India

Bengaluru: ఉద్యోగాల పేరుతో మైనర్ బాలికలతో వ్యభిచారం, 12 మంది మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు, జువైనల్ హోంకు తరలింపు

Arun Charagonda

కర్ణాటక రాజధాని బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో 12 మంది మైనర్ బాలికలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో సహా త్రిపుర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర మరియు కర్ణాటకతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి మైనర్ బాలికలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు.

Telangana AEOs Protest: 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, నిరసనగా ఇవాళ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన ఏఈవోలు

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు ఏఈవో లు. సస్పెండ్ చేసిన 160 మంది ఏఈవో లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మంది ఏఈవో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలి రావాలన్న ఏఈవో ల సంఘం నేతలు కోరారు.

YS Jagan: ఇవాళ గుంటూరు, కడప జిల్లాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ, రాత్రి పులివెందులలో బస చేయనున్న జగన్

Arun Charagonda

నేడు గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్. గుంటూరులో యువకుడి దాడిలో మృతిచెందిన..యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే మధ్యాహ్నం బద్వేల్‌కు బయల్దేరనున్న జగన్‌ ప్రేమోన్మాది దాడిలో మృతిచెందిన..దస్తగిరిమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల చేరుకుని అక్కడే బస చేయనున్నారు.

Cyclone Dana Live Updates: నాలుగు రాష్ట్రాలకు 'దానా' తుపాను ఎఫెక్ట్, ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు మూసివేత, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

Arun Charagonda

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఒడిశా ,పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలలోని అన్ని పాఠశాలలును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. దానా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

Snake Rescued in Uttar Pradesh: వీడియో ఇదిగో, పొలంలో మందు పిచికారీ చేస్తున్న రైతు పైకి దూసుకొచ్చిన 10 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో వరి పొలంలో కనిపించిన 10 అడుగుల పొడవున్న కొండచిలువను అటవీ అధికారులు రక్షించారు. పొలంలో మందు పిచికారీ చేస్తున్న రైతుకు భారీ పాము కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు

Bengaluru Building Collapse Video: వీడియో ఇదిగో, కూలీలు పనిచేస్తుండగానే కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు భవన కార్మికులు

Vikas M

కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Chain Snatching Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, మెడలో చైన్ రాకపోవడంతో మహిళను అలాగే ఈడ్చుకెళ్లిన దొంగలు, తమిళనాడులోని మధురైలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

Vikas M

తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఈనెల 20న బైక్పై వచ్చిన నిందితులు ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగడానికి ప్రయత్నించారు. గొలుసు లాగే క్రమంలో కిందపడిపోయిన ఆమెను అలాగే రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లారు.

Toyota Rumion:టయోటా రూమియన్ పండుగ ఎడిషన్ విడుదల, ధర రూ. .10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల వరకు..

Vikas M

టొయోటా గ్లాన్జా, టైసర్, హైరైడర్ యొక్క పండుగ ఎడిషన్‌లను ప్రారంభించింది. ఇప్పుడు, కంపెనీ రూమియోన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

Advertisement

BSNL Tariffs: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్, సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచబోమని కీలక ప్రకటన

Vikas M

వివిధ కంపెనీలు మొబైల్ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెంపుపై స్పష్టతనిచ్చింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచబోమని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తదితర ప్రైవేటు ఆపరేటర్లు ఇటీవల టారిఫ్‌ను పెంచాయి.

Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మ, సినిమా రంగానికి చేసిన సేవలకు గాను మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు

Vikas M

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు బొమ్మను ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్‌ ప్రతినిధులు... రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు.

Amaravati Drone Summit 2024: ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన విజయవాడ డ్రోన్ షో, సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి.

BSNL New Logo: బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో ఇదిగో, భారతదేశంతో కూడిన లోగోను ఆవిష్కరించిన భారత కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

Vikas M

భారత కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసన్ సమక్షంలో కొత్త BSNL లోగోను ఆవిష్కరించారు. BSNL యొక్క కొత్త లోగో పాతదానితో పోలిస్తే చాలా మార్పులతో వచ్చింది.

Advertisement

Tech Layoffs in October 2024: లేఆప్స్ షాకింగ్ న్యూస్, ఈ ఏడాది 1,41,145 మంది ఉద్యోగులను తొలగించిన 470 కంపెనీలు, భవిష్యత్తులో మరిన్ని కోతలు పడే అవకాశం

Vikas M

పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు ఈ ఏడాది టెక్ తొలగింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేక టెక్ కంపెనీలు నిశ్శబ్ద తొలగింపులు, స్వచ్ఛంద పదవీ విరమణల వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి, వారిని రాజీనామా చేయమని ప్రోత్సహించడం, ఇమెయిల్ ద్వారా వారికి తెలియజేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

Cyclone Dana: రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Producer Sivaramakrishna Arrest: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం, అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో రాయదుర్గంలోని రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు.

KTR on Ganga Reddy Murder Case: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

Advertisement

Ram Charan: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రామ్ చరణ్, రోల్స్ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన చరణ్...సెల్ఫీ కోసం ఎగబడ్డ అభిమానులు

Arun Charagonda

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చారు. ఇటీవలె రోల్స్ రాయ్స్ వాహనాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాహనం రిజిస్ట్రేషన్ కోసం రాగా సందడి వాతావరణం నెలకొంది. రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేసిన రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.

Ganga Reddy Murder Case: నీకో దండం నీ పార్టీకో దండం, కాంగ్రెస్ పార్టీపై మండిపడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలకే భరోసా లేదని ఆవేదన

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, ఉదయం నుండి పవన్ రాక కోసం ఎదురుచూపులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జనసేన ఆఫీస్ దగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పడిగాపులు గాస్తున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుండగా ఆయన కార్యాలయ సిబ్బంది స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం కటిక నేల మీదేనిన్నంతా మహిళ ఉద్యోగుల పడిగాపులు గాశారు

TMC Leader Kalyan Banerjee: వ‌క్ఫ్ బిల్లుపై టీఎంసీ, బీజేపీ ఎంపీల మ‌ధ్య వాగ్వాదం, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ చేతికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఈ రోజు వ‌క్ఫ్ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘం మీటింగ్ జ‌రిగింది. బీజేపీ ఎంపీ జ‌గ‌దాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ మీటింగ్ జ‌రిగింది.రిటైర్డ్ జ‌డ్జీలు, లాయ‌ర్లు ప్యాన‌ల్ ఇచ్చిన అభిప్రాయాల‌ను ఆ స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ(TMC MP Kalyan Banerjee) గాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement