వార్తలు
Zomato Paytm Deal: జొమాటోతో భారీ డీల్ కుదుర్చుకున్న పేటీఎం, ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటన
Vikas Mడిజిటల్ చెల్లింపు సేవల యాప్ పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జొమాటోతో భారీ డీల్ కుదుర్చుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం ప్రకటించింది.
TRAI: ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వచ్చే కాల్స్ నమ్మవద్దు, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాయ్
Vikas Mఇటీవల కాలంలో దేశంలో మోసపూరిత, బెదిరింపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో, ట్రాయ్ (Telecom Regulatory Authority of India) స్పందించింది. ఈ తరహా అవాంఛనీయ కాల్స్ పై ట్రాయ్ వినియోగదారులకు సూచనలు చేసింది. TRAI పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Five9 Layoffs: ఆగని లేఆప్స్, 7 శాతం మంది ఉద్యోగులను తీసేసే యోచనలో Five9, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Vikas Mకాల్ & కాంటాక్ట్ సెంటర్ యాజ్ ఎ సర్వీస్ (CCaaS) ప్రొవైడర్ అయిన Five9, దాని పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా తన శ్రామిక శక్తిని 7 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. తొలగింపులు దాని కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి చెప్పబడ్డాయి. ఫైవ్9లో ఉద్యోగాల కోతలు కంపెనీలోని అనేక మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
Visa Free Access to Indians: పాస్ పోర్టు ఉంటే చాలు..ఎంచక్కా 35 దేశాలు తిరిగి రావొచ్చు, వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లే అవకాశం, మొత్తం 35 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం భారతీయులకు మాత్రమే
VNSసాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా (Visa)తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు (visa-free access) ప్రకటించాయి
IND-W vs ENG-W 2025 Schedule: భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఇదిగో, జూన్ 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
Vikas Mభారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
IND vs ENG 2025: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ
Vikas Mభారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
Fine Rice For Ration Card Holders: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! జనవరి నెల నుంచి ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం, ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
VNSరేషన్ కార్డు దారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో (Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.
Leh Bus Accident: లద్దఖ్ లో ఘోర ప్రమాదం, 200 మీటర్ల లోయలో పడిపోయిన బస్సు, ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
VNSప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో (Bus Falls) పడింది. (Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది. లేహ్ (Leh Accident) నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది.
Sharmila Slams PM Modi: మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
Hazarath Reddyప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
Hyundai Alcazar Facelift: అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ నుంచి సరికొత్త కారు, కేవలం రూ. 25వేలు కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు
VNSదక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ (Alcazar Facelift) లిఫ్ట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. హ్యండాయ్ ఫ్లాగ్ షిప్ త్రీ రో ఎస్‌యూవీ కారు ఆవిష్కరణ తేదీ ఖరారు కావడంతో ప్రీ బుకింగ్స్ (Pre Bookings) ప్రారంభం అయ్యాయి.
Barrelakka Crying Video: నాకే పాపం తెలియదంటూ ఏడ్చేసిన బర్రెలక్క, ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ వార్త వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyకర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తాలూకు ఓ వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. అందులో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పడం వీడియోలో కనిపించింది.
Uttar Pradesh Girl Kidnapped: మలవిసర్జన కోసం వెళ్లిన బాలికపై అత్యాచారం, 16 ఏళ్ల బాలికను కారులో కిడ్నాప్ చేసి...కదులుతున్న కారులోనే గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు
VNSముగ్గురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ (Kidnap) చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించి హైవే పైకి వెళ్లారు. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. (Girl Kidnapped, Raped In Car) బాధితురాలి ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Kolkata Rape-Murder Case: మోదీజీ..కామాంధులకు వెంటనే శిక్ష పడేలా కఠినమైన చట్టం తీసుకురండి, ప్రధాని మోదీకి దీదీ లేఖ
Hazarath Reddyకోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ (CM Mamata Banerjee writes to PM Modi) రాశారు
Hyderabad: వీడియో ఇదిగో, ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్ తీసిన యూట్యూబర్, ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో లైకుల కోసం రోజురోజుకీ యువత చేస్తున్న పిచ్చి పనులు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్ అయిన its_me_power రీల్స్ తీశారు.
Telangana: వీడియో ఇదిగో, హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందంటూ నీటితో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Hazarath Reddyహరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీటితో శుద్ది చేశారు. యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వీడియోలు వైరల్ గా మారాయి.
IMD Alert For Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన, ఐదు రోజుల పాటూ భారీ వర్షాలుంటాయని ఐఎండీ హెచ్చరిక, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
VNSతెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Kolkata Doctor Rape-Murder Probe: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై సుప్రీంకోర్టుకు రిపోర్టు ఇచ్చిన సీబీఐ, దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు..
VNSమృతురాలిపై శరీరంపై గాయాలను బట్టి చూస్తే ఆమెపై ద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు కనబడుతోందని కోల్‌కతా డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. మృతురాలి ముఖంపై గాయాలను పరిశీలిస్తే ఆమెను బాగా కొట్టినట్టు తెలుస్తోంది. కళ్లు, మెడ భాగానికి మధ్యలో చాలా ఎక్కువ గాయాలున్నాయి.
Bihar: మేనకోడలిని పెళ్లి చేసుకున్న మామ, ప్రేమలో పడటం తప్పుకాదని సమర్థించిన యువతి, ప్రభుత్వం తమను వదిలివేయాలని ఆవేదన, వీడియో ఇదిగో..
Hazarath Reddyబెగుసరాయ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శివశక్తి కుమార్ తన 24 ఏళ్ల మేనకోడలు సజల్ సింధును ఖగారియాలోని కాత్యాయనీ మందిర్‌లో ఆగస్టు 14న వివాహం చేసుకున్నారు. ఒక వీడియో ప్రకటనలో, సింధు తమ పెళ్లిని సమర్థించింది. ప్రేమలో పడటం నేరం కాదని, సవాళ్లను కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
Naga Chaitanya in Racing Business: ఎంగేజ్ మెంట్ తర్వాత సాహసాలు చేస్తున్న నాగ చైతన్య, మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన అక్కినేని వారబ్బాయి, హైదరాబాద్ తరుపున రేసింగ్ టీమ్ కొనుగోలు
VNSఅక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడికే ఫుడ్ బిజినెస్‌లో అడుగుపెట్టిన చైతు తాజాగా రేసింగ్‌లో అడుగుపెట్టారు
Jagan Slams CM Chandrababu: మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు.