తాజా వార్తలు

YouTube Premium Price Hike: భారత్ లో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెంపు.. ఏకంగా 58% పెంపు!

Rudra

ఇంటర్నెట్ విప్లవంతో భారత్ లో సోషల్ మీడియా వినియోగం పెర్గింది. ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే.

Free Vegetables: ఫ్రీగా కూరగాయలు.. పెద్దపల్లిలో భలే ఛాన్స్.. ఎగబడ్డ జనం.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)

Rudra

ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. వెయ్యితో బయటకు వెళ్తే, సంచీ నిండా కూరగాయలు రావడమే కష్టమైంది. ఇలాంటి సమయంలో కూడా పెద్దపల్లిలో మాత్రం కూరగాయలను ఉచితంగా అందిస్తున్నారు.

Telegram May Be Ban In India: భారత్‌లో టెలిగ్రామ్ పై నిషేధం?, గ్యాంబ్లింగ్,నేరపూరిత కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర విచారణ,అక్రమాలు నిజమని తేలితే నిషేధమే!

Arun Charagonda

టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్‌. అయితే ఇప్పుడు ఈ యాప్ పారదర్శకతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే నేరపూరిత కార్యక్రలాపాలు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ సరఫరాకు అడ్డగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, దర్యాప్తు ఫలితాలను బట్టి మెసేజింగ్ యాప్‌ను నిషేధించవచ్చని కేంద్ర వర్గాల సమాచారం.

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పై నేడే సుప్రీంలో విచారణ.. సర్వత్రా ఆసక్తి

Rudra

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Advertisement

Mark Zuckerberg: కరోనా కేసుల కంటెంట్ తొలగించాలంటూ బైడెన్ యంత్రాంగం మాపై ఒత్తిడి తెచ్చింది.. మెటా సీఈవో జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు

Rudra

కరోనా సంక్షోభ సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు చేశారు.

NCERT New Update: 9 నుంచి 11వ తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా పన్నెండో తరగతి ఫలితాలు.. ఎన్సీఈఆర్టీ నిపుణుల కమిటీ సూచనలు

Rudra

సీబీఎస్ఈ పన్నెండో తరగతిలో సాధించే మార్కుల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలో సాధించిన మార్కులను కూడా భాగం చెయ్యాలని ఎన్సీఈఆర్టీ కీలక సూచనలు చేసింది.

Vijayawada Horror: రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని అన్నను చంపిన తమ్ముడు.. విజయవాడలో ఘోరం

Rudra

విజయవాడలో ఘోరం జరిగింది. తన భార్యకు రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని ఓ తమ్ముడు తన అన్ననే చంపేశాడు. ఈ దారుణ ఘటన గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది.

Telangana Weather Update: తెలంగాణ ప్రజలకు అలర్ట్, వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని (Telangana Rain Update)హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది

Advertisement

California Shocker: కాలిఫోర్నియాలో దారుణం, తల్లిదండ్రుల తలలను నరికివేసిన కసాయి కొడుకు, పోలీసులు కాల్పులు జరుపుతుంటే పాటలు పాడుతూ..

Hazarath Reddy

కాలిఫోర్నియాలో ఒక షాకింగ్ సంఘటనలో, 41 ఏళ్ల జోసెఫ్ బ్రాండన్ గెర్డ్విల్ తన తల్లిదండ్రులైన ఆంటోయినెట్ (79), మరియు రోనాల్డ్ (77) జులై 9న వారిని శిరచ్ఛేదం చేసిన తర్వాత డబుల్ నరహత్య ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ దారుణమైన నేరం వారి ఇంటిలో (శాన్ జువాన్ కాపిస్ట్రానోలోని హోమ్ కమ్యూనిటీ) జరిగింది.

Hapur: కేసు నమోదు చేయాలంటే కిలో జిలేబి పట్టుకురావాల్సిందే, మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యువకుడికి కానిస్టేబుల్ డిమాండ్

Hazarath Reddy

బహదూర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఒక విచిత్రమైన సంఘటన బయటపడింది, స్వీట్‌ల పట్ల మక్కువతో పేరుగాంచిన కానిస్టేబుల్ ఫిర్యాదుదారుని జిలేబీ డిమాండ్ చేశాడు. ఆగస్ట్ 26వ తేదీన ఓ యువకుడు మొబైల్ ఫోన్ తప్పిపోయిందని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Tata Group to Hire 4,000 Women: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్, 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనున్న టాటా గ్రూపు

Hazarath Reddy

టాటా గ్రూప్ తమిళనాడు మరియు కర్నాటకలో విడిభాగాల తయారీ మరియు అసెంబ్లీ సౌకర్యాల కోసం ఉత్తరాఖండ్ నుండి 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది

Fact Check: ప్రతి పేద కుటుంబానికీ కేంద్రం రూ.46,715 ఆర్థికసాయం, ఈ లింక్ క్లిక్ చేశారో మీ ఫోన్ హ్యాకయినట్లే, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ అంటూ వాట్సాప్‌లో ఓ మెసేజ్ విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్‌ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం తేల్చింది.

Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌, తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్ష సూచన

Hazarath Reddy

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతారాతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.వర్షం పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.

Chhatrapati Shivaji Maharaj Statue: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం.

Anna Canteens: వీడియో ఇదిగో, మురికి నీటిలో కడుగుతున్న అన్న క్యాంటీన్ ప్లేట్లు, తణుకులో వెలుగులోకి వచ్చిన ఘటన

Hazarath Reddy

చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన అన్నా క్యాంటిన్లలో నాణ్యతాలోపం కనపడుతోంది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా తణుకులో మురికి నీటిలో అన్న క్యాంటీన్ ప్లేట్లు కడుగుతున్న వీడియో బయటకు వచ్చింది

Andhra Pradesh: పొలం నుంచి వస్తుండగా రైతును తొక్కి చంపిన ఏనుగు, మన్యం జిల్లాలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

Hazarath Reddy

మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు.

Advertisement

Telangana: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, త్వరలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి

Hazarath Reddy

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై... మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను రేవంత్ రెడ్డి నేడు పంపిణీ చేశారు.

ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...

Vikas M

యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్‌ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.

Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా..అయితే దానివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

sajaya

చంటి పిల్లలకు చాలామంది టాల్కం పౌడర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. టాల్కం పౌడర్ అధికంగా వాడడం ద్వారా దద్దుర్లు, దురద ఎక్కువగా వచ్చి చిన్న చిన్న కురుపులు కూడా అవుతూ ఉంటాయి.

Telegram CEO Pavel Durov’s Arrest: టెలిగ్రాంలో పిల్లల సెక్స్ వీడియోలు, ప్రాన్స్‌లో సీఈఓ పావెల్ దురోవ్‌ అరెస్ట్, అక్కడ నిషేధం విధిస్తారా..

Vikas M

టెలిగ్రామ్‌ను ప్రాన్స్‌ నిషేధిస్తుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సం‍స్థ సీఈఓ పావెల్ దురోవ్‌(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్‌ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.

Advertisement
Advertisement