News
Ola Scooter Catches Fire: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతుండగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు
Hazarath Reddyకేరళలోని తిరువనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలో ఉండగా మంటలు చెలరేగడంతో భద్రతా ప్రమాణాలపై ఆందోళన నెలకొంది. ఇద్దరు విద్యార్థులు కాలేజీకి వెళ్తుండగా స్కూటర్ నుంచి పొగలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
Mahbubnagar: పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగం కొల్పోయిన యువకుడు, ఇంటర్వ్యూ లెటర్ ఆలస్యంగా ఇవ్వడంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
Arun Charagondaఓ పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కొల్పోయాడు ఓ యువకుడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ కి చెందిన నాగరాజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. సెప్టెంబర్ 27 లోపు ఇంటర్వ్యూకి హాజరు కావాలని అధికారులు నాగరాజుకి కాల్ లెటర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు.
RBI Monetary Policy Meeting 2024: వరుసగా పదోసారి కూడా రెపో రేటు 6.5 శాతంగానే ఫిక్స్, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
Hazarath Reddyకీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) నిర్ణయించింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో (RBI Monetary Policy Meeting 2024) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
Patnam Narender Reddy Arrested: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, పాదయాత్రకు బయలుదేరుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaకొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ నెలకొల్పకూడదని గ్రామ ప్రజలతో కలిసి ఇవాళ పాదయాత్రకు పిలుపునివ్వగా హైదరాబాద్ నుండి కొడంగల్ బయలుదేరుతుండగా బొమ్మరాసపేట తుంకిమెట్ల వద్ద అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Cyber Fraud In Andhra Pradesh: డాక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..డ్రగ్స్ మాఫియా పేరుతో రూ. 2 కోట్లు స్వాహా..
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా డాక్టర్‌నే బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అమీన్ ఆసుపత్రి వైద్యుడు ఇంతియాజ్‌కు పోలీసు అధికారి ఫొటో కలిగిన నంబరు నుంచి ఐదు నెలల క్రితం ఫోన్ వచ్చింది.
Pawan Kalyan At Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సరస్వతీ దేవీ అవతారంలో దుర్గమ్మ, ప్రత్యేక పూజలు చేసిన పవన్
Arun Charagondaవిజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్నారు పవన్. అనంతరం ప్రత్యేక పూజలు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని లక్షలాదిగా దర్శించుకోనున్నారు భక్తులు.
Garba King Ashok Mali Dies: గర్బా కింగ్ అశోక్ మాలి గుండెపోటుతో మృతి, పుణేలో గర్బా డ్యాన్స్ చేస్తు కుప్పకూలిన అశోక్...వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పుణేలో 'గర్బా కింగ్'గా పిలవబడే అశోక్ మాలి అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. సంప్రదాయ దుస్తులు ధరించి గర్బా డాన్స్ చేస్తున్న అతను ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Suryapet: మహిళతో అసభ్య ప్రవర్తన, కర్రలతో దాడి చేసిన కుటుంబ సభ్యులు..వైరల్ వీడియో
Arun Charagondaమహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కర్రలతో దేహశుద్ధి చేశారు కుటుంబ సభ్యులు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్‌లో ఓ వ్యక్తి గతంలో పరిచయం ఉన్న ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.దీంతో ఆగ్రహించిన మహిళ కుటుంబసభ్యులు కర్రలతో ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Disciplinary Action On PV Sunil: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై వేటు, ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో జారీ
Arun Charagondaఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. సాధారణ పరిపాలనాశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబర్ 1695 జారీ చేసింది.
FSSAI Lab At Tirumala: తిరుమలలో FSSAI ల్యాబ్, ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం,22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి సత్యకుమార్
Arun Charagondaతిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేయనుంది FSSAI. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు...ఆహార భద్రతా ప్రమాణాల చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి.
Union Cabinet Meet Today: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, జమిలీ ఎన్నికలు- దసరా,దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే ఛాన్స్!
Arun Charagondaఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జమిలీ ఎన్నికలపై చర్చతో పాటు దసరా, దీపావళి వస్తున్న తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Warangal: కూల్చివేతలు..ఎమ్మార్వోపై దాడి, ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని అనుకుని ఎమ్మార్వోపై దాడి చేసిన వరంగల్ ఎస్‌ఆర్ నగర్ కాలనీ వాసులు, బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి వచ్చానని చెప్పిన వినని ప్రజలు..వీడియో ఇదిగో
Arun Charagondaఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని ఎమ్మార్వోపై దాడి చేసిన సంఘటన వరంగల్ ఎస్‌ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి ఎమ్మార్వో వెళ్లగా తమ ఇండ్లను కూలగొట్టడానికే ఎమ్మార్వో వచ్చాడేమో అనుకొని ఆయనపై దాడి చేశారు కాలనీ వాసులు. దీంతో తనపై దాడికి పాల్పడిన వారిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో.
