News
Cyclone Dana Live Updates: తీవ్ర తుఫాన్‌గా బలపడిన దానా, తీరం దాటే సమయంలో 120 కిమీ వేగంతో ఈదురు గాలులు, 200 రైళ్లు రద్దు, 10 లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు
Arun Charagondaబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది దానా. వాయవ్య బంగాళాఖాతంలోకి ఏర్పడగా ఒడిశా, బెంగాల్ తీరాలకు అలర్ట్ జారీ చేశారు. 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోంది దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.
ED Questions Amoy Kumar: ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ, ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం...భూదాన్ భూముల బదిలీపై విచారణ
Arun Charagondaఈడీ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని విచారించింది ఈడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై విచారించగా వందల కోట్ల విలువైన 42 ఎకరాలు అక్రమంగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.
RS Praveen Kumar: భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేస్తారా?, ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా..సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
Arun Charagondaభార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్‌పీ. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.. కానిస్టేబుల్ భార్యలు వాళ్ళ బాధలు చెప్పుకోడానికి శాంతియుతంగా నిరసన తెలిపుతుంటే అరుగురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. వాళ్లను అర్జెంటుగా డ్యూటీలోకి తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
Ponguleti Srinivas Reddy: దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి
Arun Charagondaదక్షిణకొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అని తెలిపారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయిన్నారు. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు ఉంటాయని తెలిపారు పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు.
Ankara Terror Attack: వీడియో ఇదిగో, టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి, ముగ్గురు మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు
Vikas Mటర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని సమాచారం. అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ టుసాస్ ఆవరణలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే, దాడికి తామే కారణమని ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు.
Bulandshahr Shocker: వీడియో ఇదిగో, మురికి కాలువలో ఆపిల్ పండ్లు కడిగి అమ్మిన వ్యాపారి
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మురుగు కాలువలో నుంచి ప్రవహిస్తున్న నీటితో పండ్లను కడుగుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పండ్ల విక్రేత ఆపిల్‌లను తాజాగా మరియు నిగనిగలాడేలా ఉంచడానికి మురుగు కాలువలో కడగడం వీడియోలో చూపబడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Raja Saab New Poster: బాబోయ్ ప్రభాస్ మునుపెన్నడూ లేని లుక్‌లో ఇరగదీస్తున్నాడుగా, రాజసం ఉట్టి పడే రాయల్ లుక్‌లో రాజాసాబ్ స్టిల్ నెట్టింట ట్రెండింగ్
Vikas Mరెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు కానుక రానే వచ్చింది.సింహాసనం ఖాళీగా లేదు. సింహానం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.. అంటూ రాజసం ఉట్టిపడేలా తలకిందులుగా ఉన్న సింహాసనం ఫొటోను మేకర్స్ ఇప్పటికే షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ ఇస్తూ రాజాసాబ్ పోస్టర్ విడుదల చేశారు.
Amaran Trailer Out: శివ కార్తికేయన్, సాయిపల్లవి అమరన్ ట్రైలర్ ఇదిగో, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా
Vikas Mశివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్, విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన రిషబ్ పంత్, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్
Vikas Mతాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని దాటేశాడు పంతం. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
Zimbabwe Smash World Record: 20 ఓవర్లలో 344 పరుగులు, టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జింబాంబ్వే, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కెప్టెన్ సికిందర్ రజా రికార్డు
Vikas Mటీ20 క్రికెట్‌లో జింబాబ్వే (Zimbabwe) ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.
Vangalapudi Anitha on Jagan: వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు, జగన్ పై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు. టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు చెబుతున్నారు. గతంలో సీఎం అని చెప్పుకుని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టారు. ఇప్పుడు రాజకీయ సమావేశాలను సాకుగా చూపుతున్నారు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసి నీతి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
PM Modi Russia Tour: ముగిసిన ప్రధాని మోదీ రష్యా టూర్, చైనా అధ్యక్షుడితో భేటీ.. ఈ పర్యటనలో పలు కీలక పరిణామాలు
VNSప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండు రోజుల రష్యా పర్యటన ముగిసింది. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో (BRICS Summit) పాల్గొన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా పలువురు దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఉజ్బెకిస్థాన్, యూఏఈ అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Cyclone Danas Effect on Puri Jagannath Temple: పూరీ జగన్నాథుడిపై దానా తుఫాన్ ఎఫెక్ట్, ఎలాంటి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్తగా ఆలయం మూసివేత, కోణార్క్ సూర్య దేవాలయం కూడా క్లోజ్
VNSపూరీ జగన్నాథ్ ఆలయ సందర్శనపై దానా తుఫాన్ (Cyclone Danas Effect) ఎపెక్ట్ పడింది. తుఫాన్ కారణంగా పూరీకి భక్తులు ఎవరూ రావొద్దని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పూరీ నుంచి భక్తులను ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పూరీలోని బ్లూఫాగ్ బీచ్ తో పాటు ఇతర బీచ్ లన్నీ మూసివేశారు.
Zimbabwe Register Highest T20I Score: టీ 20ల్లో జింబాబ్వే వరల్డ్ రికార్డ్, ఏకంగా 344 రన్స్ చేసి సరికొత రికార్డు నెలకొల్పిన జింబాబ్వే
VNSటీ20 క్రికెట్‌లో జింబాబ్వే (Zimbabwe) ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133*; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లు) వీర విహారం చేశాడు
AP Cabinet Meeting Highlights: ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోవడం కుదరదు, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయం, ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగదారులు నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.
Pushpa 2 Grand National Press Meet: పుష్ప ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్, రేపు మెగా ప్రెస్ మీట్ పెడుతున్న చిత్ర యూనిట్, ఎందుకు అనేది మాత్రం సస్పెన్స్
VNSమరో 46 రోజుల్లో దేశవ్యాప్తంగా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) కౌంట్‌డౌన్ షురూ కానున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
APPSC New Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyచంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను బుధవారం నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు
MVA Seat-Sharing Formula: మహావికాస్ కూటమి మధ్య కొలిక్కివచ్చిన సీట్ల పంపకాలు, 65 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన ఉద్దవ్ థాక్రే శివసేన
VNSమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆధిత్య ఠాక్రే తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మహిమ్ నుంచి మహేశ్ సావంత్, థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజన్ విచారేను బరిలోకి దింపనున్నట్లు ఉద్ధవ్ వర్గం ప్రకటించింది.
Astrology: అక్టోబర్ 27న కుజ గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం..దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డబ్బు అందం ఆకర్షణ ,విలాస వంతలకు ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది.
Tamil Nadu: స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఆవు, ఈ ప్రమాదంలో తప్పెవరిదో మీరే చెప్పండి, తమిళనాడులో షాకింగ్ ఘటన
Hazarath Reddyతమిళనాడులోని తిరునల్వేలిలో స్కూటీపై వెళ్తున్న యువతిని ఆవు ఢీ కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. పశువులు కనిపిస్తుంటే ఆ చిన్న రోడ్డుపై యువతి అంత స్పీడ్గా ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆవును అలా రోడ్డు మీద వదిలేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.