News
NBK111: బాలకృష్ణ 111వ సినిమాలో హీరోయిన్గా నయనతార, అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, నవంబర్‌లో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించే అవకాశం
Data Privacy Rules: మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్, అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలు గురించి తెలుసుకోండి, డేటా డిలీట్ చేసే ముందు యూజర్‌కు 48 గంటల నోటీసు
Team Latestlyడిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలి సమగ్ర డిజిటల్ గోప్యతా చట్టంగా పేరుగాంచిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్’ కింద కేంద్ర ప్రభుత్వము కొత్త నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసింది
Sex Assault Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ కోసం వెళ్ళిన మహిళకు లైంగిక వేధింపులు, అక్కడ టచ్ చేస్తూ దారుణం..
Team Latestlyబెంగళూరు శివార్లలోని అనేకల్ నుండి లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ప్లాస్మా మెడినోస్టిక్స్‌లో స్కాన్ చేస్తున్నప్పుడు రేడియాలజిస్ట్ తన ప్రైవేట్ భాగాలను తాకాడని 34 ఏళ్ల మహిళ ఆరోపించిన తర్వాత ఈ షాకింగ్ లైంగిక వేధింపుల కేసు బయటపడింది.
Jubilee Hills Bypoll Result: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం, మాగంటి సునీతపై భారీ మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్, బీజేపీకి డిపాజిట్ గల్లంతు
Team Latestlyతెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Telangana Weather: తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి
Team Latestlyరాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అడవులు, కొండలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండప్రాంతాలు మంచు ముసురుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.
AI Love Story in Japan: టెక్నాలజీ హద్దులు దాటింది, తన సొంత AI భాగస్వామిని వివాహం చేసుకున్న జపాన్ మహిళ, కృత్రిమ మేధస్సుతో పెళ్లి వీడియో వైరల్
Team Latestlyకృత్రిమ మేధస్సు (AI) ప్రభావం వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో, జపాన్‌కు చెందిన ఒక మహిళ తన AI వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. 32 ఏళ్ల కానో అనే ఈ మహిళ తనకు ఎంతో సన్నిహితంగా మారిన ChatGPT ఆధారిత చాట్‌బాట్ వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రత్యేక వివాహ వేడుక జపాన్‌లోని ఒకాయమా నగరంలో ఈ వేసవిలో ఘనంగా జరిగింది.
Murder Attempt Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, హత్యాయత్నం కెమెరాలో రికార్డు, వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దంపతులు, కుమారుడికి గాయాలు
Team Latestlyబెంగళూరులోని న్యూ బీఈఎల్ రోడ్డుపై చోటుచేసుకున్న భయానక ఘటన నగరాన్ని కుదిపేసింది. వేగంగా వస్తున్న కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన ఘటనలో ఒక జంటవారి చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
SC on Delhi Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు ఆందోళన, మాస్కులు కూడా సరిపోవని వెల్లడి, ప్రజలు పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన
Team Latestlyదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతోంది. గాలి నాణ్యత సూచిక (Air Quality Index - AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలో AQI 400కు పైగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
AP Weather Forecast: బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం, ఏపీకి మరోసారి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక
Team Latestlyఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వాతావరణం మరింత చల్లగా మారింది. ఈ పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది.
Gujarat Blast: గుజరాత్లో భారీ పేలుడు, భరూచ్ జిల్లాలో ఔషధ కర్మాగారంలో బాయిలర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి, మరో 20 20 మందికి గాయాలు
Team Latestlyగుజరాత్లో భారీ పేలుడు సంభవించింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో బాయిలర్ పేలుడు, ఆ తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారని వార్తా సంస్థ PTI తెలిపింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని ఒక ఔషధ కర్మాగారంలో ఈ సంఘటన జరిగింది. సయ్ఖా GIDC ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు.
