India
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, యూపీలో ఫేక్ అంత్యక్రియలకు యత్నించిన ముగ్గురు అరెస్ట్, బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి, మరో ఇద్దరు వ్యక్తులు
Indiaசெய்திகள்
Thane Shocker: ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు, చివరకు ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టుతో దొరికిపోయాడు, థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
Team Latestlyమహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక భయానక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శవాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Team Latestlyహైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.
Andhra Pradesh: ఏపీలో మరో 3 జిల్లాలు ఏర్పాటు, కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు, రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య,మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.
Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఒక విషాదకరమైన సంఘటనలో, ఒక జంట హల్ది వేడుకలో వారి ప్రవేశానికి ఏర్పాటు చేసిన హైడ్రోజన్ బెలూన్లు పేలిపోవడంతో వధూవరులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
Team Latestlyఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన బాలుడి ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో బాలుడు బంతితో ఆడుకుంటూ బయటకు వస్తుండగా, పొరుగింటి పెంపుడు పిట్‌బుల్ అకస్మాత్తుగా వచ్చి అతనిపైకి దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి
Tirumala Token Booking: డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, నవంబర్ 27 నుంచి ఆన్లైన్లో టోకెన్ల రిజిస్ట్రేషన్, సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. తొలి మూడు రోజులు సర్వదర్శనానికే
Team Latestlyడిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు మొత్తం 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ భక్తుల సౌకర్యం దృష్ట్యా పలు కీలక మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.
'No Religious Rituals on Duty': డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన
Team Latestlyతెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షల్లో పాల్గొనే విషయంలో కొత్తగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి ఆచారాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది డ్యూటీకి హాజరుకావద్దని, తప్పనిసరిగా ముందస్తు సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, నేడు వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Team Latestlyదక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడన స్థాయిలో ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది
Justice Surya Kant: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం, జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానంలో నియామకం, 15 నెలలు పాటు పదవిలో కొనసాగనున్న కాంత్
Team Latestlyజస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) నవంబర్ 24, సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానాన్ని ఆయన భర్తీ చేసారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన పదవీకాలం దాదాపు 15 నెలలు ఉండనుంది.
Pakistan Suicide Blast: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి లైవ్ వీడియో ఇదిగో, పారామిలిటరీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి, ఇద్దరు FC కమాండోలు మృతి
Team Latestlyనవంబర్ 24, సోమవారం ఉదయం పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ (FC) ప్రధాన కార్యాలయంపై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు FC కమాండోలు, ముగ్గురు దాడి చేసిన వ్యక్తులు సహా మొత్తం ఐదుగురు మరణించారు.
Uttar Pradesh Road Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది, 15 మంది ప్రయాణికులకు గాయాలు
Team Latestlyనవంబర్ 23, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎటావా నుండి మెయిన్‌పురికి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, ఉత్తరప్రదేశ్‌లోని వైద్పురా ప్రాంతంలోని మదర్ డెయిరీ ప్లాంట్ సరిహద్దు గోడను బలంగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టిన ప్రభావంతో గోడ కూలిపోగా, దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్లాంట్ లోపల నిలిపి ఉంచిన ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది.
Dharmendra Dies: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణం తీరని లోటు, సంతాపం వ్యక్దం చేసిన ప్రధాని మోదీ, ధర్మేంద్ర మృతి ఒక యుగం ముగింపు అంటూ ట్వీట్
Team Latestlyప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో హృదయపూర్వక నివాళి అర్పించారు. భారతీయ సినిమాకు ధర్మేంద్ర చేసిన అసాధారణ సేవలను గుర్తుచేసుకుంటూ, “ధర్మేంద్ర జీ మృతి ఒక యుగం ముగింపు.
Earthquake: బంగ్లాదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం, కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్లో భారీ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Team Latestlyబంగ్లాదేశ్‌లో సంభవించిన భూకంప ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఈ ఉదయం కంపించిపోయింది. ఉదయం 10:08 గంటలకు వచ్చిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం నర్సింగ్ది ప్రాంతానికి సమీపంగా, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Mumbai Car Fire: వీడియో ఇదిగో, ఆగి ఉన్న కారులో భారీ అగ్నిప్రమాదం, క్షణాల్లోనే కాలిబూడిదైన వాహనం
Team Latestlyనవంబర్ 20, గురువారం మధ్యాహ్నం ముంబైలోని భివాండిలో ఆగి ఉన్న కారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భివాండిలో కారు మంటలకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ పిటిఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో, కారు మొత్తం మంటల్లో కాలిపోయినట్లు చూడవచ్చు. వార్తా సంస్థ ప్రకారం, మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి.
Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్యూటీ సమయంలో ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగి, కంప్యూటర్లు పని చేయడం లేదంటూ సేవలు నిలిపివేత
Team Latestlyకాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలోని ఒక పోస్టాఫీసులో duty సమయంలో ఉద్యోగి ప్రవర్తనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ సేవలు పొందడానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని, కంప్యూటర్లు పనిచేయడం లేదనే పేరుతో సేవలను నిలిపివేసి ఉద్యోగి మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ గడుపుతున్నాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
Hyderabad: హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్, ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్న సోనోకో, ఈబీజీ పవర్‌హౌస్‌పై రెండేళ్లలో భారీ పెట్టుబడికి ప్రణాళిక
Team Latestlyహైదరాబాద్ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో.. మరో రెండు ప్రముఖ గ్లోబల్ సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్, జర్మన్ బహుళ రంగ సంస్థ ఈబీజీ గ్రూప్ తమ కొత్త కేంద్రాలను హైదరాబాద్‌లో స్థాపించడం, నగర వ్యాపార వాతావరణానికి మరొక కీలక గుర్తింపుగా నిలిచింది.
Egg Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు, సామాన్యులు కొనలేక విలవిల, జనవరి వరకు ఇదే పెరుగుదల ఉంటుందని చెబుతున్న మార్కెట్ వర్గాలు
Team Latestlyఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు సాధారణ ప్రజలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న ఈ పెరుగుదల రిటైల్ నుండి హోల్‌సేల్ మార్కెట్ల వరకు అన్ని స్థాయిల్లో ప్రభావం చూపిస్తోంది. ఒక్కో గుడ్డు ధర రిటైల్ అవుట్లెట్లలో ఏడు రూపాయలను దాటిపోవడం వినియోగదారులకు గట్టి భారం అయింది.
YS Jagan: అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్, నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ, అనంతరం సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్
Team Latestlyఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఆయన కొద్ది సేపు వెయిటింగ్ రూంలో వేచిచూశారు.
Patna Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, పాట్నాలో గర్భిణీ స్త్రీని స్కూటర్‌తో లాక్కెళ్లిన పోలీసు, కారణం ఏంటంటే..
Hazarath Reddyపాట్నాలోని మెరైన్ డ్రైవ్ నుండి వచ్చిన ఒక షాకింగ్ వీడియోలో, రోడ్డు తప్పు వైపుకు ప్రవేశించడంపై ట్రాఫిక్ వివాదం తర్వాత ఒక పోలీసు.. గర్భిణీ స్త్రీని తన స్కూటర్‌తో లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ మహిళ దాదాపు 20 మీటర్ల దూరం స్కూటర్‌ను అంటిపెట్టుకుని ఉండి పడిపోవడంతో గాయాల పాలైంది,
Passenger Falls from Train: వీడియో ఇదిగో, రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘటన
Team Latestlyహైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలు పూర్తిగా ఆగకముందే ప్లాట్‌ఫాంపైకి దిగేందుకు ప్రయత్నించిన ఒక ప్రయాణికుడు అదుపు తప్పి రైల్వే ట్రాక్ వైపు జారిపోయాడు.