Hyderabad Metro Rail Second Phase: హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధం, రూ.24,269 కోట్లతో అంచనా వ్యయం, కేబినెట్ అమోదం తెలిపాక కేంద్రానికి నివేదించనున్న ప్రభుత్వం
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే మూడు కారిడార్లుగా హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతుండగా మరో ఐదు కారిడార్లలో మెట్రో రెండో దశను విస్తరించనున్నారు.
Health Tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా...దానికి కారణాలు చికిత్స తెలుసుకుందాం...
sajayaచాలామంది తరచుగా ఇబ్బంది పడే సమస్య తలనొప్పి అది ఎందుకు వస్తుందో తెలియదు సడన్ గా వచ్చే చాలా ఇబ్బందిని గురిచేస్తుంది. అయితే తలనొప్పి రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది కంప్యూటర్ పైన స్క్రీన్ పైన ఎక్కువ సేపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటికి ఒత్తిడి అనేది కలుగుతుంది.
Health Tips: బూడిద గుమ్మడి కాయ జ్యూస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...అయితే ఎవరు ఈ జ్యూస్ తాగకూడదో తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుమ్మడికాయ రసాన్ని తాగుతున్నారు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి ముందుగా గుమ్మడికాయ రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Aamir Jamal Catch Video: వారెవ్వా.. గాల్లోకి డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న అమీర్ జమాల్, అలాగే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్ పోప్
Vikas MPAK vs ENG 1వ టెస్ట్ 2024లో ఆలీ పోప్‌ను ఔట్ చేయడానికి అమీర్ జమాల్ సంచలనాత్మక ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండవ ఓవర్‌లో జరిగింది. నసీమ్ షా బౌలింగ్‌లో ఓలీ పోప్ పుల్ షాట్ కొట్టాడు. అయితే అమీర్ జమాల్ మిడ్-వికెట్‌లో జంప్ చేస్తూ ఒంటి చేత్తో డైవింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.
Noida: ప్రియురాలు కోరికలు తీర్చడానికి మామ ఇంటికే కన్నం వేసిన ప్రియుడు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Vikas Mనోయిడా పోలీసులు సెక్టార్ 42లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, పెద్ద సంఖ్యలో దొంగిలించబడిన విలువైన వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన ఆకాష్ తన ప్రియురాలి డిమాండ్ల కోసం తన సొంత మామ ఇంట్లోనే దొంగతనం చేశాడు. అతని ఇద్దరు స్నేహితులు నేరంలో అతనికి సహకరించారు.
MS Dhoni in Gym Video: జిమ్ లోకి వెళుతున్న ధోనీ వీడియో ఇదిగో, రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో మహేంద్రుడు పాల్గొనడంపై కొనసాగుతున్న సస్పెన్స్
Vikas Mఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలానికి ముందు, భారత మాజీ కెప్టెన్ MS ధోని రాంచీలో కంట్రీ క్రికెట్ క్లబ్‌లోని తన C3 ఫిట్‌నెస్ హబ్‌లోకి వెళ్లడం కనిపించింది. రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో ధోనీ పాల్గొనడం అస్పష్టంగానే ఉంది,
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ 2024-25 కోసం గ్రూప్‌లను ప్రకటించిన బీసీసీఐ, ఆరు ఎలైట్ గ్రూపులలో మొత్తం 32 జట్లు, అక్టోబర్ 11 నుండి ప్రారంభం
Vikas Mభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే రంజీ ట్రోఫీ 2024-25 కోసం గ్రూప్‌లను ప్రకటించింది. BCCI ఆరు ఎలైట్ గ్రూప్‌లు మరియు ఒక ప్లేట్ గ్రూప్‌లో 38 జట్లను విభజించింది. ఒక ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లు భాగమైన ఆరు ఎలైట్ గ్రూపులలో 32 జట్లు జత చేయబడ్డాయి.
Pushpa 2 Update: రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప-2, ఫస్ట్‌హాఫ్ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్ చేశారంటూ పోస్టర్
Vikas Mఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రమేదేనా ఉందంటే అది పుష్ప-2: ది రూల్ ఒకటే.పుష్పతో అందరి దృష్టిని ఆకర్షించిన సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం కోసం గత రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.