Politics

TDP 41st Foundation Day: తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నేడు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ, తరలిరానున్న పార్టీ నేతలు, కార్యకర్తలు

Hazarath Reddy

టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నేడు సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దివంగత నేత , మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది.

Bomb Threat Call: దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి వెలుపల బాంబు కలకలం, అగంతుకుడి బెదిరింపు కాల్‌తో అలర్ట్ అయిన పోలీసులు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత DevendraFadanvis ఇంటికి బెదిరింపు కాల్ వచ్చింది. మహారాష్ట్ర డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి వెలుపల బాంబు పెట్టామని అగంతకుడు పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన నాగ్‌పూర్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇది ఫేక్ కాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Nallapareddy Prasanna Kumar Reddy: చివరి దాకా జగన్‌తోనే, పార్టీ మార్పు ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి

Hazarath Reddy

పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, చివరి రక్తపు బొట్టు వరకు సీఎం జగన్‌తోనే ఉంటానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

AP Assembly Speaker Fake Degree Issue: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారు.. ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు

Rudra

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు.

Advertisement

Opposition Leaders Meeting: వీడియో ఇదిగో, మోదీని దించడమే లక్ష్యంగా ఏకమైన ప్రతిపక్షాలు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో భేటీ అయిన పలు పార్టీల నేతలు

Hazarath Reddy

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భావసారూప్యత కలిగిన పార్టీల ప్రతిపక్ష నేతల సమావేశం కొనసాగుతోంది.

Rahul Gandhi Gets Notice: రాహుల్ గాంధీకి మరో షాక్, ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు, ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటు

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయన నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని పేర్కొంది.

Caught on Cam: వీడియో ఇదిగో, సీఎం బంధువుపై నాటు బాంబులు విసిరి కత్తులతో నరికి చంపిన దుండగులు, క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో దారుణం చోటు చేసుకుంది. హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్ ను ఏడుగురు వ్యక్తులు బైకులపై వచ్చి దారుణంగా నరికి చంపారు. ముందుగా రెండు నాటు బాంబులు విసిరిన దుండగులు ఆయన కుప్పకూలగానే.. కర్రలతో దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు.

DS Quits Congress: బిగ్ ట్విస్ట్.. చేరిన ఒక రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని లేఖలో వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ చేరిన ఒక్క రోజుకే కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ (TS Congress) గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు.

Advertisement

Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణను మూడువారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, తక్షణమే విచారణ అధికారిని మార్చేయాలని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో (Viveka Murder Case) సీబీఐ దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. విచారణ అధికారిని తక్షణమే మార్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

PM Modi Hyderabad Visit: ఏప్రిల్ 8న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం.. జింఖానా గ్రౌండ్స్‌ లో బహిరంగ సభ!

Rudra

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

MLC Kavitha: కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. కేవియెట్ దాఖలు చేసిన ఈడీ.. నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం

Rudra

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది.

Advertisement

Bandi Sanjay: టీఎస్ పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీక్ కేసు... నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం.. ఆయనకు బదులు సిట్ ముందుకు రానున్న బీజేపీ లీగల్ టీమ్.. ఎందుకంటే??

Rudra

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి సిట్ నోటీసులు పంపింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం బండి సంజయ్ నేడు సిట్ ఎదుటకు రావాల్సి ఉంది. అయితే, నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు.

PM Modi Security Breach: వీడియో ఇదిగో, ప్రధాని పర్యటనలో మళ్లీ భద్రతా వైఫల్యం, బారికేడ్లను దూకి మోదీ కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన యువకుడు, అలర్ట్ అయిన పీఎం సిబ్బంది

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు ఎదురొచ్చే యత్నం చేశాడు . అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Khushboo Tweet Viral: మోదీ ఇంటిపేరుపై గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్.. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఖుష్బూ.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే??

Rudra

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం, ప్రజా ప్రతినిధుల చట్టం కింద ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి.

Mekapati Chandrasekhar Reddy: పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉంది, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. తనపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు

Advertisement

Mekapati Chandrasekhara Reddy: వీడియో ఇదిగో, మేకపాటి చంద్రశేఖరరెడ్డిని సస్పెండ్ చేసినందుకు వ్యతిరేక వర్గం సంబరాలు

Hazarath Reddy

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు పార్టీలో ఆయనకు వ్యతిరేకవర్గం వింజమూరు లోని పాత బస్టాండ్ సెంటర్ లో సంబరాలు చేసుకున్నారు.

AP Budget 2023: రెండు కీలక తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, బోయ, వాల్మీకి కులాలు ఎస్టీల్లోకి, దళిత క్రిస్టియన్లు ఎస్సీల జాబితాలోకి, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 9వ రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా..రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు

kotamreddy Giridhar Reddy Joins TDP: టీడీపీలో చేరిన కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని వెల్లడి

Hazarath Reddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు

Kotamareddy on Suspension: ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం, సస్పెన్సన్‌పై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Hazarath Reddy

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement