Politics

CM KCR Bihar Visit: గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలకు, ఇటీవల అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డీసీఎం తేజస్వీ యాదవ్‌తో కలిసి ఆర్థిక సహాయం అందించారు.

CM KCR Bihar Visit: తెలంగాణ ముఖ్యమంత్రికి, పాట్నా ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం నితీష్ కుమార్, పాట్నాలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన

Hazarath Reddy

సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటన కొనసాగుతోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. పాట్నా ఎయిర్ పోర్టులో సీఎం నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

Abhijit Sen Dies: గుండెపోటుతో ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత, 2004-2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ విశేష సేవలు

Hazarath Reddy

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారని ఆయన సోదరుడు ప్రణబ్‌ సేన్‌ పేర్కొన్నారు.

Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశుల వారికి ఉద్యోగంలో విజయం, మీ రాశి ఫలితం ఏంటో చెక్ చేసుకోండి..

Krishna

సింహ రాశి వారు ఈరోజు అదృష్టాన్ని పొందుతారు. పనిలో విజయంతో పాటు, విద్యార్థులకు కూడా ఈ రోజు మంచిది.. ఈ గ్రహాల పరస్పర చర్య కారణంగా, ఈ రోజు మీకు ఎలా ఉంటుంది ? ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం ఉంటుంది... ఈరోజు మీ రాశిని తెలుసుకోండి.

Advertisement

Telangana: బీజేపీ పెద్దల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడ ఉన్నారు, ఆత్మగౌరవంతో ఉందామా.. గులాంలుగా మారుదామా?, పెద్దపల్లి సభలో కేంద్రంపై గర్జించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. బీజేపీ (BJP) అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) స్వరాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. గాంధీ మద్యపానం నిషేధించిన గుజరాత్‌ మద్యం ఏరులై పారుతోంది.

Ganji Chiranjeevi Joins YCP: మంగళగిరిలో టీడీపీకి భారీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలకనేత గంజి చిరంజీవి

Hazarath Reddy

మంగళగిరి టీడీపీలో భారీ షాక్ తగిలింది. కీలకనేత గంజి చిరంజీవి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.

Congress President Election: అక్టోబర్‌ 17న కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక, అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ విడుదల చేసిన సీడబ్ల్యూసీ

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల అక్టోబర్‌ 17న నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి.పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్‌ 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

JP Nadda – Nithin: రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?

Jai K

తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ , ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.

Advertisement

Maharashtra:  జైల్లోనే కుప్పకూలిపోయిన మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స చేస్తున్న వైద్యులు

Hazarath Reddy

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియ‌ర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మ‌ధ్యాహ్నం తీవ్ర‌ అస్వ‌స్థ‌త‌కు గురై జైల్లో కుప్ప‌కూలారు. ఆర్థూర్‌ జైలు సిబ్బంది ఆయ‌న‌ను హుటాహుటిన ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు.

CM Hemant Soren Disqualified as MLA: జార్ఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం, సీఎం హేమంత్ సోరెన్ శాస‌న స‌భ్య‌త్వం ర‌ద్దు, సీఎం రేసులోకి వచ్చిన హేమంత్ సోరెన్ భార్య

Hazarath Reddy

జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ శాస‌న స‌భ్య‌త్వం (Hemant Soren disqualified as MLA) ర‌ద్దయింది. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ర‌మేశ్ బ‌యాస్ శుక్ర‌వారం సోరెన్ శాస‌న స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Ghulam Nabi Azad Quits Congress: రాహుల్ గాంధీ వల్లే పార్టీ సర్వనాశనమైంది, రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించిన గులాం నబీ ఆజాద్, పార్టీకి గుడ్‌బై

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీతో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ (Ghulam Nabi Azad Quits Congres) తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు.

Jharkhand: జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వార్తలు, అధికారపక్ష ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న సీఎం, మా మద్దతు జేఎంఎంకేనని తెలిపిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

జార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి, సీఎం హేమంత్‌ సోరెన్‌పై (CM Hemant Soren) అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సిఫారసు చేసిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా (recent political developments in the state) మారాయి.

Advertisement

Ghulam Nabi Azad Resigns: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్, పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నానని లేఖ

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. " నేను చాలా విచారంతో హృదయపూర్వకంగా భారత జాతీయ కాంగ్రెస్‌తో నా అర్ధ శతాబ్దపు అనుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాను"

CM KCR on National Politics: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు,నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వను, మ‌త పిచ్చిగాళ్ల‌ను తరిమికొట్టాలని సీఎం పిలుపు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో (CM KCR Public Meeting) కేసీఆర్ ప్ర‌సంగించారు. ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని, మనకు పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు.

BJP-AAP Delhi Face-Off: బీజేపీ రూ. 800 కోట్ల బేరం.. అజ్ఞాతంలో ఆప్ ఎమ్మెల్యేలు, ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు, పబ్లిక్ స్టంట్ కోసమే ఆప్ ఆరోపణలంటూ కొట్టిపారేసిన బీజేపీ

Hazarath Reddy

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య అక్కడ రాజకీయాలు (BJP-AAP Delhi Face-Off) శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు (Some Are Not Reachable) ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Karnataka: టిప్పు సుల్తాన్‌ను ముస్లిం గుండా అంటే నాలుక కోసి పడేస్తాం, బీజేపీ మంత్రి ఈశ్వరప్పకు బెదిరింపు లేఖ, పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్ణాటక ఎమ్మెల్యే

Hazarath Reddy

కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న వేడి వేడి ఇంకా చల్లరలేదు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, వీర సావర్కర్‌ల ఫొటోలు ఉండడం అక్కడ తీవ్ర దుమారం రేపింది.

Advertisement

Bandi Sanjay: వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగిన బండి సంజయ్, సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ, పెద్ద‌ల‌ను గౌర‌వించండి అంటూ కామెంట్

Hazarath Reddy

ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజ‌య్ తెలంగాణ‌లో యాత్ర సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఇటీవ‌లే ఓ వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోల‌ను బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వ‌ర్గాల‌కు కౌంటర్ ఇచ్చింది.

Jaiveer Shergill Quits: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత జైవీర్ షెర్గిల్,అన్ని పార్టీ పదవులకు ఆయన రాజీనామా, పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని వెల్లడి

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత, జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ గుడ్‌బై చెప్పారు. అన్ని పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని, ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించలేదని రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు.

Bihar Assembly Floor Test: 2024లో బీజేపీకి నేనేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసిన బీహార్ సీఎం, విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం, సంకీర్ణ సర్కారుకు మద్దతిచ్చిన మొత్తం 160 మంది ఎమ్మెల్యేలు

Hazarath Reddy

తీవ్ర ఉత్కంఠ రేపిన బిహార్‌ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో (Bihar Assembly Floor Test) నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం నెగ్గింది.విశ్వాస పరీక్షలో నితీష్‌ సారథ్యంలోని మహాఘట్ బంధన్ సర్కార్‌కు 160 ఓట్లు (New Mahagathbandhan Govt Wins Trust Vote) వచ్చాయి.

BJP Offered Rs 20 Crore Each To 4 AAP MLAs: ప్రాణాలైనా వ‌దులుతాం,బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు, బీజేపీలో చేరితే రూ.20కోట్లు, ఎమ్మెల్యేలను తీసుకెళ్తే రూ.25 కోట్లు ఆఫర్‌పై ఆప్ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

దేశ రాజధానిలో బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వార్ మరింతగా వేడెక్కింది. ఢిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణంపై మనీష్‌ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన తర్వాత రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు నేతలు.

Advertisement
Advertisement