సమాచారం

TTD plans Temple In Jammu: జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు, ముంబై, వారణాసిలో కొలువుతీరనున్న తిరుమల శ్రీనివాసుడు, కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పాలక మండలి, స్థల కేటాయింపుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్న టీటీడీ ట్రస్ట్ బోర్డ్

Hazarath Reddy

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD trust board) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని(Lord Venkateswara Temple) జమ్ముకశ్మీర్‌లో(Jammu) నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.

Vishwesha Teertha Swami Passes Away: పెజావర మఠాధిపతి విశ్వేశ్వరతీర్థ ఇక లేరు, విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఓం శాంతి అంటూ ట్వీట్ చేసిన ప్రధాని, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప

Hazarath Reddy

పెజావర మఠం అధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామిజీ(88) (Vishwesha Teertha Passes Away) కన్నుమూశారు. ఉడిపి (Udupi)శ్రీకృష్ణ మఠ్‌లో. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరతీర్థ డిసెంబర్‌ 20వ తేదీ నుంచి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి పూర్తిగా విషమించి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతో మఠంలోనే తుది శ్వాస విడవాలన్న ఆయన చివరి కోరిక ప్రకారం లైఫ్‌ సపోర్ట్‌తో స్వామిజీని ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు తరలించారు. మఠంలోనే ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.

Free WiFi Services: దేశమంతా ఉచిత వైఫై, భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోకి అన్ని గ్రామాలు, వచ్చే మార్చిలోపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఉచిత వైఫై అందించే దిశగా అడుగులు, వెల్లడించిన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్

Hazarath Reddy

భారత్‌నెట్‌ (Bharatnet) ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా (Free WiFi Services)అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ (IT Minister Ravi Shankar Prasad) హర్యానాలోని (Haryana) రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

MIG-27: పాక్‌ను హడలెత్తించిన యుద్ధ విమానాలకు ఘనమైన వీడ్కోలు, కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మిగ్-27, మూడు దశాబ్దాల పాటు సేవలు, వాటికి ఆర్మీ పెట్టిన ముద్దు పేర్లు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

భారత వాయుసేనలో అతి శక్తిమంతమైన మిగ్‌-27 యుద్ధవిమానం (MIG-27) చరిత్ర పుటలకెక్కింది. మూడు దశాబ్దాలకు పైగా చెరగని సేవలందించిన ఈ లోహ విహంగాలకు ఐఏఎఫ్‌(IAF) ఘన వీడ్కోలు పలికింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ (JODHPUR)వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్‌ -27 విమానాలు చివరిసారి గగనవిహారం చేశాయి. చివరిసారిగా నింగికెగిరిన ఈ విమానాలకు ల్యాండింగ్‌ అయిన తర్వాత జల ఫిరంగుల ద్వారా గౌరవ వందనం సమర్పించారు.

Advertisement

CH59 Asteroid: ఎఫ్‌-16 యుద్ధ విమానాలను మించిన వేగంతో దూసుకువస్తున్న గ్రహశకలం, భూమికి దగ్గరగా వస్తున్న సీహెచ్59 ఆస్టరాయిడ్, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ గ్ర‌హ‌శ‌క‌లంతో భూమికి ప్రమాదం లేదన్న నాసా

Hazarath Reddy

భారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి(Earth) అత్యంత స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. నేడు ఆ గ్ర‌హ‌శ‌క‌లం (asteroid)భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా(2000 CH59)) గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారుగా 2034 అడుగుల వెడ‌ల్పు(2,034-foot asteroid) ఉన్న‌ది.

Ayodhya: అయోధ్యలో బాంబు దాడులకు స్కెచ్, నిఘా వర్గాలు సమాచారంతో అలర్టయిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు, హిందూ-ముస్లింల మధ్య అల్లర్లను రేపేందుకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొత్త స్కెచ్

Hazarath Reddy

అయోధ్య తీర్పు తర్వాత రామాలయ నిర్మాణం పనులు అక్కడ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా అయోధ్యలో ఆకాశమంత రామాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా కలవరపెడుతోంది.

Atal Bihari Vajpayee 95th Birth Anniversary: మూడు సార్లు ప్రధాని, పోఖ్రాన్,కార్గిల్ వార్ విజయ సారధి జయంతి నేడు, అటల్‌ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి, రాజకీయ ప్రముఖులు, లక్నోలో అటల్ జీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

Hazarath Reddy

భారత మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజపేయి 95వ జయంతి(Atal Bihari Vajpayee 95th Birth Anniversary) సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,(Ram Nath Kovind) ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

Anand Mahindra Funny Story: బిల్‌గేట్స్ నా క్లాస్‌మేట్ అన్నందుకు నా పిల్లలు నన్ను లూజర్ అంటున్నారు, అందుకే ఆయనంటే నాకు పగ అంటున్న ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి క్లాస్ మేట్స్ ఫన్నీ కథ

Hazarath Reddy

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఎవరూ ఉండురు. అలాగే మహీంద్ర అండ్ మహీంద్రా ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. వీరిద్దరూ క్లాస్ మేట్స్ కూడా. 1973లో హర్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకంటారా...బిల్ గేట్స్(Bill Gates) నా క్లాస్ మేట్ అన్నందుకు ఆనంద్ మహీంద్రా పిల్లలు ఆయన లూజర్ అన్నారట.. దీంతో బిల్ గేట్స్ మీద ఆయన చాలా కోపం పెంచుకున్నారట..అయితే ఇది కోపంతో కాదు లేండి. సరదాగా జరిగిన సన్నివేశం.

Advertisement

Railway Fare Hike: ప్రయాణికులకు రైల్వే షాక్, పెరగనున్న రైల్వే ఛార్జీల ధరలు, కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంచే అవకాశం, చార్జీల పెంపు ప్రతిపాదనకు నవంబర్‌లోనే ఆమోద ముద్ర వేసిన ప్రధాని కార్యాలయం

Hazarath Reddy

ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా రైలు చార్జీలను (Railway Fare Hike) భారీగా పెంచేందుకు భారతీయ రైల్వేలు రంగం సిద్ధం చేస్తున్నాయి. కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.అన్ని రైళ్లకు తరగతుల వారీగా ప్రయాణీకుల చార్జీలను ఈ వారంలోనే పెంచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.

Mental Disorder: తీవ్ర రూపం దాల్చిన డిప్రెషన్, ఇండియాలో ప్రతి ఏడు మందిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారన్న సర్వే, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ స్టడీలో నిగ్గు తేలిన నిజాలు

Hazarath Reddy

దేశంలో మానసిక వ్యాధులతో(mental health issues) బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. డిప్రెషన్‌తో(mental disorder) సతమతమవుతున్నవారు ఇండియాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నివేదిక చెబుతోంది. 2017లో ప్రతి ఏడు మంది భారతీయుల్లో ఒకరు మానసిక రోగంతో ఇబ్బందిపడినట్లు ఓ సర్వే పేర్కొన్నది.

Jio ‘2020’ Offer: జియో నుంచి బంపరాఫర్, రూ.2020తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది‌ పాటు అన్ లిమిటెడ్, డిసెంబర్ 24 నుంచి ప్లాన్ అమల్లోకి, స్మార్ట్‌ఫోన్, జియోఫోన్ యూజర్లంతా అర్హులే

Hazarath Reddy

టెలికాం రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio)తాజాగా మరో బంపరాఫర్ ప్రకటించింది. కస్టమర్ల కోసం జియో 2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ను(2020 Happy New Year Offer) అందుబాటులోకి తీసుకువచ్చింది.

Delhi Fire At Narela industrial Area: ఢిల్లీని వెంటాడుతున్న అగ్ని ప్రమాదాలు, షూ ఫ్యాక్టరీలో మరో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు, అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రమాదాలు ఢిల్లీ ప్రజలకు ఉక్కిరిబిక్కిర చేశాయి. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నెల వ్యవధిలో అక్కడ మూడో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో (Delhi's Narela industrial area) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

Advertisement

Rachakonda Police: రాచకొండ పోలీసుల ట్విస్ట్, పార్టీల్లో సింగిల్స్‌కు అనుమతి లేదు, జంటలకు మాత్రమే ప్రవేశం, తాగి పట్టుబడితే మీ జేబులు గుల్లే, మీ వాహనం పోయినట్లే, న్యూఇయర్ నిబంధనలను కఠినతరం చేసిన రాచకొండ పోలీసులు

Hazarath Reddy

కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు (Rachaconda and Cyberabad police) జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా దిశ ఘటన (Disha Murder case)తీవ్ర ఆందోళనలు రేకెత్తించిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ ఘటన మద్యం మత్తులో జరగడం న్యూ ఇయర్ పార్టీలో (New Year’s Eve celebrations)మద్యం అంశం ప్రధానంగా ఉండటంతో పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Saryu Rai: సీఎంకు షాకిచ్చిన ఇండిపెండెంట్, ఎవరీ సరయూ రాయ్ ?, సీఎం రఘుబర్ దాస్ పైనే ఆయన ఎందుకు పోటీ చేశారు, బీజేపీ ఆయన్ని ఎందుకు వదులుకుంది?, సరయూ రాయ్‌పై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో (Jharkhand Election Results)బీజేపీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఇంకా తేరుకోని షాక్ ఏంటంటే ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్ (Raghubar Das ) స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన.. అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రఘుంబర్ దాస్ ఓ స్వతంత్ర అభ్యర్థి చేతిలో సీఎం సైతం ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

JMM Leader Hemant soren: జార్ఖండ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది, ఈ విజయం ప్రజలకు అంకితమన్న హేమంత్ సోరెన్, సైకిల్ తొక్కుతూ హుషారుగా.., సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత

Hazarath Reddy

ఎన్నికల తరువాత జార్ఖండ్ తరువాతి ముఖ్యమంత్రిగా రేసులో ఉన్న హేమంత్ సోరెన్ (Hemanth soren) ఫలితాలపై జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) (Jharkhand Mukti Morcha (JMM))దాని మిత్ర పక్షాలు భారీ విజయం వైపుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు (Jharkhand Assembly Elections Results 2019)చూసిన తరువాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Airtel Wi-Fi Calling: అదనపు ఛార్జీలు అవసరం లేదు, ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్ సర్వీస్, తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్, సపోర్ట్ చేసే ఫోన్ల లిస్ట్ ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరో సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యం వైఫై కాలింగ్ సర్వీసును (Airtel Wi-Fi Calling) యూజర్ల కోసం తీసుకువచ్చింది. దీని ద్వారా మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ (Voice Calling)అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్‌లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంది.

Advertisement

Hyderabad Police: తాగి పట్టుబడితే రూ.10 వేల జరిమానా, వాహనం సీజ్, న్యూ ఇయర్ పేరుతో రచ్చ చేస్తే కుదరదు, డిసెంబర్ 31 రాత్రి స్పెషల్ డ్రంకన్ డ్రైవ్‌‌లు నిర్వహించనున్న హైదరాబాద్ పోలీసులు, డీజేలకు అనుమతి లేదు

Hazarath Reddy

న్యూఇయర్ వేడుకలు (New Year Celebrations) జరుపుకోవాలనుకునే వారికి ఇది నిజంగా షాక్ లాంటి వార్తే. హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) న్యూ ఇయర్ వేడుకల మీద పలు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగనుండటంతో వీటిని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం తెలంగాణా పోలీస్ శాఖ కొత్త విజన్‌ 2020 లక్ష్యాలను తీసుకువచ్చారు. 2020 వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Metropolitan Police)పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు.

Tamil Nadu: చిట్టి జంతువులపై స్మగ్లర్ల కన్ను, స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన ప్రయాణికుడు, బ్యాంకాక్ నుంచి చెన్నైకు స్మగ్లింగ్, ముద్దొచ్చే ఆ చిట్టి జంతువులను తిరిగి బ్యాంకాక్‌కు పంపించిన ఇంటలిజెంట్ ఆఫీసర్లు

Hazarath Reddy

చూడగానే ముద్దొచ్చేలా ఉన్న చిన్న జంతువులను స్మగ్లింగ్ చేస్తూ తమిళనాడులో (Tamil Nadu) ఓ స్మగ్లర్ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు ఈ అరుదైన జంతువులను బ్యాగులో పెట్టుకుని చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai airport) కనిపించాడు. అతను ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు.

Delhi Fire: దేశ రాజధానిలో మరో ఘోర అగ్ని ప్రమాదం, 9 మంది సజీవ దహనం, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు, ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో విషాద ఘటన

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్‌లో (cloth godown in Delhi's Kirari area) జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి (Sanjay Gandhi Memorial Hospital ) తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది (Delhi Fire Department)ఘటన స్థలానికి చేరుకున్నారు.

Jharkhand Assembly Election Results 2019: ప్రారంభమైన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌, హంగ్ అసెంబ్లీ వస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైనే అందరి కన్ను, మధ్యాహానికి తొలి ఫలితం వెలువడే అవకాశం

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Jharkhand Assembly Election Results) ప్రారంభమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ( Jharkhand) 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్‌(JMM-Congress) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.

Advertisement
Advertisement