India

Telangana: సీఐ పుట్టినరోజు వేడుకలు, భవనం మూడో అంతస్తు పై నుంచి పడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, కూకట్‌పల్లిలో విషాదకర ఘటన

Hazarath Reddy

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలోని దేవినగర్‌లో చోటుచేసుకుంది.రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న శేఖర్‌ పుట్టినరోజు వేడుకకు హెడ్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు.

Telangana Runamafi: మీకు రుణమాఫీ కాలేదా, అయితే మీకోసమే బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్, రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు నిద్రపోనివ్వంటున్న గులాబీ నేతలు

Arun Charagonda

తెలంగాణ రాష్ట్రం లో రైతులు గౌరవంగా బతకగలమని గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి....కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారు...వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు అన్నారు.

Anand Mahindra: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు.

KTR On MLAs Disqualification: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు, త్వరలో ఉప ఎన్నిక ఖాయమన్న కేటీఆర్

Arun Charagonda

పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు అని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందంతో కలిసి రాజ్యంగ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తేల్చి చెప్పారు.

Advertisement

Health Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగడం లేదా..ఈ ఐదు ఆరు పదార్థాలు తీసుకోండి మీరు బరువు పెరుగుతారు.

sajaya

చాలామంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు. వారు తగ్గాలనుకుంటారు. అలా కాకుండా కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉంటారు. వీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు పెరగాలని కోరుకుంటారు.అయితే ఎంత తిన్న కూడా వారు బరువు పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.

Nagarjuna Sagar Project: కృష్ణమ్మ పరవళ్లు, నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్, పర్యాటకుల సందడి

Arun Charagonda

శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఇన్‌ ఫ్లో అధికంగా ఉండటంతో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..ఈ సూపర్ ఫుడ్స్ తో మీ సమస్యకు పరిష్కారం

sajaya

రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మీకు హిమోగ్లోబిన్ పెరిగి రకరకాల జబ్బుల నుండి బయటపడతారు. మన శరీరానికి రక్తం చాలా అవసరం రక్తం తక్కువగా ఉంటే మన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందదు.

Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ మళ్లీ వైరల్, ఇండిగో ఎయిర్‌లైన్స్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో పాటకు స్టెప్పులేసిన ఎయిర్ హోస్టెస్, పైలెట్స్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇండిగో ఎయిర్‌లైన్స్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ‘నాటు నాటు’ పాటకు ఎయిర్ హోస్టెస్, పైలెట్స్ అదిరిపోయే స్పెప్పులేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ ‌గా మారింది.

Advertisement

Health Tips: ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

మన శరీర ఎదుగుదలకు మన శరీరంలోని అన్ని అవయవ్యాలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుంది

Telangana: వీడియో ఇదిగో, రైలు వస్తున్నా గుర్తించలేక పట్టాలపై నడిచిన మతిస్థిమితం లేని మహిళ, రిస్క్ చేసి ప్రాణాలు కాపాడిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు

Hazarath Reddy

రైలు వస్తున్నా దాన్ని గుర్తించేలేక పట్టాలపై నడుస్తున్న మతిస్థిమితం లేని మహిళను ఆర్కే ఫౌండేషన్ సభ్యులు కాపాడారు. ఖమ్మం జిల్లా మధిరలోని మోటమర్రి రైల్వే స్టేషన్ దగ్గర ఓ మతిస్థిమితం లేని మహిళ రైలు వస్తుంటే అదే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లింది. గమనించిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు.

