India

North Korea: ద‌క్షిణ కొరియా విష‌యంలో కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం, స‌రిహ‌ద్దును శాశ్వ‌తంగా మూసేస్తూ ప్ర‌క‌ట‌న‌

VNS

ఉత్తర కొరియా (North Korea) – దక్షిణ కొరియా (South Korea) దేశాల మధ్య దూరం మరింత పెరగనుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను వెలువరించింది.

CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ని కొరివి దెయ్యంతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని వ్యాఖ్యలు, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు.

HYDRA Demolition Row: అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాదిమంది ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చాయని, అవి అవాస్తవమని నిరూపిస్తే తాను సూసైడ్ చేసుకొని చనిపోవడానికి సిద్ధమని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు

Saddula Bathukamma Wishes: మీ బంధు మిత్రులకు అందమైన కొటేషన్స్ తో సిద్ధంగా ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

కోటి రత్నాల మన తెలంగాణా లో మొదటి రత్నం మన బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్బంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ షేర్ చేసి తెలియజేయండి..

Advertisement

AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ స‌మావేశం, ద‌స‌రా, దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు అందించే దిశగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం

VNS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశం(AP cabinet ) గురువారం అత్యవసరంగా సమావేశం అవుతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనకు(Janasena) చెందిన మంత్రులు హాజరుకానున్నారు.

Big Change In UPI: యూపీఐ లిమిట్ పెంపు, ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు

VNS

డిజిటల్‌ చెల్లింపులను పెంచడం, చిన్న లావాదేవీలపై యూపీఐ లైట్‌ని (UPI Lite) ఉపయోగించే వారికి సౌకర్యాలను విస్తరించడమే పరిమితి పెంచడానికి ప్రధాన లక్ష్యమన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ ప్రకారం.. వినియోగదారులకు కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని.. యూజర్లు స్వాగతించాలన్నారు.

Saddula Bathukamma 2024 Wishes In Telugu: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా..అయితే Whatsapp, Instagram, Facebook ద్వారా ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..

sajaya

తెలుగులో బతుకమ్మ అంటే - మాతృ దేవత అని అర్థం. బతుకమ్మను మహాగౌరి రూపంలో పూజిస్తారు. బతుకమ్మను అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే తయారుచేస్తారు. కుటుంబం ఆనందం, శ్రేయస్సు కోరిక కూడా దానిలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ పండుగను స్త్రీల గౌరవార్థం జరుపుకుంటారనే నమ్మకం ఉంది.

Saddula Bathukamma Wishes: సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

ఊరంతా పూల వైభవం.. ఆడపడుచుల ఆటపాటలతో ఊరంతా సంబురం.. ఎంగిలిపూవు నుంచి సద్దుల వరకు 9 రోజులు తీరొక్క పూలతో వేడుకలు.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

Advertisement

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు

Hazarath Reddy

రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.

Ratan Tata In Critical Condition: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం..ఐసీయూలో అందిస్తున్న చికిత్స...

sajaya

భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వేత్తలో ఒకరైన టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని, ముంబై ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని రాయిటర్స్ సంస్థ రిపోర్ట్ చేసింది. 86 ఏళ్ల రతన్ టాటా అక్టోబర్ 7 సోమవారం రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం.

Navratri Celebration: వీడియో ఇదిగో, రూ. 3.33 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారు, నవరాత్రి ఉత్సవాల్లో అరుదైన వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

స్థానికంగా "నిద్ర గన్నేరు చెట్టు" అని పిలవబడే 150 సంవత్సరాల పురాతన చెట్టు ఇది. 300కు పైగా దక్షిణ భారత మరియు బాలీవుడ్ చిత్రాలలో కనిపించినందుకు "సినిమా ట్రీ" గా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది వరదల కారణంగా నేలకూలిన తర్వాత పునరుద్ధరణ సంకేతాలను చూపుతోంది

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు, సాధారణ అనస్థీషియా లేకుండా ఆపరేషన్

Hazarath Reddy

రాజాంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు 65 ఏళ్ల వృద్ధురాలికి సాధారణ అనస్థీషియా లేకుండా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.

YS Jagan On Good Book: రెడ్ బుక్ కాదు గుడ్‌ బుక్ పెడదాం...ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలన్న జగన్, కష్టాల్లో నుండే నాయకులు పుడతారని ధైర్యం నింపిన జగన్

Arun Charagonda

రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు మనం గుడ్ బుక్ పెడదాం అని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జగన్. గ్రామ/ వార్డు స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు.

Adulterated Tea Racket Busted: హైదరాబాద్‌లో టీ తాగేవాళ్లు జాగ్రత్త, 300 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాదీ జాగ్రత్తగా ఉండండి, బహుశా మీరు టీ స్టాల్స్‌లో కల్తీ టీ తాగుతున్నారేమో. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం టీ కల్తీ రాకెట్‌ను ఛేదించింది.హైదరాబాద్‌లో 300 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుంది.

CM Revanth Reddy On SC Categorization: ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్‌ రిపోర్టు సమర్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మాదిగలను మోసం చేస్తున్న నయవంచకుడు సీఎం అని బీఆర్ఎస్ మండిపాటు

Arun Charagonda

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని...వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Uttar Pradesh: బీజేపీ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన న్యాయవాది, ఉత్తరప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా వీడియో

Arun Charagonda

లఖింపూర్లో బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మకు ఛేదు అనుభవం ఎదురైంది. లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. వర్మ మద్దతుదారులు న్యాయవాదిపై దాడికి దిగడంతో మరింతవాగ్వాదం చోటుచేసుకుంది. ఈప్రాంతంలో రాబోయే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఈఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Tension At Kodangal: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన...అడ్డుకున్న పోలీసులు, వీడియో

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మహిళపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం, 100కు కాల్ చేసిన మహిళతో పరిచయం పెంచుకుని అఘాయిత్యం

Hazarath Reddy

వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పక్కన గొడవ జరగగా 100కు కాల్ చేసింది.. దీంతో కానిస్టేబుల్ జగన్ ఇంటికొచ్చి మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.ఆ తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగివ్వలేదు. చివరకు ఇంజాపూర్ తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోగా తప్పించుకొని వచ్చానని ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది.

Andhra Pradesh Shocker: ఏలూరులో ఘోర విషాదం, పందెంకోడికి ఈత నేర్పిస్తూ చెరువులో పడి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement