తాజా వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, బస్సులో సీటు కోసం జుట్టులు పట్టుకుని తన్నుకున్న మహిళలు, పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో ఘటన

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకం అమలు అయినప్పటి నుంచి బస్సుల్లో సీటు విషయంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి.తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో, సీటు కోసం ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

Bull Attack Video: షాకింగ్ వీడియో ఇదిగో, షాపుకు వెళుతున్న యజమానిపై అకస్మాత్తుగా దాడి చేసిన ఎద్దు, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

Team Latestly

రాజస్థాన్‌లోని బలోత్రాలోని బల్దేవ్ జీ కి పోల్ ప్రాంతంలో ఆదివారం నాడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 55 ఏళ్ల దుకాణదారుడిపై వీధిలో వెళుతున్న ఎద్దు దాడి చేసి ప్రాణాపాయం కలిగించింది. బాధితుడిని మోతీలాల్ అగర్వాల్‌గా గుర్తించారు.

Triple Talaq Row: భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త, కోర్టు బయట చెప్పుతో అతడిని చితకబాదిన బాధితురాలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ కోర్టులో భరణం కేసు విచారణకు హాజరైన ఓ మహిళ, కోర్టు బయటే తన భర్తను చెప్పుతో కొట్టింది. బాధితురాలి వివరాల ప్రకారం.. భర్త కోర్టు వెలుపల మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఆ తర్వాత ఆగ్రహంతో ఆమె భర్తపై చెప్పుతో దాడి చేసింది. ఈ సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Bengaluru Pothole Incident: బెంగళూరు రోడ్లు పరిస్థితి తెలిపే షాకింగ్ వీడియో, మరో బస్సును క్రాస్ చేస్తూ గుంతలో కూరుకుపోయిన బస్సు, 20 మంది పిల్లలకు తప్పిన పెను ప్రమాదం

Team Latestly

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని రోడ్లు గుంతలతో నిండిపోయిన దురవస్థ కారణంగా ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి.

Advertisement

Jio and Airtel: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు బిగ్ షాక్, రూ. 246 ప్లాన్ ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రాయ్ ఆదేశాలు

Team Latestly

భారత టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Reliance Jio, Bharti Airtel‌కు చౌకైన రూ. 249 మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించడం పై వివరణాత్మక సమాచారం కోరినట్లు తాజాగా సమాచారం వెల్లడి అయింది. గత కొన్ని రోజులుగా జియో 28 రోజుల చెల్లుబాటు గల రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది.

Bomb Threat Email: ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు

Team Latestly

ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌ అందడంతో కోర్టు సిబ్బంది, లాయర్లు, కేసులు విచారించేందుకు వచ్చిన ప్రజలు వెంటనే బయటకు పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ రంగంలోకి దూకడంతో ఘటనా స్థలంలో సమగ్ర తనిఖీలు ప్రారంభించారు.

Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో..రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి, తల్లి అప్రమత్తతో ప్రాణాలతో బయటకు.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఘటన

Team Latestly

హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారిని ఆమె తల్లి వెంటనే గమనించి సురక్షితంగా బయటకు తీసింది. ఈ ఘటన ఆరేళ్ల బాలిక తన తల్లి, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో జరిగింది.

Robbery Caught on Camera: వీడియో ఇదిగో.. కదులుతున్న వాహనం నుంచి సినిమా ఫక్కీలో దొంగతనం, ఆరుగురు నిందితులు అరెస్ట్

Team Latestly

మహారాష్ట్రలో కదులుతున్న ట్రక్కుపై సినిమా తరహాలో దొంగతనం జరిగినట్లుగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై ఉన్న ధరాశివ్ గ్రామం దగ్గర ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కెమెరాలో రికార్డైన ఈ దోపిడీ చర్యలో ధారాశివ్ గ్రామంలో పట్టపగలు కదులుతున్న ట్రక్కు నుండి దొంగల గుంపు దొంగతనం చేస్తున్నట్లు చూపిస్తుంది

Advertisement

ITR Filing 2025 Deadline: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీ గడువును పొడిగించండి, కేంద్రాన్ని కోరుతున్న పలువురు సీఏలు, మరి ఐటీఆర్ ఫైలింగ్ 2025 గడువును కేంద్రం పొడిగిస్తుందా ?

Team Latestly

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు తేదీని 2025 తేదీని పొడిగిస్తుందా? లేదా అనే దానిపై క్లారిటీ లేదు.అయితే సెప్టెంబర్ 15 గడువు దగ్గర పడుతున్నందున దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి పొడిగింపును డిమాండ్ చేస్తున్నందున ఈ ప్రశ్న తలెత్తుతుంది.

Andhra Pradesh Shocker: షాకింగ వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపామును మెడకు చుట్టుకుని హల్ చల్, రెండు సార్లు కరవడంతో ఆస్పత్రికి పరుగో పరుగు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి తన మెడకు విషపు నాగుపాము చుట్టుకుని వీధుల్లో తిరుగుతూ గందరగోళం సృష్టించాడు. గొల్లపల్లి కొండగా గుర్తించబడిన అతను తన కోడి బోనులో పామును కనుగొన్నట్లు తెలిసింది. అక్కడ అది తనను ఒకసారి కరిచింది.

