News

Formula-E Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, చికిత్స కోసం ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో విద్యార్థి మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళన

Hazarath Reddy

ఏపీలోని విజయనగరం పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఓ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా సిబ్బంది సమాచారంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది విద్యార్థికి ఇంజెక్షన్ ఇవ్వగా.. అది వికటించడంతో ఆ విద్యార్థి ప్రాణాలు పోయాయి.

Allu Arjun Meets Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. గజ్జున వణుకుతున్న ప్రజలు.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి

Rudra

శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.

Advertisement

Pet Owners Case: పెంపుడు జంతువుల ఓనర్లపై జరిమానాలు చట్ట విరుద్ధం.. చెన్నై కోర్టు కీలక తీర్పు

Rudra

అపార్ట్‌ మెంట్ల ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్‌ మెంట్‌ యజమానుల సంఘం చేసే చర్యలు చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది.

Nepal Earthquake Update: నేపాల్ భూకంప ఘటనలో 32 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Rudra

నేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.

Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను ఆయన పరామర్శిస్తారు.

Chinese Thread Slits Man's Throat: గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘోరం జరిగింది. బైక్ పై చేపలు పట్టడానికి వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకను ‘చైనా మాంజ’ ఒక్కసారిగా తెగ్గోసింది. దీంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. గుర్తించిన స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

Rudra

ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

Earthquake In Nepal: నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్‌ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)

Rudra

నేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.

Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Sankranthiki Vasthunam Trailer: అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది అంటూ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది

Hazarath Reddy

అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh)‌ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది

Advertisement

Ambati Rambabu: వీడియో ఇదిగో, అడ్వకేట్‌గా మారిన అంబటి రాంబాబు, ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించిన మాజీ మంత్రి

Hazarath Reddy

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్వకేట్ గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించారు. ఇక ఎ‍ల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్‌ ఇచ్చారు.

Car Catches Fire in Ghatkesar: వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృ‌తులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.

HMPV Virus in India: ఈ వైరస్ పట్ల అప్రమత్తంగానే ఉన్నాం, దేశంలో నమోదైన హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై స్పందించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా

Hazarath Reddy

హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్) కేసులు భారత్ లో వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు.

Formula E Race Case: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

Advertisement

BPSC Exam Row: బీపీఎస్‌సీ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్, ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన జన్ సురాజ్ చీఫ్

Hazarath Reddy

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. తాజాగా పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Monkey Enters Courtroom: వీడియో ఇదిగో, జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టులోకి ప్రవేశించిన కోతి, అక్కడే ఉన్న ఫైల్స్‌ను పరిశీలించి వెళ్లిపోయిన వానరం

Hazarath Reddy

వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో కోర్టు రూమ్లోకి ఓ కోతి ప్రవేశించింది. విచారణ జరగడాన్ని చూస్తూ అక్కడే ఉన్న ఫైల్స్ను పరిశీలించి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది రామాలయంతో సంబంధం ఉన్న 39 ఏళ్ల సంఘటన జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది.

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన చెత్త ఊడ్చే వాహనం, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, పలు వాహనాలు ధ్వంసం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్‌ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.

Advertisement
Advertisement