India

Aarti Wins Bronze Medal: ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం

Vikas M

ఆర్తి దుబాయ్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10,000 M రేసు నడక ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ U20 క్వాలిఫికేషన్ సమయాన్ని 49 నిమిషాలకు మెరుగుపరచడానికి ఆమె 47:45.33ని పూర్తి చేసింది.

Hidden Cameras in College Girls' Washroom: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై జగన్ ఆగ్రహం, విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపాటు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.

Hidden Cameras in College Girls' Washroom: పవన్ కళ్యాణ్ ఎక్కడయ్యా, బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

'Hidden Cameras' in Girls' Washroom: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, మరింత ఉధృతంగా మారిన విద్యార్థుల ఆందోళన

Hazarath Reddy

Advertisement

Cyclone Asna Alert: ఏపీకి భారీ వర్షాలు అలర్ట్, బంగాళాఖాతంలో వచ్చే 36 గంటల్లో వాయుగుండం, అరేబియా సముద్రంలో తుఫానుగా బలపడనున్న లోతైన అల్పపీడనం, గుజరాత్‌కు తుఫాను హెచ్చరిక

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ (IMD) గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతానికి తుఫాను హెచ్చరికను జారీ చేసింది, ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న లోతైన అల్పపీడనం తుఫానుగా బలపడి శుక్రవారం తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది.

Assam: ముస్లిం మ్యారేజెస్‌ యాక్ట్‌ రద్దు, ఇకపై ముస్లిం వివాహాలకు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్‌ ముస్లిం మ్యారేజెస్‌ అండ్‌ డైవోర్సెస్‌ బిల్లు–2024ను తీసుకువచ్చిన అస్సాం ప్రభుత్వం

Hazarath Reddy

అస్సాం శాసనసభ గురువారం (ఆగస్టు 28) ముస్లిం వివాహాలు, విడాకుల బిల్లు, 2024, "బాల్య వివాహాలు", "పార్టీల సమ్మతి లేకుండా వివాహాలు" నిరోధించే పేర్కొన్న లక్ష్యాలతో ప్రతిపాదిత చట్టాన్ని ఆమోదించింది.

No Namaz Break for Muslim MLAs: ముస్లిం ఎమ్మెల్యేలకు ఆ రోజు నో నమాజ్, శుక్రవారం నమాజ్‌ విరామం రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం, సీఎం హిమంత బిస్వా శర్మ ఏమన్నారంటే..

Hazarath Reddy

ముస్లిం శాసనసభ్యులకు రెండు గంటల నమాజ్ విరామం ఇవ్వాలనే దశాబ్దాల నాటి నిబంధనలను రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభను కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈరోజు తీర్మానం చేసింది

Rampur Horror: యూపీలో దారుణం, మేక పిల్లపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడంతో యజమాని బయటకు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్‌లో తన పొరుగువారి పెంపుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని ఆగస్ట్ 30, శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మేక యజమాని విజయ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Congress Leader Pallam Raju: హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!

Arun Charagonda

హైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే .. రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుబడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.. హైడ్రా తీరును ఆక్షేపించారు.

Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక చక్రాలు కామేశ్వరి పై నుండి వెళ్లడంతో మృతి చెందింది.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో నాలుగో ప‌త‌కం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో రజత పతకం సాధించిన మనీష్ నర్వాల్

Hazarath Reddy

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత పారా షూటర్ మనీష్ నర్వాల్ 234.9 స్కోరుతో రజత పతకాన్ని సాధించాడు. 237.4 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్డు జో చేతిలో నర్వాల్ ఓడిపోయాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం.

YSRCP MPs Clarity on Party Change Rumors: వీడియో ఇదిగో, జగన్ వెంటే మేమంతా ఉంటామని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీలు, మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టేనని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారనే హాట్ టాఫిక్ రూమర్స్ పై వైసీపీ ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు.

Advertisement

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం, కాంస్యంతో చ‌రిత్ర తిర‌గ‌రాసిన అథ్లెట్ ప్రీతి పాల్, ట్రాక్ విభాగంలో దేశానికి ఇదే తొలి ప‌త‌కం

Hazarath Reddy

ట్రాక్ విభాగంలో దేశానికి తొలి ప‌త‌కం సాధించి పెట్టింది. శుక్ర‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల 100 మీట‌ర్ల టీ35 ఫైన‌ల్లో ప్రీతి కాంస్యం ప‌త‌కం కొల్ల‌గొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం చేరింది. 100 మీట‌ర్ల ఫైన‌ల్లో ప్రీతి చిరుత‌లా ప‌రుగెత్తింది. 14.21 సెక‌న్ల‌లో ల‌క్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది.

MLA Rajagopal Reddy On Uttam Kumar Reddy: వీడియో ఇదిగో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావడం పక్కా, నా నాలుక మీద మచ్చలున్నాయి..జరిగి తీరుతుందన్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్‌లో దుమారం రేపిన మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్

Arun Charagonda

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌నిస‌రిగా సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు. నా నాలుక‌పై పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయి.. త‌ప్ప‌నిస‌రిగా మంత్రి ఉత్త‌మ్ సీఎం అవుతారని చెప్పారు. భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలో నీటి పారుద‌ల పనుల‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌లో దుమారం రేపాయి.

Champai Soren Joins BJP: మలుపులు తిరుగుతున్న జార్ఖండ్‌ రాజకీయాలు, బీజేపీ గూటికి చేరిన మాజీ సీఎం చంపై సోరెన్‌, గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం

Hazarath Reddy

జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం (JMM) మాజీ నేత చంపై సోరెన్‌ (Champai Soren) భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) సమక్షంలో కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Gurukul School Staff Harass Students: విద్యార్థినులకు పురుగుల అన్నం, టీచర్లకు పరమాన్నం..ఇది గురుకులాల పరిస్థితి, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, తట్టుకోలేక రోడ్డెక్కిన విద్యార్థినులు!

Arun Charagonda

తెలంగాణలో పాలన పడకేసిందా?, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారేలేరా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది.

Advertisement

Shivaji Maharaj Statue Collapse: నన్ను అందరూ క్షమించండి, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వర్షాలకు కూలిన సంగతి విదితమే. ప్రతిపక్షాలు ఈ ఘటనపై బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ఈ నిరసనలపై, అలాగే విగ్రహం కూలడవపై ప్రధాని మోదీ స్పందించారు.

PM Modi Apologises Video: నన్ను క్షమించండి, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శిరస్సు వంచి క్షమాపణలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వర్షాలకు కూలిన సంగతి విదితమే. ప్రతిపక్షాలు ఈ ఘటనపై బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ఈ నిరసనలపై, అలాగే విగ్రహం కూలడవపై ప్రధాని మోదీ స్పందించారు. మరాఠా యోధుడు శివాజీ కేవలం రాజు మాత్రమే కాదని, తాను ఆరాధించే దేవుడంటూ కూలడంపై.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు.

CM Revanth Reddy On Yadadri: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, పెండింగ్ పనుల వివరాలను సమర్పించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీల్లేదని..ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది, అవనీ లేఖా, మోనా అగర్వాల్‌లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రదాని మోదీ

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లలో పతకాలు సాధించిన పారా అథ్లెట్లు అవనీ లేఖా, మోనా అగర్వాల్ లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ తన శుభాకాంక్షలు తెలియజేసేందుకు X, (ట్విట్టర్‌) లోకి వెళ్లారు.

Advertisement
Advertisement