రాజకీయాలు

Telangana: రేవంత్‌ రెడ్డి నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం, దాడిపై స్పందించిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

Hazarath Reddy

రెడ్ల సింహ గర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై (Minister Malla Reddy) ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (PCC Revanth Reddy) హస్తం ఉంది.

Andhra Pradesh: మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్, మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం.

Uniform Civil Code: ఉత్తరాఖండ్ సీఎం సంచలన ప్రకటన, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ ప్రకటన, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయనున్న రెండో రాష్ట్రంగా నిలువనున్న ఉత్తరాఖండ్

Naresh. VNS

ఉత్త‌రాఖండ్‌లో (Uttarakhand) ఉమ్మ‌డి పౌర‌స్మృతిని (Uniform Civil Code) ప్ర‌వేశ పెట్టాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామీ చెప్పారు. ఉత్త‌రాఖండ్‌లోని చంపావ‌త్‌లో నిర్వ‌హించిన ఓ స‌భలో మాట్లాడిన పుష్క‌ర్ సింగ్ ధామీ (Pushkar singh dhami) ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

TDP Mahanadu: అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు, రాష్ట్రంలో ఉన్మాది పాలన, చేతకాని దద్దమ్మ జగన్, మహానాడు వేదికగా సీఎంపై విరుచుకుపడిన చంద్రబాబు

Hazarath Reddy

మహానాడు(Mahanadu) తెలుగుజాతికి పండుగ అని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు.

Advertisement

Samajika Nyaya Bheri Bus Yatra: రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర, పాత గాజువాక వైఎస్సార్‌ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభం, 17 మంది మంత్రులతో సామాజిక న్యాయభేరి

Hazarath Reddy

ఆంధ‍్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరు’’ అని తానేటి వనిత అన్నారు.

Harish Rao Fire on Modi: మద్దతిచ్చినప్పుడు మంచివాళ్లం, ఇప్పుడెలా అవినీతి పరులమయ్యాం! ప్రధాని మోదీకి హరీష్ కౌంటర్, బీజేపీ మాటలు గురివిందలా ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు, ప్రధాని తన హోదాకు తగ్గట్లు మాట్లాడాలంటూ హితవు

Naresh. VNS

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై (Narendra Modi) తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao)తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ(BJP) నేత‌లే విచ్ఛిన్న‌క‌ర శ‌క్తులు అని మండిప‌డ్డారు. మోదీ సిల్వ‌ర్ జూబ్లీ ఫంక్ష‌న్‌కు వ‌చ్చి చిల్ల‌ర మాట‌లు మాట్లాడిపోయార‌ని విమ‌ర్శించారు. మోదీ ఆయ‌న‌ స్థాయికి త‌గిన మాట‌లు మాట్లాడ‌లేద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Modi Chennai Tour: స్టేజీ మీదనే ప్రధాని మోదీకి షాక్ ఇచ్చిన సీఎం స్టాలిన్, తమిళాన్ని అధికారిక భాషగా ప్రకటించండి, రావాల్సిన నిధులు విడుదల చేయండి, ప్రసంగంలో పలు డిమాండ్లు పెట్టిన స్టాలిన్

Naresh. VNS

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తమిళనాడులోని చెన్నైలో (Chennai) గురువారం పర్యటించారు. డీఎంకే (DMK)అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా (Stalin) గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం స్టాలిన్‌తో కలిసి పాల్గొన్నారు.

West Bengal: బెంగాల్‌ గవర్నర్‌ వర్సెస్ సీఎం, మరింత ముదురుతున్న వివాదం, కొత్త చట్టం చేసిన మమతా బెనర్జీ, యూనివర్సిటీ ఛాన్సలర్‌గా దీదీ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటన

Naresh. VNS

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు (state universities) ఛాన్స్‌లర్‌గా (Chancellor) ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ (West Bengal ) ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది

Advertisement

CM KCR on National Politics: కేంద్రంలో మార్పును ఎవరూ ఆపలేరు, రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటారు, దేవేగౌడతో మీటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కేంద్రంలో మార్పు త‌థ్య‌మ‌ని సీఎం కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండు మూడు నెల‌ల త‌ర్వాత (Sensational news in 2-3 months) సంచ‌ల‌న వార్త వింటార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Chandrakant Patil: సుప్రీయా సూలే..నీకు రాజకీయాలు ఎందుకు వంట చేసుకోమన్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌, మండిపడుతున్న ఎన్సీపీ పార్టీ

Hazarath Reddy

మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌ ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకో' అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Hindu Ekta Yatra: తెలంగాణలో మసీదులు తవ్వుదాం, శవాలు ఉంటే మీవి, శివలింగాలు ఉంటే మావి, హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

Hazarath Reddy

కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో(Hindu Ekta Yatra) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి (Dig up mosques in Telangana) చూద్దామని శవాలు ఉంటే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సవాల్ చేశారు.