Tamil Nadu: వీడియో ఇదిగో, కారు రన్నింగ్‌లో ఉండగా సైడ్ మిర్రర్ నుంచి పాము బయటకు, ఒక్కసారిగా షాక్ అయిన కారు డ్రైవర్
Team Latestlyతమిళనాడులో కారు రన్నింగ్‌లో ఉండగా.. సైడ్ మిర్రర్ నుంచి పాము (Snake) బయటకు వచ్చింది. ఇది గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుస్తూ కొంత దూరం వెళ్లాక కారు సైడ్ మిర్రర్ (car side mirror)లోపల నుంచి చిన్న పాము బయటకు వచ్చింది.
Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు, వెలుగులోకి మరో సంచలన వీడియో, వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు
Team Latestlyదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన పేలుడు ఘటన (Delhi Blast) కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరో సీసీటీవీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
H1B Visa Policy 2025: అమెరికాకు టాలెంట్ ఉన్న విదేశీ ప్రతిభ అవసరం, మా దేశంలో అంత టాలెంట్ లేదు, హెచ్-1బీ వీసాలపై మళ్లీ యూటర్న్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Team Latestlyమన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారని విలేకరి ప్రశ్నించగా, ఆయన తక్షణమే లేదు, మన దగ్గర అంత ప్రతిభ లేదని స్పష్టంగా చెప్పారు. అమెరికా లోపల లభించే మానవ వనరులు పలు రంగాలలో సరిపడవని ఆయన అభిప్రాయపడ్డారు.
India's Disaster Statistics: భారత్‌ను అల్లకల్లోలం చేస్తున్న ప్రకృతి విపత్తులు, మూడు దశాబ్దాల్లో 430 ప్రకృతి విపత్తులు, 80 వేల మంది మృతి, 130 కోట్ల మందికి పైగా ప్రజలపై ఎఫెక్ట్
Team Latestlyప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానులు, కరువులు, హీట్‌వేవ్స్ వంటి విపత్తులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన దెబ్బ కొడుతున్నాయి.
Sangareddy Shocker: సంగారెడ్డిలో దారుణం, భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త, వివాహేతర సంబంధం అనుమానమే పెనుభూతంగా మారింది
Team Latestlyఅనుమానం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైంది. వివాహ బంధం నమ్మకంపై నిలబడే కాపురంలో, అనుమానం చిచ్చు పెట్టింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన జీవిత భాగస్వామినే కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్ఆర్ నగర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Telangana Weather Update: గజగజ వణుకుతున్న హైదరాబాద్, తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత, వచ్చే మూడు రోజుల పాటు మరింతగా తగ్గనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Team Latestlyతెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చలి తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా డిసెంబర్ మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుండగా, ఈసారి నవంబర్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం ప్రజలను వణికిస్తోంది.
Hyderabad Stabbing Incident: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య , 10 నిమిషాలు వెంటాడి దాడి చేసిన ప్రత్యర్థి, శాంతిభద్రతలపై నగరవాసుల ఆందోళన
Team Latestlyమేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో బుధవారం సాయంత్రం రౌడీషీటర్ హత్య జరిగిన ఘటన కలకలం రేపింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
Nalgonda Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును వెనుక నుండి ఢీకొట్టిన లారీ, బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం
Team Latestlyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద సోమవారం శ్రీ విద్యాపీట్ బస్సును లారీ వెనుక నుండి ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.
Delhi Blast: వీడియో ఇదిగో, ఢిల్లీలో బాంబు మోత, ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు, మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఘటన, పలువురికి గాయాలు
Team Latestlyదేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఐదుకుపైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి.
Early Signs of High Cholesterol: మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?, అధిక కొలెస్ట్రాల్‌కు కారణాలు ఏమిటి, ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి ?
Team Latestlyకొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థం. ఇది రక్తంలో ఉంటుంది, హార్మోన్లు, కణ గోడలు, విటమిన్ D తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే, అది హృదయానికి, రక్తనాళాలకు హానికరం అవుతుంది.