రాజకీయాలు

Jharkhand: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలోనూ ఇలాగే కరోనాపై నోరుపారేసుకున్న ఇర్ఫాన్ అన్సారీ

Naresh. VNS

రోడ్ల‌ను హీరోయిన్‌ల బుగ్గ‌ల‌తో పోల్చ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింది. తాజాగా మ‌రో నేత అదేరీతి వ్యాఖ్య‌లు చేశారు. జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని జ‌మ్తారా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ (Irfan Ansari ) త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌న్నీ ఇక ముందు బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బుగ్గ‌ల్లా నున్న‌ (actor Kangana Ranaut’s cheeks)గా ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు.

Uttar Pradesh Elections: ఎమ్మెల్యే టికెట్ రాలేదని బోరున ఏడ్చిన నేత, కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అల్టిమేటం

Naresh. VNS

పార్టీ టికెట్ రానందుకు బీఎస్పీ నేత ఒకరు కార్యకర్తల ముందే బోరున ఏడ్చారు(bitterly cries). పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆత్మహత్య(Suicide) చేసుకుంటానని కూడా బెదిరించారు. బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) నాయకుడు అర్షద్ రాణా (Arshad Rana), ముజఫర్‌నగర్‌ (Muzzaffarnagar)లోని చార్తావాల్ స్థానం నుండి టికెట్ ఆశించారు.

Union Budget 2022: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

Hazarath Reddy

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వే జరగనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

UP Elections 2022: యూపీలో బీజేపీకి మళ్లీ షాక్, పార్టీని వీడిన మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ, సమాజ్‌వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మళ్లీ షాక్ తగిలింది. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్‌బై చెప్పి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సైనీని సమాజ్‌వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

Advertisement

UP Assembly Election: కాంగ్రెస్ సంచలన నిర్ణయం, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి అసెంబ్లీ టికెట్ ప్రకటించిన ప్రియాంక గాంధీ, యూపీ ఎన్నికలకోసం ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌

Naresh. VNS

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల( Uttar Pradesh assembly election) కోసం 125 మందితో కూడిన తొలి విడత జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని(mother of Unnao rape victim) అభ్యర్ధిగా ప్రకటించి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలేవీ అభ్యర్ధులను ప్రకటించలేదు.

UP Assembly Elections 2022: యూపీలో బీజేపీకి షాక్, 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరుతారని బాంబు విసిరిన శరద్‌ పవార్‌, మౌర్యతో పాటు పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే

Hazarath Reddy

యూపీలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అక్కడ రాజకీయం మరింతగా వేడెక్కింది. వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh Assembly Elections 2022) సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతుందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ ( Sharad Pawar) వ్యాఖ్యానించారు.

Tejaswi Yadav Meets CM KCR: జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు, బీహార్‌ విపక్ష నేత తేజస్వియాదవ్‌‌తో ప్రగతి భవన్‌లో భేటీ

Hazarath Reddy

జాతీయ రాజకీయాలపై అసక్తి చూపుతున్న కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి మంగళవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ (Tejaswi Yadav Meets CM KCR) అయ్యారు.

Chandrababu on Alliance: రాష్ట్రంలో పరిస్థితులను బట్టి పొత్తులు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అవసరమైనప్పుడే ఆయన లవ్ చేస్తారని సోము వీర్రాజు చురక

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పొత్తుల‌పై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు (Chandrababu on Alliance) చేశారు. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, పొత్తుల‌కు సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో ప్రధాని మోదీకి రైతుల సెగ, ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేసుకున్న భారత ప్రధాని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్లు బ్లాక్ చేసిన నిరసనకారులు

Hazarath Reddy

ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేశారు. ఇవాళ ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అక్కడే ఓ బహిరంగసభలోనూ ప్రధాని మాట్లాడాలి. కానీ రైతులు రోడ్డు మార్గంలో ధర్నా చేయడం వల్ల ప్రధాని తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

JP Nadda Press Meet: ఇది మనకు ధర్మ యుద్ధం, కేసీఆర్‌ది అప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్నారు, పార్టీ ఆఫీసులో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

Hazarath Reddy

సంజయ్ బండిని మానవహారంగా నిర్వహించి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు (Telangana govt is the most undemocratic government) ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ తన భావాలను, మానసిక సమతుల్యతను కోల్పోయారని విమర్శించారు.

