Politics

CM KCR Message to BRS Activists: కవితపై ఈడీ విచారణ వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని కార్యకర్తలకు భరోసా

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ సర్కారు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి ఈ సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆత్మీయ సందేశం ఇచ్చారు.

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో 7 గంటలు పైగా కవితను విచారిస్తున్న ఈడీ, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నతెలంగాణ అదనపు ఏజీ

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు

Skill Development Scam: దేశంలోనే అతి పెద్ద స్కాం, స్కిల్‌ డెవలప్మెంట్‌ పేరుతో రూ.371 కోట్లు కాజేశారు, గత ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం అతిపెద్దదని స్పష్టం​ చేశారు.

TDP Leaders Attack On Speaker: వీడియో ఇదిగో, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడి, అడ్డు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా దాడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఏడో రోజున రభస నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.స్పీకర్‌ చైర్‌ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు

Advertisement

RRR Movie: హోంమంత్రి అమిత్‌షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. ట్వీట్ చేసిన అమిత్ షా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ రావడంపై హర్షం.. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందన్న మంత్రి

Rudra

ఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అకాడమీ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను కలిశారు.

TSPSC Paper Leak: బండి సంజయ్‌, ఈటల రాజేందర్ అరెస్టు, గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) దీక్షకు దిగారు.

MLC Election Result: తగ్గని వైఎస్ జగన్ మేనియా, 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్, తెలంగాణలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు (MLC Election Result) విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections Results) ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Amit Shah Congratulate AVN Reddy: ఏవీఎన్‌ రెడ్డికి అభినందనలు తెలిపిన అమిత్ షా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన వద్దు, మోదీ పాలన కోరుకుంటున్నారంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం పట్ల బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలియజేశారు.

Advertisement

CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, ప్రస్తావనకు వచ్చిన కీలక అంశాలు ఇవే, అనంతరం హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతో సీఎం జగన్‌ చర్చించారు.

Sharmila House Arrest: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్, నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమంటూ మండిపాటు

Hazarath Reddy

హైదరాబాద్ లోని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన షర్మిల.. టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఆమె ఇంటి దగ్గర పోలీసు బలగాల్ని మోహరించారు. తర్వాత హౌస్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు.

TS MLC Elections 2023: తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం, ఇత‌ర పార్టీల నుంచి నామినేష‌న్లు దాఖ‌లు చేయని అభ్యర్థులు

Hazarath Reddy

ఎమ్మెల్యే కోటా( MLA Quota ) లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు( BRS Candidates ) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అధికార పార్టీ త‌ర‌పున నామినేష‌న్లు దాఖ‌లు చేసిన దేశ‌ప‌తి శ్రీనివాస్( Despathi Srinivas ), న‌వీన్ కుమార్( Naveen Kumar ), చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు

Delhi Excise Policy Case: మనీష్‌ సిసోడియాపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ, ఇదంతా ప్రధాని కుట్రని ఆప్ అధినేత కేజ్రీవాల్ మండిపాటు

Hazarath Reddy

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్‌ సిసోడియాపై తాజాగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మరో కేసు నమోదు చేసింది.ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఆప్‌ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసింది.

Advertisement

Mehbooba Mufti Visits Temple Video: వీడియో ఇదిగో, శివలింగానికి జలాభిషేకం చేసిన పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శలు

Hazarath Reddy

పూంచ్ జిల్లాలో పర్యటిస్తున్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ హిందూ ఆలయంలో పూజలు చేశారు. పూంచ్ సరిహద్దుల్లోని నవగ్రహ ఆలయానికి వెళ్లారు. ఈ ఆలయం నిర్మించిన యశ్ పాల్ శర్మ విగ్రహానికి పూలమాల సమర్పించారు. ఆలయంలోని శివలింగానికి జలాభిషేకం చేశారు.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్, విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన ఈడీ, అనారోగ్యంతో రాలేనని తెలిపిన కవిత

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. మరికాసేపట్లో ఈడీ (ED) ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ- మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.

AP Budget 2023: వీడియో ఇదిగో, స్పీకర్ పోడియం పైకి పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు, 14 మందిని ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని

Hazarath Reddy

టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

AP Budget 2023: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​కు రూ.21,434.72 కోట్లు, వార్షిక బడ్జెట్‌ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు.

Advertisement

AP MLC Election Result: ఆగని జగన్ దూకుడు, 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం, గోదావరి జిల్లాల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ

Hazarath Reddy

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది.

Kiran Kumar Reddy Quits Congress: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం.

AP Cabinet Approves 15 Bills: 45 అజెండా అంశాలపై చర్చలు, 15 బిల్లులతో పాటు 2023-27 పారిశ్రామిక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం, 24 వరకు అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Sharmila Detained by Police: కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ఆందోళన, అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవకతవకలు ఆరోపణలు

Hazarath Reddy

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు

Advertisement
Advertisement