Bypoll 2022: దేశంలో ఉప ఎన్నికల నగారా, జూన్ 23న ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంకు ఆ రోజే ఉప ఎన్నిక

Hazarath Reddy

దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఏర్పడిన పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.

Advertisement

KCR Bengaluru Tour: బెంగళూరుకు సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచిన గులాబీ బాస్, ప్రధాని పర్యటన రోజునే బెంగళూరుకు పయనం, మోదీని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుందనే వెళ్లారని బీజేపీ ఆరోపణ, త్వరలోనే అన్నా హజారేతో కేసీఆర్ భేటీ

Naresh. VNS

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)గురువారం బెంగళూరు (Bengaluru) వెళ్లనున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ (Devegowda), కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో (Kumara swamy) భేటీ కానున్నారు.

Modi Hyderabad Schedule: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో కొత్త జోష్, ఏయిర్‌పోర్టు నుంచి ఐఎస్‌బీ వరకు పలుచోట్ల కార్యక్రమాలు, మోదీకి ఆహ్వానం పలికేందుకు ఈసారి కూడా కేసీఆర్ దూరం, మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఇదే!

Naresh. VNS

గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మ‌ధ్య‌హ్నం 1.25 గంట‌ల‌కు బేగంపేట ఏయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamili sai) ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రధానికి స్వాగతం పలకనున్నారు.

Bypoll Schedule: ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల, దేశవ్యాప్తంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, ఆసక్తిరేపుతున్న పంజాబ్, ఢిల్లీ ఫైట్, జూన్‌ 23న పోలింగ్, 26న కౌంటింగ్

Naresh. VNS

దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ (Bypoll Schedule) విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 23న ఎన్నికలు నిర్వహించి, 26న ఫలితాలు ప్రకటిస్తారు.

Yasin Malik Gets Life Sentence: యాసిన్ మాలిక్‌కు రెండుసార్లు యావజ్జీవ శిక్ష, రూ. 10లక్షలకు పైగా జరిమానా, ఏ శిక్ష వేసినా మీ ఇష్టమంటూ యాసిన్ కామెంట్, జమ్మూకశ్మీర్‌లో భద్రత పెంపు, పదికి పైగా కేసుల్లో తీర్పు వెల్లడి

Naresh. VNS

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు (Yasin malik) ఢిల్లీ పటియాలా హౌజ్‌ ఎన్‌ఐఏ కోర్టు (NIA Court) జీవిత ఖైదు శిక్ష (Life Sentence ) ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ. 10లక్షల జరిమానా విధించింది. పదేళ్లు కఠిన కారాగార శిక్ష, మరో ఐదేళ్లు ఉపా చట్టం (UAPA) కింద శిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది.

Advertisement

Kapil Sibal Quits Congress: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్‌ సిబల్‌, సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది

Hazarath Reddy

కాంగ్రెస్ సీనియర్‌ నేత, న్యాయకోవిదుడు కపిల్‌ సిబల్‌(73) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్‌ వేసిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని ప్రకటించారు. మే 16న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని స్వయంగా ఆయన మీడియాకు వివరించారు.

Rajya Sabha Polls 2022: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు, ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు నామినేషన్‌ దాఖలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha Polls 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.అలాగే తెలంగాణ నుంచి రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి (TRS Candidates) నామినేషన్‌ దాఖలు చేశారు.

IPL 2022: రిష‌బ్ పంత్.. బ్రెయిన్ ఉందా అసలు, టిమ్ డేవిడ్ వంటి విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ విషయంలో రివ్యూ వాడుకోవాలని తెలీదా, ఫైర్ అయిన ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి

Hazarath Reddy

ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌ధి రిష‌బ్ పంత్ తీరుపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు. టిమ్ డేవిడ్ విష‌యంలో రివ్యూ అడ‌గ‌క పోవ‌డాన్ని త‌ప్పు బ‌ట్టాడు. టిమ్ డేవిడ్ వంటి విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ ప‌రుగులు చేయ‌కుండానే ఔట‌య్యే అవ‌కాశం వ‌స్తే ఉప‌యోగించుకోరా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

CM Yogi Adityanath: ఇప్పుడు రోడ్లపై నమాజ్ అన్న మాటే వినపడటం లేదు, శ్రీ రామనవమి సందర్భంగా ఎక్కడా అల్లర్లు లేవు, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

Hazarath Reddy

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి విదితమే. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath) రెండోసారి ముఖ‍్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisement
Advertisement