India

Tesla Cyber Cab: రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని టెస్లా చీఫ్ ప్రకటన

Arun Charagonda

రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని ప్రకటించారు టెస్లా చీఫ్. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా సైబర్ కార్ ఎక్కారు ఎలాన్ మస్క్. సైబర్ కారులో ఇద్దరు, రోబో వ్యాన్ లో 20 మంది ప్రయాణించవచ్చు.

TikTok Layoffs: ఆగని లేఆప్స్, 700 మంది ఉద్యోగులను తొలగించిన టిక్‌టాక్‌, మార్కెటింగ్‌, కంటెంట్‌ విభాగాల్లోనే తొలగింపులు

Hazarath Reddy

టిక్‌టాక్‌ మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ప‌లికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్‌ అందినట్లు స‌మాచారం. కాగా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Telangana Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Hazarath Reddy

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Pawan Kalyan: ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్‌కు డిప్యూటీ సీఎం పదవా?, రాజీనామా చేయాలన్న దివ్వెల మాధురి, మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్‌

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు దివ్వెల మాధురి. ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడిన మాధురి..ముగ్గురిని పెళ్లి చేసుకొని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ఆపాదించవద్దని పవన్ ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.

Advertisement

Kondareddy Palle: రూ.200 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామం కొండారెడ్డి పల్లిలో అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీకి రేవంత్ తండ్రి పేరు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరులో అభివృద్ది పనులు జోరందుకున్నాయి. రూ.200 కోట్లతో ముస్తాబవుతోంది కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు.

Noel Tata: టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌‌గా నోయెల్‌ టాటా, ట్రస్ట్‌ బోర్డుల సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం, రతన్‌ టాటా సవతి తల్లి సిమోన్‌ టాటా కుమారుడే ఈయన

Hazarath Reddy

రతన్ టాటా మరణంతో ఖాళీ అయిన టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ పదవికి (Chairman of Tata Trusts) నోయెల్‌ టాటా (Noel Tata) నియమితులయ్యారు. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ను ఎన్నుకుంటూ ట్రస్ట్‌ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

ED Money Laundering Case: మనీలాండరింగ్ కేసు,శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట, ఈడీ నోటీసులపై స్టే

Hazarath Reddy

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ ను ఈ నెల 13వ తేదీ లోగా ఖాళీ చేయాలని ఈడీ ఇచ్చిన నోటీసులను శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే.

Mahadev Satta Matka Betting App: మహదేవ్‌ బెట్టింగ్‌ కేసులో యాప్‌ యజమాని సౌరభ్ చంద్రకర్ దుబాయ్ లో అరెస్ట్, భారత్ తీసుకురానున్న పోలీసులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev betting App) కుంభకోణం కేసులో బెట్టింగ్‌ యాప్‌ యజమాని సౌరభ్‌ చంద్రకర్‌ (Saurabh Chandrakar)దుబాయ్ లో తాజాగా అరెస్ట్‌ అయ్యారు.

Advertisement

Nalgonda: నల్గొండ ఎన్‌హెచ్‌-65పై దగ్దమైన లారీ, డివైడర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంక్ పగిలి అంటుకున్న మంటలు, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని ఎన్‌హెచ్‌-65పై సిమెంట్‌ బస్తాలతో వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగిలి లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ బయటకు దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Kinnera Mogulaiah: అమానుషం..పద్మ శ్రీ మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు

Arun Charagonda

రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్లో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రి కూల్చివేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కిన్నెర మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Beware Of Cyber Criminals: బ్యాంకు అధికారుల పేరుతో బెదిరింపులు..సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి...వీసీ సజ్జనార్ ట్వీట్

Arun Charagonda

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. RBI/బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీలు/కొరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు చేసే ఆడియో/వీడియో కాల్‌లు చట్టపరమైన చర్యలతో బెదిరించడం లేదా మీ బ్యాంక్ ఖాతాలు లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను స్తంభింపజేయడం లేదా బ్లాక్ చేయడం లేదా తక్షణమే డబ్బు బదిలీ చేయమని అడగడం పట్ల జాగ్రత్త వహించండని తెలిపారు.

