తాజా వార్తలు
Chicken or the Egg? కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్నకు బలైన స్నేహితుడు, సమాధానం చెప్పలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరో స్నేహితుడు
Hazarath Reddyకోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్న స్నేహితుడి హత్యకు దారి తీసింది. ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్‌లోని మునా రీజెన్సీలో జూలై 24న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం , అనుమానితుడు DR గా గుర్తించబడ్డాడు, అతని స్నేహితుడు కదిర్ మార్కస్‌ని మందు పార్టీ కోసం ఆహ్వానించాడు.
CM Revanth Reddy On SC,ST Reservations: దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందన్న మందకృష్ణ
Arun Charagondaఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం..దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ సోదరులకు రిజర్వేషన్లు వర్తించేలా ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించారు.
Ismail Haniyeh Dead: హమాస్ మిలిటెంట్ గ్రూపుకు భారీ షాక్, వైమానికి దాడిలో పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతి
Hazarath Reddyఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపుకు భారీ షాక్ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు.
New FASTag Rules: వాహనదారులు అలర్ట్, నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే బ్లాక్‌లిస్టులోకి..
Hazarath Reddyనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం ఈరోజు (August 1, 2024) నుండి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
Cloudburst in Himachal: వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు
Hazarath Reddyసిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది (Building Washed Away). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Cloudburst in Himachal Pradesh: వయనాడ్ తర్వాత ప్రకృతి ప్రకోపానికి బలైన హిమాచల్ ప్రదేశ్, భారీ వరదలకు ఇద్దరు మృతి, మరో 36 మంది గల్లంతు
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
Supreme Court On SC, ST Reservation: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు, వర్గీకరణ నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టత, వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది
Arun Charagondaఎస్సీ ,ఎస్టీ వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్టీ, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం రాష్ట్రాలదేనని తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో తీర్పును వ్యతిరేకించారు జస్టిస్ బేలా త్రివేది. ఉప వర్గీకరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు త్రివేది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.
Andhra Pradesh: పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్ చల్, ట్యాంకర్‌కి నిప్పు పెడతానని బెదిరింపు, అడ్డుకున్న సిబ్బంది, వీడియో వైరల్
Arun Charagondaఏపీలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్‌చల్ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హల్‌చల్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త హంగామా చేశాడు. లేదంటే ట్యాంకర్‌కి నిప్పు పెడుతానంటూ సిలిండర్, లైటర్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. బంక్ సిబ్బంది ఎట్టకేలకు యువకుడిని అడ్డుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Shocker: అందమే ఆమె శాపమైంది, సినిమాల్లో ఛాన్స్ పేరుతో అత్యాచారం, మోసపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం
Arun Charagondaఅంతమే ఆమె పాలిట శాపమైంది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి ఒడగట్టాడు. హైదరాబాద్ పుప్పాలగూడలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Wayanad Landslides Live Updates: వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయ చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ
Arun Charagondaకేరళను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 200 మందికి పైగా మృతదేహాలు వెలికితీయగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్య్కూ కొనసాగుతోంది.
Uttar Pradesh: యూపీలో రెచ్చిపోయిన ఆకతాయిలు, బైక్‌పై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లిన యువకులు, కిందపడిపోయిన జంట
Arun Charagondaయూపీలోని లక్నోలో ఆకతాయిలు రెచ్చిపోయారు. తాజ్ హోటల్ బ్రిడ్జిపై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లుతూ కొందరు యువకులు వికృతానందం ప్రదర్శించారు. ఆకతాయిల అల్లరి చేష్టల కారణంగా కిందపడిపోయింది ఆ జంట. ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Anshuman Gaekwad: క్యాన్సర్‌తో పోరాడి ఓడిన టీమిండియా లెజెండరీ అన్షుమాన్ గైక్వాడ్,ఆటగాడిగా,కోచ్‌గా,సెలక్టర్‌గా రికార్డ్స్ ఇవే
Arun Charagondaభారత లెజండరీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ ఇకలేరు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన గైక్వాడ్ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన వయస్సు 71. గైక్వాడ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Delhi Rains: మళ్లీ ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు,నీట మునిగిన కాలనీలు, రెడ్ అలర్ట్ జారీ, స్కూళ్లకు సెలవు, విమానాలు దారి మళ్లింపు, ఆగస్టు 5 వరకు వర్షాలు
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తాయి. భారీ వర్షాలతో పలు కాలనీలు నీట మునగగా ఇళ్లు కూలిపోయాయి. పలు వాహనాల్లోకి నీరు చేరింది .భారీవర్షాలతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించింది. ఆగస్టు 5 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, గర్భిణీ కడుపులో నుంచి బయటకు ఎగిరిపడ్డ పిండం, మనోహరాబాద్ లో బైక్‌ను ఢీ కొట్టిన లారీ
sajayaమెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం 44వ జాతీయ రహదారి వద్ద జూలై 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది.
India Vs Sri Lanka ODI Series: భారత్-శ్రీలంక వన్డే సిరీస్ ను ఇలా ఉచితంగా చూసేయండి! జియో సినిమాలో కాదు..ఇక్కడ ఉచితంగా స్ట్రీమింగ్, ఇంతకీ సిరీస్ ఎప్పటి నుంచి అంటే?
VNSశ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా (Team India) క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై పడింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు (IND Vs SL ODI sreies) సిద్ధం అవుతోంది.
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో సరికొత్త రికార్డు, ఏకంగా 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్స్
VNSనేటితో గడువు పూర్తికానుండటంతో.. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు (IT Returns) పోటెత్తారు. జులై 31వ తేదీ ఒక్కరోజే సాయంత్రం ఏడు గంటలవరకు ఏకంగా 50 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ( IT Department) తెలిపింది.
DK Shivakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ, ఏయే అంశాలపై చర్చించారంటే?
VNSకర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు
Yellow Alert For Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన, వచ్చే నాలుగైదు రోజులు కుండపోత వానలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
VNSతెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Pawan Kalyan Meets Chandrababu: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుధీర్ఘ చర్చ, పంపకాలపై మూడు పార్టీల మధ్య ఒప్పందం
VNSఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) అమరావతిలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
ADR Report on Lok Sabha Poll: మొన్నటి ఎన్నికల్లో 365 సీట్లలో లక్షల్లో ఓట్ల తేడా, ఏపీలో 85 వేల ఓట్లకు పైగానే, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంచలన నివేదికను బయటపెట్టిన ఏడీఆర్
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద ADR సంస్ధ నివేదిక సంచలన విషయాలను బైట పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Poll 2024) 538 నియోజకవర్గాల్లో , 365 స్థానాల్లో లక్షల్లో ఓట్ల తేడా ఉనట్టు తెలిపింది