India
Stampede at Mumbai's Bandra Railway Station: దీపావళి ఎఫెక్ట్.. బాంద్రా రైల్వే స్టేషన్ లో రద్దీ.. తొక్కిసలాట.. 9 మందికి తీవ్ర గాయాలు.. వీడియో ఇదిగో!
Rudraదీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1లో జరిగిన ఈ తొక్కిసలాటలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Snake At Sofa Pillow Cover: షాకింగ్...సోఫా పిల్లో కవర్‌లో త్రాచు పాము, వింత శబ్దాలు రావడంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన ఇంటి సభ్యులు..వీడియో ఇదిగో
Arun Charagondaఓ ఇంట్లో పిల్లో నుంచి వింత శబ్దాలు రావడంతో ఆ సౌండ్ అచ్చం పాము శబ్దం మాదిరి ఉండడంతో, స్నేక్ క్యాచర్‌ని పిలిచారు. స్నేక్ క్యాచర్ వచ్చి పిల్లోని ఓపెన్ చేయగానే ఆ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. వెంటనే ఆ పామును పట్టి తీసుకెళ్లి దగ్గరలో ఉన్న అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
BJP MP Raghunandan Rao: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీపై సిట్ వేయాలన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Telangana: తిరుపతి వెళ్లొచ్చే లోపు అక్రమ నిర్మాణమని ఇంటిని కూల్చేశారు, మూసాపేటలో తాళం వేసిన ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని బాధితుల ఆవేదన
Arun Charagondaహైడ్రా అధికారుల అత్యుత్సాహం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్ళారు. తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు అక్రమ నిర్మాణమని కూల్చేశారు అధికారులు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని, ఇంట్లో సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!
Rudraతెలంగాణలోని టూరిజం అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది.
Nalgonda: కొనసాగుతున్న కానిస్టేబుళ్ల ఆందోళన, ఏక్ పోలీస్ విధానాన్ని రద్దు చేయాలని నల్గొండ 12వ బెటాలియన్‌లో పోరుబాట...వీడియో ఇదిగో
Arun Charagondaనల్గొండ 12వ బెటాలియన్లో కానిస్టేబుల్స్ ఆందోళన కొనసాగుతోంది. నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్లని అకారణంగా సస్పెండ్ చేశారని తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని రద్దుచేసి పోలీసులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బెటాలియన్ కానిస్టేబుల్స్.
Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయం సందర్శన, పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు లోకేష్. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించారు లోకేష్.
TDP Vs YSRCP: పలాస పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న టీడీపీ- వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుల పరస్పర దాడులు..ఇరువర్గాలపై కేసు నమోదు
Arun Charagondaపోలీస్ స్టేషన్ లోనే రెచ్చిపోయి కొట్టుకున్నారు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. పోలీసుల ముందే పిడిగుద్దులు కురిపించుకున్నారు నేతలు. పలాస కాశీబుగ్గ పీఎస్ లో ఘటన జరుగగా ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుల పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నేతకు గాయాలు కాగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Rave Party at Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌస్ లో వీఐపీల రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు.
Tamil Nadu: తమిళ హీరో విజయ్ టీవీకే మహానాడు..విళుపురం జిల్లాలో భారీగా ఏర్పాట్లు, తొలిసారి తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా అందరి దృష్టి విజయ్‌పైనే
Arun Charagondaఇవాళ తమిళనాడు హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు మహానాడు జరగనుంది. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు జరగనుండగా తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు హీరో విజయ్.
Constable Dance: 57 ఏళ్ల లేటు వయసులో ‘ముక్కాల..’ పాటకు డాన్స్ ఇరగదీసిన కానిస్టేబుల్ రాజేందర్ (వైరల్ వీడియో)
Rudraపోలీసుల జీవితం అంటే ఉరుకులు, పరుగులే. అయితే, వారికీ ఆటవిడుపు ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధికారులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Fire Accident at Jangaon: జనగామలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. టెన్షన్ టెన్షన్ (వీడియో)
Rudraజనగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
Hyderabad Horror: హైదరాబాద్ లో భర్తను హత్య చేసి ఊటీ ఎస్టేట్ లో తగులబెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం
Rudraహైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి సాయంతో అతని భార్యే ఈ ఘాతుకానికి తెగిపడింది.
AI Death Calculator: మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్’.. బ్రిటన్ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?
Rudraపుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదంటారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు అంటారు. అయితే, మరణాన్ని ముందుగానే కనిపెడితే ఎలా ఉంటుంది.
Video Viral: హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. వీడియో వైరల్
sajayaగంజాయి మత్తులో ఉన్న యువకులు కొందరు హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వెంటనే మంటలను సిబ్బంది ఆర్పేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది యువకులను అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు.
Jiobharat Diwali Dhamaka Offer: దీపావళి కానకగా ధరలు భారీగా తగ్గించిన జియో, కేవలం రూ. 699కే ఫోన్, ఏకంగా 450 ఛానెల్స్ చూడొచ్చు. ఇంకా ఏయే ఆఫర్లున్నాయంటే?
VNSరిలయన్స్ జియో లవర్స్‌కు గుడ్ న్యూస్.. జియోభారత్ ఫీచర్ ఫోన్ల (Jio Phones) ధరలు తగ్గాయి. దీపావళి పండుగకు ముందుగానే జియోభారత్ 4G ఫీచర్ ఫోన్ ధరలను తగ్గించింది. 4జీ కనెక్టివిటీతో టెలికాం ఆపరేటర్ ఫీచర్ ఫోన్‌లు ప్రస్తుతం రూ. 699కు అందుబాటులో ఉన్నాయి.
Lucknow: 11 ఏళ్ల బాలిక ప్రైవేట్ పార్ట్స్ లో వేళ్లు పెట్టిన భూతవైద్యుడు, కర్రతో చితకబాదిన కుటుంబ సభ్యులు, వైరల్ వీడియో ఇదుగోండి
VNSపొలంలో పని చేసుకునే కుటుంబం వద్దకు తాంత్రికుడు వెళ్లాడు. ఆకలిగా ఉందని వారితో చెప్పాడు. తినేందుకు ఎదైనా తెచ్చేందుకు పెద్దలు వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. తన కుటుంబానికి ఆమె చెప్పడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తాంత్రికుడ్ని చితకబాదారు
Centre Caution To Social Media Platforms: ఫేక్ బాంబు బెదిరింపులపై సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లకు కేంద్రం హెచ్చరిక, వారిని గుర్తించే పని మీదే అంటూ ఆదేశాలు
VNSసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది.
Telangana Cabinet Decisions: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధి పెంపు, ధరణి స్థానంలో భూమాత సహా అనేక అంశాలకు పచ్చజెండా
VNSతెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. మున్సిపాలిటీగా మద్దూర్ మండల కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. సన్న బియ్యానికి రూ.500 బోనస్ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ (Cabinet Decisions) ఇచ్చింది.
Telangana DGP: పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై స్పందించిన తెలంగాణ డీజీపీ, క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్న జితేందర్
Arun Charagondaస్పెషల్ పోలీసుల ఆందోళనలపై స్పందించారు తెలంగాణ డీజీపీ జితేందర్. క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదు అన్నారు. ఎంతో కాలం నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని...మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ వ్యవస్థనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు.