జాతీయం

Telugu States Rain Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రాబోయే 3 రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు

Hazarath Reddy

గత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది

Andhra Pradesh: నార్కో టెర్రరిస్ట్ పాబ్లో ఎస్కోబార్ తో జగన్‌ను పోల్చిన చంద్రబాబు, టాటా, రిలయన్స్, అదానిల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనే జగన్ ఆరాటం అంటూ విమర్శలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో జగన్ ను పోల్చారు.

NEET-UG 2024 Revised Results Out: నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదల, మీ రిజల్ట్స్‌ను exams.nta.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

నీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది

Telangana Budget 2024: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే..!

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.2024-25 గాను తెలంగాణ బడ్జెట్‌ రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది

Advertisement

YS Jagan Slams Chandrababu Govt: నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు, ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కావాలంటే నన్ను టార్గెట్‌ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి.

Maharashtra Rain News: భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం,నలుగురు మృతి, లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సైతం జలమయం,స్కూళ్లు,కాలేజీలకు సెలవులు

Arun Charagonda

భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో ముంబై,తానే నీట మునిగాయి. రోడ్లపై మోకాలు ఎత్తులో నీరు ప్రవహిస్తుండగా ముంబై, తానే లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహారాష్ట్రలో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. వరదల వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు.

Andhra Pradesh Horror: తిరుపతిలో దారుణం, భార్య వదిలి వెళ్ళిందని అన్న కుటుంబాన్ని కత్తితో నరికి చంపిన తమ్ముడు, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య

Hazarath Reddy

తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్న మీద కోపంతో ఓ తమ్ము డు కిరాతకుడుగా మారి వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కత్తితో నరికిహత్య చేశాడు. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డాడు.పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది

Chandrababu: ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు,80 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు, నిల్చోబెట్టి మరీ..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వులు పూయించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని చంద్రబాబు చెప్పగా అసెంబ్లీలో దాదాపు 80% ఎమ్మెల్యేలు నిల్చున్నారు. దీంతో స్పీకర్‌తో సహా అంతా నవ్వుకున్నారు.

Advertisement

Telangana Shocker: దారుణం, వసతి గృహంలో 8 ఏళ్ళ అంధ బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వెళితే..

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. మలక్ పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో చదువుతున్న వికారాబాద్ కు చెందిన 8 ఏళ్ల బాలికపై అదే వసతి గృహంలో పని చేసే నరేష్(24) అనే యువకుడు అత్యాచారం చేశాడు.

President Droupadi Murmu: టీచర్‌గా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీలో విద్యార్థులకు పాఠాలు, వీడియో వైరల్

Arun Charagonda

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓ క్లాస్ రూంకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు.

Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, సీబీఐ కేసులో రెండు వారాల పాటు కస్టడీ పొడగింపు, మరిన్ని రోజులు జైల్లోనే ఢిల్లీ సీఎం

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ దక్కడం లేదు. ఇవాళ్టితో కేజ్రీవాల్‌ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Telangana Police:హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసుల ఓవరాక్షన్‌, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తిని తన్నుతూ తీసుకెళ్లిన సీఐ, వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం పట్టుకున్నారు

Advertisement

KCR on Telangana Budget:బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్‌?,ఇది అర్బక ప్రభుత్వం,ఏ విధానం లేదని మండిపాటు

Arun Charagonda

తెలంగాణ బడ్జెట్ ఒట్టి డొల్లా? తప్ప ఇందులో కొత్తదనం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్. బడ్జెట్‌లో ఒక పద్దు, పద్దతి లేదని విమర్శించారు. ఒక కథలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు తప్ప ప్రజలకు దీంతో ఒరిగేదేమి ఉండదన్నారు.

Dog Attack in Telangana: ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్క దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన చిన్నారి

Hazarath Reddy

తాజాగా వరంగల్ జిల్లాలో పర్వతగిరికి చెందిన మనోజ్ కుమారుడు విహాన్ ఉదయాన్నే ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడికి చికిత్స చేయించారు.

Telangana Rains: వీడియో ఇదిగో, స్కూల్‌ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్, గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు

Hazarath Reddy

మంచిర్యాల జిల్లాలోని కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్‌ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది,

Telangana Shocker: ఉద్యోగ ప్రకటనలతో మోసపోయారా?,సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండిలా?, మీ డబ్బు వాపస్ గ్యారంటీ

Arun Charagonda

దేశంలో సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు తెలంగాణ పోలీసులు.

Advertisement

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, అతివేగంతో దూసుకువచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఇన్నోవా వాహనం, ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని చంపాపేట ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంబానికి ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సూఫీయాన్. మహమూద్ అద్నాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యాసిన్, మహావేర్, మవ్యలు తీవ్ర గాయపడ్డారు.

Tamil Nadu Shocker: ట్యూషన్ టీచర్ ఆపనికి ఒప్పుకోలేదని మైనర్ బాలుడు దారుణం, తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ఇంతకీ ఏం చేసాడంటే..

Hazarath Reddy

తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డ ఓ 17 ఏళ్ల బాలుడు ఆమె తనను దూరం పెట్టిందని వేధింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.

Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట

Arun Charagonda

నా తెలంగాణ కోటీ రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 సందర్భంగా మాట్లాడిన భట్టి, తెలంగాణ వస్తేనే బ్రతకులు బాగుపడతాయని ప్రజలు ఆందోళన చేశారన్నారు.

Andhra Pradesh Horror: ఏపీలో మరో దారుణం, రెండో పెళ్ళి చేసుకుందని మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో, కోడి గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను దారుణంగా హింసించారు.

Advertisement
Advertisement