తాజా వార్తలు

12 Industrial Smart Cities: కడప, కర్నూలు జిల్లాల్లో కొత్తగా స్మార్ట్ సిటీలు, దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తెలంగాణలో ఎక్కడంటే..

Hazarath Reddy

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

YSRCP: మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జోగి రమేష్, పెనమలూరు ఇన్‌చార్జ్‌గా దేవభక్తుని చక్రవర్తి, ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల నియామిస్తూ వైఎస్సార్‌సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.

Andhra Pradesh Cabinet Meeting: ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు, పాత విధానంలోనే టెండర్ల ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది.

Patna: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ వంతెన మీద నుంచి గంగా నదిలో పడిపోయిన యువతి, అదృష్టవశాత్తూ అక్కడే సిబ్బంది ఉండటంతో ప్రాణాలతో బయటకు

Hazarath Reddy

పాట్నాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, మహాత్మా గాంధీ సేతు వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్న 24 ఏళ్ల మహిళ ఆగస్టు 28న సుమారు 15 అడుగుల ఎత్తు నుండి గంగా నదిలోకి పడిపోయింది. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోవడం వీడియోలో బంధించబడింది. ఆమె నదిలో పడిపోయి సహాయం కోసం కేకలు వేసింది.

Advertisement

MLC Kavitha At Shamshabad: శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం, పిడికిలి బిగించి అభివాదం తెలిపిన కవిత, ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు...వీడియో

Arun Charagonda

ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవితకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా వారికి పిడికిలి బిగించి అభివాదం తెలిపారు కవిత.

Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన, తన భర్తను మానసిక వికలాంగురాలు ఇష్టపడటంతో పెళ్లి చేసిన భార్య..వీడియో

Arun Charagonda

తన భర్తకు రెండో పెళ్లి చేసింది ఓ భార్య. ఓ మానసిక వికలాంగురాలు తన భర్తను ఇష్టపడటంతో దగ్గరుండి మరి రెండో వివాహం జరిపించింది భార్య. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరుగగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Delhi Horror: ఢిల్లీలో దారుణం, శ్మశానంలో మైనర్ బాలికపై దొంగ బాబా అత్యాచారం, కుద్ర పూజల ద్వారా మీ తండ్రి వ్యాధిని నయం చేస్తానంటూ..

Hazarath Reddy

అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి క్షుద్ర పూజలు ద్వారా జబ్బును నయం చేస్తాననే నెపంతో మైనర్ బాలికపై 52 ఏళ్ల వ్యక్తి పశ్చిమ ఢిల్లీలోని రోహిణిలోని స్మశాన వాటికలో అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులు బుధవారం తెలిపారు.

Attack On MLA Kale Yadaiah: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై సొంతపార్టీ నేతలే కోడిగుడ్లతో దాడి, కష్టపడ్డ కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్..వీడియో వైరల్

Arun Charagonda

కాంగ్రెస్‌లో అంతర్గతపోరు మరోసారి బయటపడింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని,కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, కడప వైసీపీ మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన టీడీపీ కార్యకర్తలు, చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ (టిడిపి), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) మధ్య కొత్త చెత్త పన్ను నిబంధనపై రాజకీయ ఘర్షణ తీవ్రమైంది. కడపలోని వైఎస్సార్‌సీపీ మేయర్‌ సురేశ్‌బాబు అధికారిక నివాసం ఎదుట టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిసి చెత్తబుట్టలు వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పన్ను చెల్లిస్తేనే చెత్త సేకరిస్తామన్న మేయర్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.

Astrology: ఆగస్టు 31న బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయిన బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాపారానికి మేధస్సుకి గౌరవానికి బాధ్యత వహించే గ్రహం. బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి

Astrology: ఆగస్టు 29 అజ ఏకాదశి, మూడు యోగాల కలయిక వల్ల..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

ఏకాదశి విశిష్ట ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున అనేక శుభకార్యాలు జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కష్టాలు, పాపాలు అన్నీ కూడా నయమవుతాయని నమ్ముతారు.

MLC Pothula Sunitha Quits YSRCP:వైసీపీకి మరో నేత గుడ్‌బై, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా, పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు

Hazarath Reddy

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు.

Advertisement

Janasena Leader on Allu Arjun: వీడియో ఇదిగో, నువ్వో పెద్ద కమెడియన్ అంటూ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన జనసేన నేతలు, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ..

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు.చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు.

Fir Agianst Bithiri Sathi: బిత్తిరి సత్తిపై పోలీస్ కేసు, భగవద్గితను బిల్లు గీత అంటూ చేసిన వీడియోపై చర్యలు..ఎఫ్‌ఐఆర్ ఇదిగో

Arun Charagonda

బిత్తిరి సత్తికి షాక్ తగిలింది. భగవద్గీతను బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన వీడియోపై దుమారం చెలరేగింది. దీంతో బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని ఓ హిందుత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Chalamalasetty Ramesh Babu on Allu Arjun: నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు

CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం

Arun Charagonda

హైడ్రా వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు.

Advertisement

Andhra Pradesh: నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు, తామరాపల్లి మహిళా గురుకుల పాఠశాలలో ఘటన, 5గురు విద్యార్థినులకు అస్వస్థత

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం తామరాపల్లిలోని మహిళా గురుకుల కళాశాలలో ఎలుకల దాడి కలకలం రేపింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరికేశాయ్. దాదాపు ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కొరగా మిగితా విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.

NDA Touches Majority Mark in Rajya Sabha: బిల్లులకు ఇక సై..రాజ్యసభలో మెజారిటీ మార్క్‌ను దాటిన ఎన్డీయే కూటమి, 12 మంది సభ్యులు ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నిక

Hazarath Reddy

రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. ఎగువ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బిజెపి సభ్యులు, ఇద్దరు మిత్రపక్షాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికైనందున అధికార ఎన్‌డిఎ ఈరోజు రాజ్యసభలో మెజారిటీ మార్కును చేరుకుంది.

Madhya Pradesh: నదిలో ఆవులను తోసిన దుర్మార్గులు, 20 ఆవులు మృతి,నలుగురిపై కేసు, నెటిజన్లు తీవ్ర మండిపాటు

Arun Charagonda

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు 50కి పైగా ఆవులను నదిలోకి తోసేయగా ఈ ఘటనలో 20 ఆవులు మృతిచెందాయి. ఈ దారుణ సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు సుమారు 50కి పైగా ఆవులను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సాత్నా నదిలోకి తోసేశారు.

Health Tips: ప్రతిరోజు రాత్రి బాదం నూనెను మొహానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.

sajaya

బాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కోరిక కాసంత ఎక్కువగానే ఉంటుంది. బాదం నూనెతో చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి.

Advertisement
Advertisement