News

Hurricane Melissa: కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న అత్యంత భయంకరమైన హరికేన్ మెలిస్సా, వీధులన్నీ వరదలతో నిండిపోవడంతో పాటుగా నీటిలో మునిగిపోయిన కార్లు

Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్‌లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

Team Latestly

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.

Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన

Team Latestly

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

Cyclone Montha News Update: మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం, సముద్రం అల్లకల్లోలం..

Team Latestly

నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం జారీ చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం, ఈ తుఫాను అక్టోబర్ 28 ఉదయానికి ‘తీవ్ర వాయుగుండం’గా (Severe Cyclonic Storm) మారే అవకాశం ఉందని తెలిపింది.

SC on Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, కేసులను సీబీఐకి బదిలీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడి

Team Latestly

నకిలీ కోర్టు ఆదేశాలు, పోలీసు, న్యాయ అధికారుల పేర్లను వాడి ప్రజలను మోసం చేసే డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కోర్టు స్వయంగా (సుమోటోగా) దృష్టి సారించి,అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Cyclone Montha: 17కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తోన్న మొంథా తుఫాను, ఎగసిపడుతున్న అలలు, రేపు తీరం దాటే అవకాశం, అత్యవసర సాయంపై ఏపీ చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..

Team Latestly

మొంథా తుపాను తీరం వైపు దూసుకువస్తోంది. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన

Team Latestly

కర్నూల్‌ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్‌ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్‌ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.

Maruti Suzuki Jimny: లక్ష యూనిట్లు దాటిన జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ ఎగుమతులు, విడుదలైన కొద్ది రోజుల్లోనే 50 వేలకు పైగా ఆర్డర్లు, హర్షం వ్యక్తం చేస్తున్న మారుతి సుజుకి సీఈవో హిసాషి టేకుచి

Team Latestly

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మరో గొప్ప మైలురాయిని సాధించింది. దేశీయంగా తయారై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ, ఎగుమతులలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్‌లో భారత తయారీ రంగానికి గర్వకారణంగా నిలుస్తున్న ఘనతగా పేర్కొంది.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, కాంపౌండ్‌లో ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన కారు, బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని తల్లి ఆవేదన

Team Latestly

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్‌లోని ఇంటర్‌ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

Advertisement

Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం

Team Latestly

కర్నూలు కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Kurnool Bus Fire Accident: నిద్రలోనే తిరిగిరాని లోకాలకు.. కర్నూల్ బస్సు అగ్ని ప్రమాదంలో ఎన్నో విషాద కథలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి, 20 మంది సజీవదహనం, మరో 21 మందికి గాయాలు

Team Latestly

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్‌9490లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది

Bihar Assembly Elections 2025: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, మహాఘట్బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌, నవంబర్‌ 6, 11 తేదీల్లో ఎన్నికలు, నవంబర్‌ 14న ఫలితాలు

Team Latestly

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) ప్రధాన నాయకుడు తేజస్వి యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. అశోక్‌ గెహ్లాట్‌ ను బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (AICC) సీనియర్‌ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

YS Jagan on Google Data Center: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు, వైసీపీ వేసిన విత్తనాన్ని కూటమి ప్రభుత్వం చోరీ చేసిందని మండిపాటు,క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. రాష్ట్రం పరిస్థితి వీక్‌ అంటూ సెటైర్

Team Latestly

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రాబోతోన్న గూగుల్‌ డేటా సెంటర్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రచారంలో వచ్చిన వివిధ రకాల వార్తలను ఆయన ఖండిస్తూ.. ఈ డాటా సెంటర్ నిర్మాణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేసిన బీజానికి కొనసాగింపు మాత్రమే అని చెప్పారు.

Advertisement

Murder Caught on Camera: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య, డ్రైవర్ ని ఇటుకలతో కొట్టి చంపిన ఇద్దరు వ్యక్తులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Team Latestly

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని ధూమంగంజ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన దాడి చోటు చేసుకుంది. కాంట్రాక్టు రోడ్‌వేస్ డ్రైవర్ రవెంద్ర కుమార్ అలియాస్ మున్ను అనే వ్యక్తి తలపై ఇద్దరు వ్యక్తులు ఇటుకలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన అక్టోబర్ 21న CCTVలో రికార్డైంది. బాధితుడు వారు విసిరేసిన ఇటుకలు, రాళ్లను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.

Nagula Chavithi Wishes in Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగులో.. మీ బంధువులకు, స్నేహితులకు ఈ పండగ పూట మంచి కోటేషన్స్‌తో విషెస్ చెప్పేయండి

Team Latestly

నాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో పాములను పూజించే పవిత్రమైన పండుగ. చంద్ర మాసంలో చతుర్థి (నాలుగవ రోజు) రోజున జరుపుకునే ఈ పండుగను నాగ పూజా దినంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు నాగ దేవతలను ఆరాధించి, కుటుంబ శ్రేయస్సు, సంతానాభివృద్ధి , ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.

Tuni Sexual Assault Case: మలుపులు తిరుగుతున్న తుని కేసు, నిందితుడు నారాయణరావు ఆత్మహత్య, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు, అసలేం జరిగింది ?

Team Latestly

కాకినాడ తునిలో బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు

Andhra Pradesh: వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన

Team Latestly

ఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు.

Advertisement

Andhra Pradesh Shocker: కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..

Team Latestly

కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.

Droupadi Murmu Helipad Mishap in Kerala: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం, ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్, వీడియో ఇదిగో..

Team Latestly

కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన హెలిప్యాడ్‌లో అనుకోని సమస్యల కారణంగా కొంచెం కుంగి, ఒక పక్కకు ఒరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

HC On Sexual Assault Case: శారీరక సంబంధం అంటే రేప్ కాదు, పోక్సో కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశం, కేసు పూర్వాపరాలు ఏమిటంటే..

Team Latestly

పోక్సో చట్టం కింద నమోదైన ఒక ముఖ్యమైన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో, బాధితురాలు తన వాంగ్మూలంలో ఉపయోగించిన శారీరక సంబంధం అనే పదాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడు అత్యాచారం చేశాడని ట్రయల్ కోర్టు నిర్ణయించగా.. హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసింది.

Sleep Tips: మీరు 8 గంటలు నిద్రపోతున్నా మీ సమస్య తీరడం లేదా.. బెడ్ మీద నుంచి లేవగానే నీరసంగా ఉంటోందా.. కారణం ఇదే అంటున్న వైద్య నిపుణులు

Team Latestly

వైద్యులు తరచుగా కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తారు. ఎందుకంటే మన శరీరం శక్తిని పునరుద్ధరించడానికి, మానసిక ఫోకస్ నిలుపుకోవడానికి, జీవక్రియలను సరిగా కొనసాగించడానికి నిద్రను అత్యవసరంగా అవసరమని గుర్తించారు వైద్యులు. కానీ నిజానికి, కేవలం 8 గంటలు నిద్రపోవడం అంటే మేల్కొన్నప్పుడు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉండటం అనే హామీ కాదు.

Advertisement
Advertisement