Bandi Sanjay Arrest Row: ర్యాలీ లేకుండా నిరసనతో ముగించిన జేపీ నడ్డా, గాంధీ విగ్రహానికి నివాళులు, సత్యాగ్రహం పూర్తయిందని తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Hazarath Reddy

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఇతర బీజేపీ నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

CM YS Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, పలువురు కేంద్రమంత్రులతో భేటీ, పలు కీలక అంశాలపై చర్చలు

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ (CM YS Jagan Delhi Tour) అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం జగన్‌.. విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటుపై చర్చించారు. అలాగే కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కలిశారు.

Advertisement

Satya Pal Malik: ఆ రైతులు నాకోసం చనిపోయారా.. రైతుల ఆందోళనలపై ప్రధాని మోదీ అహంకారిగా ప్రవర్తించారంటూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు, ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ మాలిక్ ఈ కామెంట్స్ చేశారు. రైతుల ఆందోళనలపై (Farmers Protests) జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ అహంకారంగా ప్రవర్తించారని అన్నారు.

Y. S. Sharmila: ఏపీలో షర్మిల పార్టీపై సస్పెన్స్, వ్యూహాత్మక సమాధానం ఇచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని తెలిపిన షర్మిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.

Andhra Pradesh: సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా లేక తాగుబోతులకు అధ్యక్షుడా, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని తెలిపిన నారాయణ స్వామి

Hazarath Reddy

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా (political party or a liquor company) అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు.

Sajjala Rama Krishna Reddy: ఏపీలో బీజేపీని చూస్తే జాలేస్తోంది, మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు, సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే బీజేపీ నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) విమర్శించారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Andhra Pradesh: మీరిచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉంది, సిగ్గు లేకుండా బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామంటున్నారు, ముందు పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడండి, బీజేపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు మండిపాటు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ప్రజాగ్రహ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు (YSRCP Ministers) మండిపడ్డారు. ఏపీలో ఉనికి‌ కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ (Prajagraha Sabha) నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (State Municipal Minister Botsa Satyanarayana) ఎద్దేవా చేశారు.

BJP Prajagraha Sabha: 2024లో ఏపీలో బీజేపీదే అధికారం, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారు, విజయవాడ ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో (BJP Prajagraha Sabha) ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేశారు.

BJP MP Hema Malini: నా బుగ్గల గురించి లాలూ మొదలు పెట్టారు, అదే సాంప్ర‌దాయాన్ని అంద‌రూ అనుస‌రిస్తున్నారు, అటువంటి వ్యాఖ్య‌లను ప‌ట్టించుకోన‌ని తెలిపిన హేమ‌మాలిని

Hazarath Reddy

మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన నేత గులాబ్ రావ్ పాటిల్ హేమ‌మాలిని బుగ్గలపై చేసిన వ్యాఖ్యలకు హేమ‌మాలిని ( Hema Malini ) స్పందించారు. రోడ్ల‌ను నటీమ‌ణుల బుగ్గ‌ల‌తో పోల్చే సాంప్ర‌దాయాన్ని గ‌తంలో ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూప్ర‌సాద్ యాద‌వ్ మొద‌లుపెట్టార‌ని ఆమె గుర్తుచేశారు.

Modi Goa Visit: గోవాపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ, రూ. 600 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అన్ని రంగాల్లో గోవా ముందంజలోనే ఉంది. 100శాతం తొలిడోసు వ్యాక్సినేషన్ పూర్తయినందుకు అభినందనలు

Naresh. VNS

ప్రధాని మోదీ(Narendra Modi) తాజాగా గోవా(Goa)లో పర్యటించారు. అక్కడ రూ. 600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఆదివారం జరిగిన గోవా లిబ‌రేష‌న్ డే(Goa liberation Day) ఉత్స‌వాల్లో పాల్గొన్నారు ప్ర‌ధాని మోదీ(PM Modi). కొన్ని శ‌తాబ్దాల క్రితం దేశంలోని ప్ర‌ధాన ప్రాంతాల‌న్నీ మొగ‌లుల పాల‌న‌లో ఉండ‌గా, గోవా మాత్రం పోర్చుగ‌ల్ పాల‌న‌లో ఉండేద‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు

Advertisement
Advertisement