India

Telangana: అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

Telangana: అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరగనున్నాయి

Rats Found in IIT Roorkee Kitchen: ఐఐటీ హాస్టల్ మెస్‌లో జలకాలడుతున్న ఎలుకలు, బిత్తరపోయి ఆహారం బయట తిన్న విద్యార్థులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

IIT రూర్కీలోని విద్యార్థులు అక్టోబర్ 17 న రాధాకృష్ణ భవన్ మెస్‌లో వంటగది పాత్రల చుట్టూ ఎలుకలు తిరుగుతున్నట్లు చూపిస్తూ షాకింగ్ చిత్రాలు మరియు వీడియోలు వెలువడిన తర్వాత నిరసనలు చేపట్టారు. పాన్‌లు, బియ్యం మరియు ఇతర రేషన్‌లపై ఎలుకలు తిరుగుతున్నట్లు ఫుటేజీలో చిత్రీకరించబడింది,

Gautam Adani Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం అందజేత

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని అందజేశారు. రూ. 100 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు అదానీ.

Advertisement

Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి

Hazarath Reddy

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.

KTR on Musi River: మూసి బ్యూటిఫికేషన్ కాదు లూసిఫికేషన్, గ్రాఫిక్స్ మాయాజాలంతో నానా తంటాలు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ రివర్ ప్రాజెక్టుపై కేటీఆర్ పవన్ పాయింట్ ప్రజెంటేషన్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మూసి రివర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్నారు.

KA Paul: తెలంగాణలోని కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశా, చంపుతామని బెదిరిస్తున్నారు కేఏ పాల్ సంచలన కామెంట్

Arun Charagonda

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణాలో కొంద‌రు ఎమ్మెల్యేలపై కేసు వేశాను...నేను వేసిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. గతంలోనూ ఇలానే బెదిరింపులు వచ్చాయని... తనని తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు.. పవన్‌కళ్యాణ్ అదే అంటాడు కానీ తగ్గడు అన్నారు.

Hyderabad: అశోక్‌నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థుల అరెస్ట్, జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఝుళిపించిన పోలీసులు, మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

Arun Charagonda

హైదరాబాద్, అశోక్ నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నవారిపై లాఠీలు ఝుళిపించారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Andhra Pradesh: వీడియోలు ఇవిగో, ఉచిత ఇసుక ఎక్కడ బాబు అంటూ జంగారెడ్డిగూడెంలో ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా, ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్‌ బైపాస్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Jagan Slams Chandrababu: 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీలో ఇసుక పాలసీపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం మాట్లాడారు. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు.

Dalit Bandhu: ప్రజాభవన్ ముందు దళిత బంధు లబ్దిదారుల ఆందోళన, రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్..

Arun Charagonda

హైదరాబాద్ ప్రజా భవన్ ముందు ధర్నా చేపట్టారు దళిత బంధు లబ్ధిదారులు. రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని...ఈనెల 23 నా జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దళిత బంధు నిధుల'పై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపు దళిత బంధు నిధులను విడుదల చేయాలని నినాదాలు చేపట్టారు.

Viral Video: వీడియో ఇదిగో, తల్లిదండ్రులకు భయపడి ప్రియుడ్ని ట్రంక్ పెట్టెలో దాచిన ప్రియురాలు, ఆ తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

బీహార్‌లో కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ఓ యువ‌తి త‌న బాయ్‌ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది

Advertisement

Bigg Boss Kannada 11: వివాదంలో కన్నడ బిగ్ బాస్ షో, న్యాయవాది ఫిర్యాదుతో మహిళా కమిషన్ నోటీసులు, బిగ్ బాస్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

Arun Charagonda

టెలీవిజన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 11 కన్నడ విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఈ షో నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యాయి. మహిళ కంటెస్టెంట్ల గోప్యతకు భంగం వాటిల్లిందని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

YS Sharmila: ఉచిత బస్సు అమలు ఏది?, సీఎం చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ షర్మిల, బస్సులో ప్రయాణించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బస్సులో ప్రయాణించిన షర్మిల...ఏపీ లో బాబు అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఉచిత బస్సు అమలు లేదంటూ ప్రశ్నించారు.

Supreme Court: సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు, సోమవారం మొదటి కేసుగా విచారణ చేపడతామని తెలిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్..

Arun Charagonda

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అడ్వకేట్ మోహిత్‌రావు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని చిఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ దాఖలు చేయగా గ్రూప్ 1 కేసు పిటిషన్‌ను సోమవారం విచరాణ చేపడుతామని చెప్పారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. మొదటి కేసుగా సోమవారం ఉదయం 11.30 కి విచారణ చేపడతామని చెప్పారు.

Annie Master On Jani Master: జానీ మాస్టర్‌తో కలిసి పనిచేశా, ఒకవేళ బాధితురాలికి అన్యాయం జరిగితే ఆమెకు అండగా నిలబడతానన్న అనీ మాస్టర్...వైరల్ వీడియో

Arun Charagonda

జానీ మాస్టర్ తో కలిసి పనిచేశాను.. కానీ ఆయన అలా చేశారంటే నమ్మలేకపోతున్నా అన్నారు కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో షాక్ అయ్యానని చెప్పారు. మాస్టర్ నాతో ఎప్పుడూ తప్పుగా వ్యవహరించలేదు అని...ఒకవేళ బాధితురాలికి నిజంగానే అన్యాయం జరిగితే మాత్రం ఆమెకు మద్దతుగా నిలబడతాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Borugadda Anil Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు బొరుగడ్డ అనిల్, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్

Hazarath Reddy

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ బొరుగడ్డ అనిల్ కుమార్ నీ అరెస్టు చేశామని,రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అతనికి 14 రోజులు రిమాండ్ విదించడం జరగింది

Harishrao On CM Revanth Reddy: రేవంత్..నీది నోరా మోరా?, మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు అని చెప్పలేదా?,దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ బాధితుల దగ్గరికి వెళ్దామని ఛాలెంజ్‌

Arun Charagonda

సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా...డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం అని తేల్చిచెప్పారు.

New Liquor Policy in AP: ఏపీలో ఇక రూ.99ల క్వార్టర్ బాటిల్ వచ్చేసింది, ఈ నెలలో కోటి ఇరవై లక్షల సీసాలు రెడి అవుతున్నట్లు వెల్లడించిన ఎక్సైజ్ అధికారి నిశాంత్ కుమార్

Hazarath Reddy

రాష్ట్ర ఎక్సైజ్ అధికారి మందు బాబులకు గుడ్ న్యూస్ అందిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు.

Andhra Pradesh Shocker: హైదరాబాద్‌లో ప్రేమ పుట్టింది, గుంటూరులోని రైల్వే పట్టాలపై విషాదంగా ముగిసింది, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యలో కీలక విషయాలు

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21)లుగా గుర్తించారు.

Advertisement
Advertisement