తాజా వార్తలు

Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్.

sajaya

ఈరోజుల్లో కండరాల నొప్పులు సర్వసాధారణమైపోయింది. కాళ్లు, చేతులు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా నొప్పులతో మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తాయి. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పడానికి జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటారు.

Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..షుగర్ పేషంట్లకు ఇది ఒక అద్భుత వరం.

sajaya

మధుమేహం వ్యాధి ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది సైలెంట్ కిల్లర్ గా ఉండి జీవితాంతం కూడా మనం అనేక రకాల జబ్బులకు గురిచేస్తుంది

Infosys CEO Salil Parekh: ఏఐతో ఉద్యోగాలు పోవు, గుడ్ న్యూస్‌ చెప్పిన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడి

Arun Charagonda

ఐఏ కారణంగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సలీల్..తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు ఆధరణ లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ వస్తోందన్నారు.

King Cobra At Hospital: ఆస్పత్రిలో ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా,అల్లూరి జిల్లా చింతూరులో ఘటన, కోబ్రాను పట్టుకుని అడవీలో వదిలేసిన ఫారెస్ట్ సిబ్బంది..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 12 అడుగుల కోబ్రా ప్రత్యక్షమైంది. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కోబ్రాను సమీపంలోని అటవీ ప్రాంతంలో తరలించింది ఫారెస్టు సిబ్బంది. నిత్యం పాములు కనిపిస్తున్నాయని, మండలంలో స్నేక్ క్యాచర్‌ని నియమించాలని కోరుతున్నారు ప్రజలు. అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం జెన్‌కో ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

MLC Kavitha Gets Bail: ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్, రూ. 10 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు, ఐదు నెలల తర్వాత బయటకు రానున్న కవిత

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈడీ, సీబీఐ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను అదుపులోకి తీసుకుంది ఈడీ. ఆ తర్వాత సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో తీహార్ జైలులో ఉన్నారు కవిత.

Tirupathi: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో దారుణం, మహిళా డాక్టర్‌పై రోగి దాడి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టిన రోగి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ డాక్టర్‌ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు ఓ రోగి. వెంటనే స్పందించిన సహచర డాక్టర్లు ఆ రోగి బారి నుండి బాధిత డాక్టర్‌ను కాపాడారు.

Jishnu Dev Varma Visits Yadadri: యాదాద్రి ఓ అద్భుతం, తప్పకుండా మళ్లీ వస్తానన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,ఘనస్వాగతం పలికిన అధికారులు

Arun Charagonda

యాదాద్రి శ్రీలక్షీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. యాదాద్రి నర్సింహస్వామి సన్నిధానంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు.

Akbaruddin Owaisi On Hydra: హైడ్రాకు మరోసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్, అవసరమైతే నన్ను కాల్చండి..ఫాతిమా కాలేజీని కూల్చొద్దు...వీడియో వైరల్

Arun Charagonda

హైడ్రాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. నన్ను కాల్చినా పర్వాలేదు.. నా కాలేజీని కూల్చొద్దు అన్నారు. పాతబస్తీ సల్కం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజీ కట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.

Advertisement

Patnam Mahender Reddy On Hydra Demolition: హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఎమ్మెల్సీ పట్నం. తనది పట్టా భూమి అని.. నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టానని తెలిపారు.

Carlos Brathwaite: హెల్మెట్‌ను సిక్సర్‌గా కొట్టిన వెస్టిండీస్ ఆటగాడు, అంపైర్ పై కోపంతో..వీడియో వైరల్!

Arun Charagonda

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తో గ్రాండ్ కేమన్ జాగ్వార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ పై కోపంతో హెల్మెట్‌ను సిక్స్‌గా కొట్టాడు బ్రాత్ వైట్. న్యూజాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ బంతి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.

Bijili Ramesh Passes Away: తమిళ నటుడు బిజిలి రమేష్‌ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం

Arun Charagonda

తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు బిజిలి రమేష్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు. పక్షవాతంతో చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యారు రమేష్. అయితే పరిస్థితి విషమించగా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు.

Accident in Hyderabad: రెప్పపాటులో ప్రమాదం.. యూటర్న్ తీసుకుంటుండగా బైక్‌ ను ఢీకొట్టిన కారు.. (సీసీటీవీ ఫుటేజీ)

Rudra

రోడ్డు ప్రమాదాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాడారం ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ఓ తండ్రి, కుమార్తె కలిసి బైక్ పై వెళ్తున్నారు.

Advertisement

JC Prabhakar Reddy On Sand Mafia: ఇసుక దందాలో టీడీపీ నేతలు..జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్, అంతా నాకు కావాల్సిన వాళ్లే, దయచేసి ఆపండని విజ్ఞప్తి

Arun Charagonda

ఏపీలో ఇసుక అక్రమ దందాపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక దందాలో నా వాళ్లే 25 మంది ఉన్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతా తనకు కావాల్సిన వాళ్లేనని...అక్రమ దందాతో తనకు దూరమయ్యే పనులు చేయవద్దన్నారు. ఇకనైనా ఇసుక అక్రమ దందా ఆపాలని విజ్ఞప్తి చేశారు. జేసీ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

YouTube Premium Price Hike: భారత్ లో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెంపు.. ఏకంగా 58% పెంపు!

Rudra

ఇంటర్నెట్ విప్లవంతో భారత్ లో సోషల్ మీడియా వినియోగం పెర్గింది. ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే.

Free Vegetables: ఫ్రీగా కూరగాయలు.. పెద్దపల్లిలో భలే ఛాన్స్.. ఎగబడ్డ జనం.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)

Rudra

ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. వెయ్యితో బయటకు వెళ్తే, సంచీ నిండా కూరగాయలు రావడమే కష్టమైంది. ఇలాంటి సమయంలో కూడా పెద్దపల్లిలో మాత్రం కూరగాయలను ఉచితంగా అందిస్తున్నారు.

Telegram May Be Ban In India: భారత్‌లో టెలిగ్రామ్ పై నిషేధం?, గ్యాంబ్లింగ్,నేరపూరిత కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర విచారణ,అక్రమాలు నిజమని తేలితే నిషేధమే!

Arun Charagonda

టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్‌. అయితే ఇప్పుడు ఈ యాప్ పారదర్శకతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే నేరపూరిత కార్యక్రలాపాలు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ సరఫరాకు అడ్డగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, దర్యాప్తు ఫలితాలను బట్టి మెసేజింగ్ యాప్‌ను నిషేధించవచ్చని కేంద్ర వర్గాల సమాచారం.

Advertisement

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పై నేడే సుప్రీంలో విచారణ.. సర్వత్రా ఆసక్తి

Rudra

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Mark Zuckerberg: కరోనా కేసుల కంటెంట్ తొలగించాలంటూ బైడెన్ యంత్రాంగం మాపై ఒత్తిడి తెచ్చింది.. మెటా సీఈవో జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు

Rudra

కరోనా సంక్షోభ సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు చేశారు.

NCERT New Update: 9 నుంచి 11వ తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా పన్నెండో తరగతి ఫలితాలు.. ఎన్సీఈఆర్టీ నిపుణుల కమిటీ సూచనలు

Rudra

సీబీఎస్ఈ పన్నెండో తరగతిలో సాధించే మార్కుల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలో సాధించిన మార్కులను కూడా భాగం చెయ్యాలని ఎన్సీఈఆర్టీ కీలక సూచనలు చేసింది.

Vijayawada Horror: రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని అన్నను చంపిన తమ్ముడు.. విజయవాడలో ఘోరం

Rudra

విజయవాడలో ఘోరం జరిగింది. తన భార్యకు రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని ఓ తమ్ముడు తన అన్ననే చంపేశాడు. ఈ దారుణ ఘటన గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది.

Advertisement
Advertisement