తాజా వార్తలు

Agni-Prime Missile: అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్, రైలు నుంచే శత్రు దేశాలపై గురి పెట్టి ముచ్చెమటలు పట్టించనున్న మిస్సైల్, వీడియో ఇదిగో..

Team Latestly

భారత రక్షణ రంగంలో మరో మిస్సైల్ చేరింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణిని రక్షణ రంగం విజయవంతంగా పరీక్షించింది. ఈ చారిత్రక ప్రయోగం విజయంతో.. ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.

Ramleela Shock: వీడియో ఇదిగో..రామ్‌లీలా నాట‌కం వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన దశరథుడి పాత్రధారి, అక్కడికక్కడే మృతి

Team Latestly

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని చంబా జిల్లాలో శనివారం రాత్రి రామ్‌లీలా నాట‌కం సమయంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాటకంలో దశరథుడి పాత్ర పోషిస్తున్న సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ అమ్రిశ్ కుమార్ స్టేజ్‌పైనే అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు.

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఉపాధ్యాయురాలిపై హెడ్‌మాస్టర్‌ లైంగిక వేధింపులు..అడిగినందుకు విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి, నిందితుడు అరెస్ట్

Team Latestly

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సీతాపూర్‌ జిల్లాలోని మహమ్మదాబాద్‌ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బ్రిజేంద్ర కుమార్ వర్మ చేసిన దారుణ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన ప్రకారం అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి పై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Dickie Bird Dies: దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ డికీ బర్డ్‌ కన్నుమూత, 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ వైపు..హస్యంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసిన లెజెండ్

Team Latestly

ప్రఖ్యాత క్రికెట్‌ అంపైర్‌ హెరాల్డ్‌ డెనిస్‌ డికీ బర్డ్‌ (92) మంగళవారం లండన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. 2014లో ఆయన ఆ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1933 ఏప్రిల్‌ 19న యార్క్‌షైర్‌లో జన్మించిన డికీ బర్డ్‌ చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నారు.

Advertisement

Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Team Latestly

మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు ఆధారాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అదేకాక, మనిషి ప్రాణాలు రక్షించే టీకాల విలువపై ప్రజల్లో అనుమానం కలిగేలా మాట్లాడొద్దని హెచ్చరించారు.

Tragedy Averted in Vijayawada: వీడియో ఇదిగో, విజయవాడలో కళాశాల బస్సు నడుపుతున్న డ్రైవర్‌కి గుండెపోటు, సీపీఆర్ సాయంతో ప్రాణాలు కాపాడిన పోలీసులు

Team Latestly

విజయవాడలో రామవరప్పాడు రింగ్‌ రోడ్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్‌ అకస్మాత్తుగా గుండెపోటుకు గురవగా, వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు అతడికి సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Air India Express Hijack Scare: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో హైజాక్ కలకలం, కాక్‌పిట్ తలుపును తెరిచి పైలట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, 8 మంది అరెస్ట్

Team Latestly

బెంగళూరు-వారణాసి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది. సోమవారం, సెప్టెంబర్ 22, బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (IX-1086) విమానంలో భయాందోళన సృష్టించిన ఘటన చోటు చేసుకుంది.ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ తలుపును గాలిలో బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడని విమాన సిబ్బంది పేర్కొన్నారు

Snake Attack Video: షాకింగ్ వీడియో ఇదిగో, నాగు పామును పట్టుకుని సెల్పీ దిగుతుండగా కాటేసిన పాము, విషం త్వరగా ఎక్కడంతో కుప్పకూలి మృతి చెందిన కానిస్టేబుల్

Team Latestly

ఇండోర్ నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో భయానక సంఘటన జరిగింది. స్థానిక కానిస్టేబుల్ సంతోష్ చౌదరి ఒక సరీసృపాన్ని పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు గురయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంతోష్ చౌదరి పామును పట్టుకుని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నాగుపాము అతన్ని కరిచింది. ఈ సంఘటన వెంటనే షాక్, భయాందోళన కలిగించింది.

Advertisement

Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ దళంపై దుండగుల దాడి, ఇద్దరు జవాన్లు వీరమరణం, మరో అయిదుగురు జవాన్లకు గాయాలు

Team Latestly

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి ఘోర ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్ దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని సాయుధులు ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. మెరుపు దాడి చేసిన దుండగులు పలు రౌండ్లుగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు

Supreme Court: మైనర్ బాలిక ప్రైవేట్ భాగాలను తాకడం అత్యాచారం కిందకు రాదు, మైనర్ బాలికపై కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Team Latestly

ఒక ముఖ్యమైన తీర్పులో, భారత సుప్రీంకోర్టు మైనర్ బాలిక ప్రైవేట్ భాగాలను తాకడం మాత్రమే జరిగితే, దానిని అత్యాచారం లేదా చొచ్చుకుపోయే లైంగిక దాడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మణ్ జాంగ్డే నిందితుడు. మొదట దిగువ కోర్టు అతన్ని మైనర్‌పై అత్యాచారం చేసినందుకు, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద దోషిగా నిర్ధారించి కఠిన శిక్ష విధించింది

Maharashtra Shocker: తీవ్ర విషాదం..ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని 5 ఏళ్ల పసి బాలుడు మృతి

Team Latestly

మహారాష్ట్రలోని వాసాయిలో జరిగిన దురదృష్టకర సంఘటనలో, ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (NH-48)లో నాలుగు నుండి ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక పసి బాలుడు మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను గెలాక్సీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సమీక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Punjab Shocker: పంజాబ్‌లో యుకే మహిళ దారుణ హత్య, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిరాతకంగా చంపేసిన వృద్ధుడు, రూ. 50 లక్షలకు కాంట్రాక్ట్ డీల్

Team Latestly

సెప్టెంబర్ 17, బుధవారం, లూధియానా పోలీసులు ఒక భయంకర సంఘటనను నివేదించారు. 71 ఏళ్ల అమెరికా పౌరురాలు, సియాటిల్ నుండి లూధియానాకు వచ్చిన కొద్దిసేపటికే హత్యకు గురైందని అధికారులు తెలిపారు. ఆమెను రూపిందర్ కౌర్ పాంధర్ అని గుర్తించారు.

Advertisement

Hyderabad: దారుణం.. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి.. విరిగిన దవడ ఎముక, గడ్డి అన్నారం నారాయణ జూ.కాలేజీలో ఘటన, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి ఒకరు కాలేజ్‌లో ఫ్లోర్ ఇన్చార్జ్ చేత దాడి కు గురయ్యారు. ఈ దాడిలో అతని దవడ ఎముక విరిగింది. విద్యార్థి తీవ్రగా గాయపడిన తరువాత స్థానికులు, కాలేజ్ సిబ్బంది సహాయం కోసం వచ్చారు. ఈ ఘటనా సంఘటన స్థానికంగా తీవ్ర దాగ్భ్రాంతి, ఆందోళన కలిగించింది.

Young Man Dies of Heart Attack: వీడియో ఇదిగో.. జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో కుప్పకూలి 30 ఏళ్ల యువకుడు మృతి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన

Team Latestly

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జ్యూస్ సెంటర్‌లో జ్యూస్ తాగుతున్న 30 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

'Rahul Gandhi Ji Thank You': దటీజ్ రాహుల్ గాంధీ, సైకిల్ పోయిందని ఏడుస్తున్న పిల్లాడికి కొత్త సైకిల్ కొనిచ్చిన రాహుల్ గాంధీ, వీడియో ఇదిగో..

Team Latestly

పంజాబ్ పర్యటన సందర్భంగా అమృత్‌సర్‌లో తన ముందు సైకిల్ పోయిందని ఏడ్చిన ఆరేళ్ల బాలుడికి కొత్త సైకిల్ అందిస్తానని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల నెరవేర్చారు. వరదల్లో దెబ్బతిన్న తన సైకిల్ కోసం రాహుల్ గాంధీ ముందు ఏడుస్తున్న వీడియోను చూపించిన తర్వాత, అమృత్‌పాల్ సింగ్ అనే బాలుడు కొత్త సైకిల్‌ను అందుకున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చింది.

Fact Check: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 15 లక్షలు, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చెబుతున్నట్లుగా ఫేక్ వీడియో క్రియేట్, ఇలాంటివి నమ్మవద్దని హెచ్చరించిన కేంద్రం

Team Latestly

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 వేల రూపాయల పెట్టుబడి ద్వారా రోజూ 60 వేల రూపాయలు, నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చూపించబడుతోంది.

Advertisement

Ghaziabad Shocker : దారుణం..మహిళ ముందు ఫ్యాంట్ జిప్పి విప్పి ప్రైవేట్ భాగాలు చూపించిన కామాంధుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Team Latestly

ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయ్ నగర్ ప్రాంతం సెక్టార్ 9లో ఒక వ్యక్తి బైక్‌పై కూర్చొని, మహిళలు, పిల్లల ముందు అసభ్యకరమైన చర్యలు చేశాడు. అతను తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అనుచిత లైంగిక సంజ్ఞలు చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ( Twitter) లో షేర్ అయింది.

Punjab and Haryana High Court: జడ్జి పదవికి నోటిఫికేషన్, పొరపాటున ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిపిన న్యాయవాది, చివరకు ఏమైందంటే..

Team Latestly

కుమార్ పొరపాటుగా ఆ కాలమ్‌లో “అవును” అని రాశాడు. ఈ కారణంగా తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేసినా.. చీఫ్ జస్టిస్ షీల్ నాగు మరియు జస్టిస్ సంజీవ్ బెర్రీలతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ నాగు వ్యాఖ్యానిస్తూ.. మీకు ఇద్దరు భార్యలు ఉన్నారని మీరు చెబుతున్నారు

Jammu and Kashmir High Court: తండ్రి ఎక్కువ డబ్బు సంపాదించినా పిల్లల సంరక్షణపై తల్లికే హక్కు.. పిల్లల కస్టడీ కేసులో జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు..

Team Latestly

జమ్మూ & కాశ్మీర్, లడఖ్ హైకోర్టు పిల్లల కస్టడీ (పెంపక హక్కు) గురించి ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది.తండ్రి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడనే కారణంతో పిల్లలు తల్లి కస్టడీలోకి వెళ్లడం కరెక్ట్ కాదనే అంశాన్ని తప్పుబట్టింది. జస్టిస్ జావేద్ ఇక్బాల్ వాని చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితి ఒక విషయం మాత్రమే.

టీం ఇండియాకు కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్, రూ.579 కోట్ల భారీ బిడ్‌తో హక్కులు దక్కించుకున్న దిగ్గజం, టీం ఇండియా జెర్సీలో ఇకపై అపోలో టైర్స్ లోగో

Team Latestly

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీం ఇండియాకు కొత్త లీడ్ స్పాన్సర్ కోసం నిర్వహించిన ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ పోటీలో పలు కంపెనీలు పోటీ పడగా చివరకు గురుగ్రామ్ ఆధారిత అపోలో టైర్స్ రూ.579 కోట్ల భారీ బిడ్‌తో కొత్త స్పాన్సర్‌గా ఎంపికైంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, టీం ఇండియా జెర్సీలో ఇకపై అపోలో టైర్స్ లోగో కనిపిస్తుంది.

Advertisement
Advertisement