News
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం, దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు తీపి కబురు అందించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం
VNSఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశం(AP cabinet ) గురువారం అత్యవసరంగా సమావేశం అవుతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనకు(Janasena) చెందిన మంత్రులు హాజరుకానున్నారు.
Big Change In UPI: యూపీఐ లిమిట్ పెంపు, ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో మరిన్ని కీలక నిర్ణయాలు
VNSడిజిటల్ చెల్లింపులను పెంచడం, చిన్న లావాదేవీలపై యూపీఐ లైట్‌ని (UPI Lite) ఉపయోగించే వారికి సౌకర్యాలను విస్తరించడమే పరిమితి పెంచడానికి ప్రధాన లక్ష్యమన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ ప్రకారం.. వినియోగదారులకు కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని.. యూజర్లు స్వాగతించాలన్నారు.
Saddula Bathukamma 2024 Wishes In Telugu: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా..అయితే Whatsapp, Instagram, Facebook ద్వారా ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..
sajayaతెలుగులో బతుకమ్మ అంటే - మాతృ దేవత అని అర్థం. బతుకమ్మను మహాగౌరి రూపంలో పూజిస్తారు. బతుకమ్మను అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే తయారుచేస్తారు. కుటుంబం ఆనందం, శ్రేయస్సు కోరిక కూడా దానిలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ పండుగను స్త్రీల గౌరవార్థం జరుపుకుంటారనే నమ్మకం ఉంది.
Saddula Bathukamma Wishes: సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaఊరంతా పూల వైభవం.. ఆడపడుచుల ఆటపాటలతో ఊరంతా సంబురం.. ఎంగిలిపూవు నుంచి సద్దుల వరకు 9 రోజులు తీరొక్క పూలతో వేడుకలు.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు
Hazarath Reddyరాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.
Ratan Tata In Critical Condition: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం..ఐసీయూలో అందిస్తున్న చికిత్స...
sajayaభారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వేత్తలో ఒకరైన టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని, ముంబై ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని రాయిటర్స్ సంస్థ రిపోర్ట్ చేసింది. 86 ఏళ్ల రతన్ టాటా అక్టోబర్ 7 సోమవారం రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం.
Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..
Hazarath Reddyస్థానికంగా "నిద్ర గన్నేరు చెట్టు" అని పిలవబడే 150 సంవత్సరాల పురాతన చెట్టు ఇది. 300కు పైగా దక్షిణ భారత మరియు బాలీవుడ్ చిత్రాలలో కనిపించినందుకు "సినిమా ట్రీ" గా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది వరదల కారణంగా నేలకూలిన తర్వాత పునరుద్ధరణ సంకేతాలను చూపుతోంది
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు, సాధారణ అనస్థీషియా లేకుండా ఆపరేషన్
Hazarath Reddyరాజాంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు 65 ఏళ్ల వృద్ధురాలికి సాధారణ అనస్థీషియా లేకుండా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.
YS Jagan On Good Book: రెడ్ బుక్ కాదు గుడ్ బుక్ పెడదాం...ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలన్న జగన్, కష్టాల్లో నుండే నాయకులు పుడతారని ధైర్యం నింపిన జగన్
Arun Charagondaరెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు మనం గుడ్ బుక్ పెడదాం అని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జగన్. గ్రామ/ వార్డు స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు.
Adulterated Tea Racket Busted: హైదరాబాద్‌లో టీ తాగేవాళ్లు జాగ్రత్త, 300 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
Hazarath Reddyహైదరాబాదీ జాగ్రత్తగా ఉండండి, బహుశా మీరు టీ స్టాల్స్‌లో కల్తీ టీ తాగుతున్నారేమో. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం టీ కల్తీ రాకెట్‌ను ఛేదించింది.హైదరాబాద్‌లో 300 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుంది.
CM Revanth Reddy On SC Categorization: ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మాదిగలను మోసం చేస్తున్న నయవంచకుడు సీఎం అని బీఆర్ఎస్ మండిపాటు
Arun Charagondaఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని...వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Uttar Pradesh: బీజేపీ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన న్యాయవాది, ఉత్తరప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా వీడియో
Arun Charagondaలఖింపూర్లో బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మకు ఛేదు అనుభవం ఎదురైంది. లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. వర్మ మద్దతుదారులు న్యాయవాదిపై దాడికి దిగడంతో మరింతవాగ్వాదం చోటుచేసుకుంది. ఈప్రాంతంలో రాబోయే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఈఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Tension At Kodangal: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన...అడ్డుకున్న పోలీసులు, వీడియో
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మహిళపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం, 100కు కాల్ చేసిన మహిళతో పరిచయం పెంచుకుని అఘాయిత్యం
Hazarath Reddyవనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పక్కన గొడవ జరగగా 100కు కాల్ చేసింది.. దీంతో కానిస్టేబుల్ జగన్ ఇంటికొచ్చి మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.ఆ తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగివ్వలేదు. చివరకు ఇంజాపూర్ తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోగా తప్పించుకొని వచ్చానని ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది.
Andhra Pradesh Shocker: ఏలూరులో ఘోర విషాదం, పందెంకోడికి ఈత నేర్పిస్తూ చెరువులో పడి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి
Hazarath Reddyఏలూరు జిల్లాలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
KTR On Bathukamma Celebrations: ఈసారి పండుగ..పండుగ లెక్క లేకుండా పోయింది...భయానక వాతావరణంలో తెలంగాణ ప్రజలు..మండిపడ్డ కేటీఆర్, నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అని మండిపాటు
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి అని తెలిపారు. ఈ సారి పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయిందని...రేవంత్ పాలనలో రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: వీడియో ఇదిగో, మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, అవినీతి బండారం బయటపెట్టిన ఆమె భర్త
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త.
Hurricane Milton Update: అమెరికాను వణికిస్తున్న హరికేన్ మిల్టన్, తీవ్ర తుఫాన్‌గా మారడంతో ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటన, ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు
Hazarath Reddyమిల్టన్ హరికేన్ బుధవారం ఫ్లోరిడా పశ్చిమ తీరం వెంబడి విపత్తు ఢీకొనే దిశగా దూసుకెళ్లింది, లక్షలాది మందిని ఖాళీ చేయమని ఆదేశించిన తర్వాత కొంతమంది నివాసితులు తాము అక్కడే ఉంటామని పట్టుబట్టారు. అయితే అధికారులు మాత్రం కుదరదు ప్రాణాలు పోతాయని హెచ్చరించారు
BJP Leader Video Call Leaked: చిక్కుల్లో గుంటూరు జిల్లా బీజేపీ నేత, ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ రేపు వస్తావా అంటూ పచ్చిబూతులు..వీడియో వైరల్
Arun Charagondaబీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ సోషల్ మీడియా సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ‘రేపు నాతో వస్తావా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం అంటూ చేసిన అసభ్యకర లీక్ కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.