Third Degree On Dalit Woman: రంగారెడ్డి జిల్లా పోలీసుల అమానుషం, దళిత మహిళపై థర్డ్ డిగ్రీ,దొంగతనం ఒప్పుకోవాలని చిత్రహింసలు, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బాధిత పోలీస్ పై చర్యలు

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఓ పోలీస్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఓ దొంగతనం కేసులో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. ఏకంగా మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. దీంతో నడవలేక ఆ మహిళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు

Sudden Death in Rajasthan: హార్ట్ ఎటాక్ వీడియో ఇదిగో, అన్న పదవీ విరమణ పార్టీలో డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన తమ్ముడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

రాజస్థాన్‌లోని భైంస్లానా గ్రామంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, మన్నా లాల్ జాఖర్ అనే ఉపాధ్యాయుడు కుటుంబ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన వీడియోలో బంధించబడింది. అతని అన్నయ్య పదవీ విరమణలో 'సత్సంగం' సందర్భంగా జరిగింది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి వైసీపీ నేతపై కర్రలతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఎన్డీఆర్‌ జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ నాయకుడితో సహా మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని జగయ్యపేట ఆసుపత్రికి తరలించారు.బుల్లబ్బాయ్) సహా మరో ఐదుగురు దాడికి పాల్పడ్డారు

Andhra Pradesh: ఈ రోజు జరిగే కాన్ఫరెన్స్ చరిత్ర తిరగరాయబోతోంది, జిల్లా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం (Collectors Meeting) అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం.

Telangana Police: శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో

Arun Charagonda

ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడ మీద నుండి పడి స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని స్థానికులు వదిలేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను అభినందించారు జిల్లా ఎస్పీ.

Maharashtra: వీడియో ఇదిగో.. మహారాష్ట్రలో దారుణం, మ్యాన్‌హోల్‌లో పడి నాలుగేళ్ళ బాలుడి మృతి, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

మహారాష్ట్రలో దారుణం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలో సంవత్సరాల బాలుడు ప్రమాద వశాత్తూ మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు కాగా స్థానికంగా విషాదాన్ని నింపింది.

Advertisement

Karnataka Horror: రామకృష్ణ ఆశ్రమంలో మూడవ తరగతి విద్యార్థిపై దారుణం, పెన్ను దొంగిలించాడంటూ బ్యాట్‌తో కళ్లు వాచిపోయేలా కొట్టిన నిర్వాహకులు

Hazarath Reddy

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్ను దొంగిలించాడని ఆరోపిస్తూ మూడో తరగతి విద్యార్థిపై ఆశ్రమం నిర్వాహకులు అమానుషంగా ప్రవర్తించారు. కనికరం లేకుండా కర్రతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, మూడు రోజులపాటు గదిలో బంధించారు.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, గంటకు 100 కి.మీ వేగంతో మైనర్ కారు డ్రైవింగ్, తల్లికూతుళ్లను ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడి మృతి

Hazarath Reddy

కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మైనర్ నడుపుతున్న కారు అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొనడంతో తల్లి చనిపోగా, ఆమె 12 ఏళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది. మహిళ తన కుమార్తెతో కలిసి క్లినిక్ నుండి తిరిగి వస్తుండగా, కారు, గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, వారిని ఢీకొట్టింది, బాధితులిద్దరినీ సుమారు 30 అడుగుల ఎత్తులో పడేసింది.

Bengaluru Horror: దారుణం, మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై అత్యాచారయత్నం, బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్

Hazarath Reddy

ఉదయం 5 గంటల సమయంలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. వీడియోలో బంధించబడిన ఈ సంఘటన ఇంటి వెలుపల నిలబడి ఉన్న మహిళను చూపిస్తుంది, ఒక వ్యక్తి తన వెనుక నుండి ఆమె వద్దకు వచ్చాడు.

Delhi: ఢిల్లీలో వ్యభిచార గృహాలపై దాడులు, పోలీసుల రైడ్‌లో గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారిణి, ఇద్దరు మైనర్ బాలికలు, నిందితులపై పోక్సో యాక్ట్

Arun Charagonda

ఢిల్లీలో ఘరానా వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఢిల్లీ పోలీసులు కమ్లా మార్కెట్‌లోని జీబీ రోడ్డు ప్రాంతంలోని ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించగా ఇందులో ఓ కబడ్డీ క్రీడాకారిణి, గోల్డ్ మెడల్ విజేత సహా ఇద్దరు మైనర్ బాలికలను ఆదివారం రక్షించారు. మైనర్ బాలికల వయస్సు 17 సంవత్సరాలు కాగా వీరిని నెలల తరబడిగా బంధించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

Advertisement
Advertisement