Andhra Pradesh: రేషన్ కార్డులపై జగన్ ఫోటోలను, వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం, వాటి స్థానంలో పసుపు రంగులో కొత్త కార్డులు ఇచ్చే దిశగా అడుగులు..

Hazarath Reddy

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ రంగులతో రేషన్ కార్డులను నింపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కార్డులను తొలగించాలని నిర్ణయించింది.

Advertisement

New Liquor Policy in AP: ఏపీ మద్యం పాలసీ, ప్రభుత్వానికి ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం, కొన్ని జిల్లాల్లో దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త‌ మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ కొన‌సాగుతోంది. ద‌ర‌ఖాస్తుకు నేడే ఆఖ‌రి గ‌డువు. ఇక‌ గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ఎక్సైజ్ అధికారులు వెల్ల‌డించారు.

Jeshoreshwari Kali Temple: ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కాళీ మాత కిరీటం చోరీ, క్లీనింగ్ చేస్తున్న సమయంలో గుర్తించిన సిబ్బంది...

Arun Charagonda

బంగ్లాదేశ్‌లో సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో చోరి జరిగింది. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైంది. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం తప్పిపోయినట్లుగా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Vijayawada: ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం, చినరాజ గోపురం వద్ద బూట్లతో ఎస్సై అత్యుత్సాహం...భక్తుల ఆందోళన

Arun Charagonda

ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. చినరాజ గోపురం వద్ద బూట్లతో హల్‌చల్ చేశారు ఎస్సై రాజారెడ్డి. త‌న‌ వారికి అమ్మ‌వారి దర్శనం చేయించేందుకు ఆలయంలోకి వచ్చారు ఎస్సై. ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేద‌న చెందుతున్నారు భ‌క్తులు.

Ratan Tata: రతన్ టాటాకు అక్షరాలతో చిత్ర నివాళి, తెలుగు అక్షరాలతో రతన్ టాటాకు ఘన నివాళి..వీడియో ఇదిగో

Arun Charagonda

రతన్ టాటాకు నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ఆయనకు చిత్ర నివాళిని అర్పించారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం దేశానికే తీరని లోటని చింతలపల్లి కోటేష్ అన్నారు. కోటేష్ ఆయనను స్మరించుకుంటూ ఏ3 డ్రాయింగ్ షీట్ పై ఎటువంటి గీతలు లేకుండా ఆయన జీవిత చరిత్రను తెలుగు అక్షరాలతో రతన్ టాటా చిత్రాన్ని మైక్రో పెన్నుతో మూడు గంటల పాటు శ్రమించి చిత్ర నివాళి అర్పించారు. అలాగే ఈ చిత్రంలో ఆయన స్థాపించిన ఎన్నో పరిశ్రమలను చూపించారు.

Advertisement

Team India At Hyderabad: హైదరాబాద్‌ చేరుకున్న టీమిండియా, బంగ్లాతో మూడో టీ20కి ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం

Arun Charagonda

చివరి T20 కోసం టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అధికారులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటళ్లకు వెళ్లిపోయారు. బంగ్లా టీమ్‌కు తాజ్ కృష్ణ, టీమ్ ఇండియాకు పార్క్ హయత్‌లో బస ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఉప్పల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Telangana: మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం.. వారం రోజులుగా అదే నీటిని సరఫరా చేస్తున్న అధికారులు..వీడియో ఇదిగో

Arun Charagonda

నిర్మల్ - కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో కోతి కళేబరం దొరికింది. నీరు వాసన రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్లో చూడగా కోతి కళేబరాన్ని చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. వారం రోజులుగా అదే నీటిని అధికారులు సరఫరా చేయడంతో.. కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

Viral Video: బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి.. వరంగల్ లో ఘోరం (వీడియో)

Rudra

బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.

Vijayawada: విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ దారుణ హ‌త్య‌, విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌స్తుండ‌గా చంపేసిన దుండగుడు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ హ‌త్య‌ దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ స‌మీపంలో రైల్వే రోడ్‌నంబ‌ర్ 11లో ఇనుప‌క‌డ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన‌ హంత‌కుడు న‌డిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement