తాజా వార్తలు

Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తిన వర్షాలు, నీట మునిగిన పలు గ్రామాలు..వీడియో వైరల్

Arun Charagonda

భారీ వర్షాలు గుజరాత్‌ని ముంచెత్తాయి. ఎడతెరపి లేని వర్షాలతో పలు గ్రామాలు నీట మునగగా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గుజరాత్ విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Andhra Pradesh Rains: వరదలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 మంది మృతి, 6,44,536 మందిపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు, 2.34 లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం

Hazarath Reddy

ఏపీలో భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా బెజవాడ వాసులను బెంబేలెత్తించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

IMD Weather Alert: విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్‌ ఉన్నట్లు (IMD Weather Alert) అంచనా వేస్తోంది.

Jammu and Kashmir Elections: జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల రణక్షేత్రం, మోడీ వర్సెస్ రాహుల్..హోరెత్తనున్న ప్రచారం, అగ్రనేతల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు!

Arun Charagonda

పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి ఈ ఎన్నికలు కీలకం కాగా స్థానిక ప్రాంతీయ పార్టీల నుండి గట్టిపోటీ తప్పేలా కనిపించడం లేదు.

Advertisement

Telangana Floods: వీడియో ఇదిగో, తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించలేం, రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hazarath Reddy

కేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

Air India Plane Bomb Scare: విమానాలకు ఆగని బాంబు బెదిరింపు కాల్స్, విశాఖకు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్, తీరా చూస్తే..

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ నుంచి 107 మంది ప్రయాణికులతో విశాఖపట్నం (Delhi To izag flight) వెళ్తున్న ఎయిర్‌ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.మంగళవారం అర్ధరాత్రి ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరింది.

Explosion In Srisailam Power House: శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి..వీడియో

Arun Charagonda

శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఏడో నంబర్‌ యూనిట్‌లో నిలిచిపోయింది విద్యుత్‌ ఉత్పత్తి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Mumbai Horror: ముంబైలో దారుణం, 12 ఏళ్ళ బాలుడిపై తాగుబోతు యువకుడు అత్యాచారం, ప్రైవేట్ పార్టులో నుండి తీవ్ర రక్తస్రావం

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో, ముంబైలోని గోవాండిలోని మాన్‌ఖుర్డ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిపై తాగిన వ్యక్తి దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన సెప్టెంబర్ 2, సోమవారం సాయంత్రం జరిగింది.

Advertisement

TDP Office Destroyed Case: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, నందిగాం సురేశ్‌, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్లతో విరుచుకుపడిన రష్యా, 51 మంది మృతి, మరో 200 మందికి గాయాలు, సైనిక విద్యా కేంద్రంపై క్షిపణి దాడి

Hazarath Reddy

ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై మిసైళ్లతో విరుచుకుప‌డింది. ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు.

Megastar Chiranjeevi: వరద బాధితులకు అండగా చిరంజీవి, తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం, సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచివేశాయన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు.. రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు చిరు.

North Korea Floods: వరదలపై అధికారుల నిర్లక్ష్యం, 30 మందిని ఉరి తీయించిన నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నార్త్ కొరియాను గత నెలలో భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు సుమారు 4 వేల మంది చనిపోయారని, 5 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వరదలను అడ్డుకోవడంలో విఫలం అయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా అధినేత.

Advertisement

Is Putin Seeking Immortality? మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు

Hazarath Reddy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చావు లేని జీవితం కోసం పాకులాడుతున్నారా.. ఈ ధరిత్రిపై చిరంజీవిగా ఉండిపోయి కలకాలం రష్యాను ఏలేద్దామనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే వినిపిస్తోంది

Telangana Rains: మళ్లీ ముంచెత్తిన వర్షం, 5 రోజులు స్కూళ్లకు సెలవు, చెరువుల మత్తడితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్..వివిధ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన వీడియోలు..

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Khammam: బీఆర్ఎస్ కార్యకర్తను గాయపర్చింది హరీశ్‌ రావు కారే, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌ రెడ్డి ట్వీట్ వైరల్, కారు నడిపింది పాడి కౌశిక్‌ రెడ్డి అని వెల్లడి

Arun Charagonda

నిన్న ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన కారు హరీశ్‌రావు‌దే అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రామ్మోహన్‌..కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి.. అందులో హరీశ్‌రావు కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరగా ఒక్కరోజే 5 పతకాలు వచ్చాయి. స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు.

Advertisement

Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షం, తిరువల్లూరును ముంచెత్తిన వర్షాలు..వీడియో

Arun Charagonda

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించగా తాజాగా తమిళనాడులోనూ భారీ వర్షం కురిసింది. తిరువల్లూరు పట్టణంలో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది.

Andhra Pradesh: వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డికి షాక్, భీమిలి బీచ్‌లో అక్రమ కట్టడాలను తొలగించిన జీవీఎంసీ అధికారులు

Arun Charagonda

ఏపీలోనూ అక్రమ కట్టడాల కూల్చివేత మొదలైంది. విశాఖ పట్నంలోని భీమిలీ బీచ్‌లో అక్రమ నిర్మించిన కట్టడాలను తొలగించారు జీవీఎంసీ అధికారులు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు.

AP And Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళం, హెరిటేజ్ ఫుడ్స్ తరపున సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటన

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి 2 కోట్లు విరాళంగా ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్టు వెల్లడించారు.

Heavy Rains In Medaram: మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్

Arun Charagonda

భారీ వర్షాల ప్రతాపం మేడారం అడవులపై తీవ్ర ప్రభావం చూపింది. మేడారం-తాడ్వాయి మధ్య వేల ఎకరాల్లో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, గాలి దుమారంతో 5కి.మీ పరిధిలో ఎటు చూసినా చెట్లు నాశనమయ్యాయి. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement