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణం పోయిందని...అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకుంటే 'పుష్ప 2' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించింది. హైదరాబాద్-RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Syed Mushtaq Ali Trophy: టీ 20లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బరోడా, అత్య‌ధిక సిక్స‌ర్లుతో పాటు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హిస్టరీ

Hazarath Reddy

బరోడా వారి ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు కొట్టి, మరో T20 రికార్డును బద్దలు కొట్టింది . జింబాబ్వే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (27) సాధించిన రికార్డును కలిగి ఉంది గాంబియాతో జరిగిన అదే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది.

Abhishek Sharma: దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన అభిషేక్ శర్మ, 28 బంతుల్లో 11 సిక్స్ లు, 8 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్

Hazarath Reddy

భారత టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డును సమం చేశాడు. 24 ఏళ్ల పంజాబ్ క్రికెటర్ ఈ మైలురాయిని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సాధించాడు.

Konda Surekha: తండ్రి ఫాంహౌస్‌లో కొడుకు రోడ్లపై, కేసీఆర్ - కేటీఆర్‌లపై మంత్రి కొండా సురేఖ ఫైర్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని సురేఖ సవాల్

Arun Charagonda

ఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు అన్నారు మంత్రి కొండా సురేఖ. మీడియాతో మాట్లాడిన సురేఖ...బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారు అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగింది...కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నారు.

Telangana: షాకింగ్... రైలు పట్టాలపై బైకుతో ప్రయాణం..ట్రైన్‌ను ఆపేసిన అధికారులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Arun Charagonda

రైల్వే పట్టాలపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట వద్ద షిరిడీ నుంచి తిరుపతి వెళుతున్న రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్యలో ద్విచక్రవాహనంపై రైలుకి ఎదురెళ్లాడు జగదీష్ అనే వ్యక్తి. జగదీష్‌ను పట్టాలపై నుంచి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

Advertisement

Karimnagar Shocker: కరీంనగర్ జిల్లా కశ్మీర్‌ గడ్డలో దారుణం..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

కరీంనగర్ కశ్మీర్ గడ్డ లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ పై కత్తితో దాడి చేశాడు. అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీకి మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలను ఆపడానికి వెళ్లగా.. అతిఫ్ పై దాడి చేయగా ఎడమచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Honda Amaze 2024: హోండా నుంచి అమేజ్ 2024 వచ్చేసింది, ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

హోండా కార్స్ ఇండియా హోండా అమేజ్ 2024 ను ప్రారంభ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. రేంజ్-టాపింగ్ వేరియంట్ రూ. 10.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. అమేజ్ ఇప్పుడు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలను (ADAS) అందిస్తున్న దేశంలోనే అత్యంత సరసమైన కారుగా చెప్పుకోవచ్చు.

Hero Vida V2 E-Scooter: హీరో నుంచి ఒకేసారి మూడు ఈవీ స్కూటర్లు, ధర రూ. 96 వేల నుంచి ప్రారంభం, అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

ప్రముఖ వాహన తయారీ దిగ్గజం హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. Vida V2 Lite, Plus, Pro అనే మూడు కొత్త వెర్షన్ Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను హీరో విడుదల చేసింది. వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప 2 మార్నింగ్ షో సందర్భంగా ధియేటర్లో అగ్నిప్రమాదం, నల్గొండ వెంకటేశ్వరా థియేటర్లో బాణసంచా కాల్చడంతో ఎగసిపడిన నిప్పురవ్వలు

Hazarath Reddy

నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్‌ షోలో పుష్ప 2 ది రూల్‌ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్‌ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి.

Advertisement

Harishrao: తెలంగాణ హైకోర్టులో హరీశ్‌ రావుకు ఊరట, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ నేత చక్రధర్‌ గౌడ్‌కు నోటీసులు

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..ఈ కేసులో హరీశ్‌ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

Chalamalasetty Ramesh Babu: వెనక్కి తగ్గిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్‌.. పుష్ప 2 సినిమాపై తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన..వీడియో ఇదిగో

Arun Charagonda

పుష్ప-2 సినిమా పై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లా జనసేన నేత చలమలశెట్టి రమేశ్. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ పోకడ జనసైనికులు, మెగా అభిమానులకు చాలా బాధను కలిగించిందని... పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలని లేదంటే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు రమేశ్‌ బాబు.

Sree Leela At Pushpa 2 Theatre: పుష్ప -2...థియేటర్లో శ్రీలీల సందడి, అభిమానులతో కలిసి సినిమా చూసిన శ్రీలీల...బాలనగర్‌ విమల్‌ థియేటర్‌లో అభిమానుల హంగామా..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా పండగ వాతావరణం నెలకొంది. 'పుష్ప-2' ప్రీమియర్ షో చూసేందుకు హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్‌ బాలానగర్‌లోని విమల్ థియేటర వెళ్లారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు నగరంలోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు చూస్తున్నారు.

Naga Chaitanya – Shobitha Wedding Video: వీడియో ఇదిగో..శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య...ఈలల వేస్తూ హంగామా చేసిన అఖిల్...కుటుంబ సభ్యుల ఆనందం చూడండి

Arun Charagonda

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తన జరిగిన ఈ పెళ్లి వేడుకును చూసేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, స్నేహితుల, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరుకాగా పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

KTR On Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, ఇదేనా ప్రజా పాలన?..ఇందిరమ్మ రాజ్యం? అంటూ కేటీఆర్ ఫైర్

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు అని ఎద్దేవా చేశారు.

TTD: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు, ఆక్రమణలు గుర్తించిన చైర్మన్..నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వరాహస్వామి అతిథిగృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించారు. తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు గుర్తించారు. అనాధికార హాకర్లను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను అదేశింశారు. టీటీడీ నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం..కౌశిక్ ఇంటికి పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ సీఐపై దుర్భాషలాడాడని..ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

SI Suicide Case: ఎస్‌ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు, యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ

Arun Charagonda

ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement
Advertisement