France Political Turmoil: ఫ్రాన్స్‌లో 'బ్లాక్ ఎవ్రీథింగ్' నిరసన, పారిస్‌లో 200 మందికి పైగా వ్యక్తులు అరెస్ట్, నిరసనల అల్లకల్లోలం

Team Latestly

ప్రజాదరణ లేని కారణంగా ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన రెండు రోజుల తర్వాత కూడా ఫ్రాన్స్‌లోని నిరసనకారులు “బ్లాక్ ఎవ్రీథింగ్” ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడంలో 200 మందికి పైగా వ్యక్తులను ఫ్రెంచ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.

Hyderabad: షాకింగ్ వీడియో, కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ కు గురైన కస్టమర్, తర్వాత ఏమైందంటే..

Team Latestly

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక కనిపించింది. ఈ సంఘటన తీవ్ర భయభ్రాంతిని కలిగించింది. కస్టమర్ సంఘటనను వీడియోగా రికార్డ్ చేశాడు, అది త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

Saharanpur: వీడియో ఇదిగో, 11 ఏళ్ల బాలికపై వృద్ధుడైన కామాంధుడు దారుణం, రూంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు తీవ్ర ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

Team Latestly

ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కలకలం రేపే సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మిల్లు యజమాని అని పేర్కొనబడుతున్న నిందితుడు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

KP Sharma Oli Resigns: హిమాలయ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం, ప్రధాని పదవికి రాజీనామా చేసిన కె.పి. శర్మ ఓలి, సోషల్ మీడియా నిషేధంపై వెలువెత్తుతున్న నిరసనలు

Team Latestly

సైన్యం సూచన మేరకు ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నెపాల్‌లో కొత్త ప్రధాన మంత్రి ఎవరో ఈ సాయంత్రం ప్రకటించనున్నట్లు వార్తలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.

Political Turmoil in Nepal: నేపాల్ అధ్యక్షుడు రాజీనామా, ప్రధాని రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రామ్ చంద్ర పొదెల్ రాజీనామా, ఆగ్రహ జ్వాలలతో అట్టుడుకుతున్న నేపాల్

Team Latestly

నేపాల్ దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇటీవల రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు.

Baghpat Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. 80 ఏళ్ళ అమ్మమ్మను ఇంట్లోనే జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన మనవడు, ఇంటి నుండి బయటకు వెళ్లాలంటూ చిత్రహింసలు

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా సింఘావాలి అహిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసూద్ గ్రామం నుండి ఒక కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో, ఫర్మాన్ అనే వ్యక్తి తన 80 ఏళ్ల అమ్మమ్మను ఇంట్లోనే దారుణంగా దాడి చేశాడని చూపించే సీసీటీవీ వీడియో వైరల్ అయింది.

Advertisement

Fact Check: రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ.20 లక్షలు సంపాదించవచ్చంటూ నిర్మలా సీతారామన్ పేరుతో న్యూస్ వైరల్, క్లారిటీ ఇచ్చిన PIB

Team Latestly

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఒక ప్రకటనలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సుధా మూర్తి.. క్వాంటం AI ప్రాజెక్ట్ ద్వారా రూ. 21 వేల ప్రారంభ పెట్టుబడితో నెలకు 20 లక్షల వరకు లాభాలు పొందవచ్చని పేర్కొంటోంది. ఈ ప్రకటన వినియోగదారులను రెండు రోజుల్లో నమోదు చేసుకోవాలని ఆహ్వానిస్తూ వైరల్ అవుతోంది.

Viral Video: వీడికి ఇదేమి పోయేకాలం.. రీల్ కోసం రైలు పట్టాలపై పడుకున్న యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Team Latestly

ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌లపై ఉద్దేశపూర్వకంగా పడుకున్నట్లు చూపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 36 సెకన్ల క్లిప్‌లో వేగంగా వస్తున్న రైలు పట్టాలపై పడుకుని ఉండగా..రైలు అతని మీద నుంచి వెళుతుంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి, అరుస్తూ, రికార్డ్ చేస్తున్న వ్యక్తి వైపు నడిచే దృశ్యాలు ఉన్నాయి.ఈ వీడియో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది

Hyderabad: షాకింగ్ వీడియోలు ఇవిగో.. ఖైరతాబాద్ వినాయకుని వద్ద మహిళలతో అసభ్య ప్రవర్తన, వారం రోజుల్లో 900 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసిన షీ టీమ్స్

Hazarath Reddy

తెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చిన మహిళా భక్తులను వేధించినట్లు ఆరోపణలతో హైదరాబాద్ పోలీసుల షీ టీమ్స్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే 900 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Junagadh Hostel Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో.. ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థిని దారుణంగా చితకబాదిన మరికొందరు విద్యార్థులు

Team Latestly

ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో చదువుతున్న ఒక విద్యార్థిని పై ఇతర విద్యార్థులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1 నిమిషం 1 సెకను నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement