రాజకీయాలు
Afghanistan Crisis: అప్ఘనిస్తాన్ పరిస్థితులపై విపక్షాలకు క్లుప్తంగా వివరించండి, విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రధాని మోదీ, ఈనెల 26న వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ నేతలతో అఖిలపక్ష సమావేశం
Hazarath Reddyఅప్ఘనిస్తాన్ పరిణామాలపై విపక్ష పార్టీలకు సంక్షిప్తంగా వివరించాలని విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదేశించారు. ఈ విషయాన్ని (Narendra Modi Govt to Brief Leaders of Political Parties) విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S. Jaishankar) సోమవారంనాడు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
PM Narendra Modi: 'ఉగ్రవాదంతో సామ్రాజ్యాలు సృష్టించే విధ్వంసక శక్తులు ఎక్కువకాలం ఆధిపత్యం చెలాయించలేరు, వారి ఉనికి శాశ్వతం కాదు', ప్రాధాన్యత సంతరించుకుంటున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు
Team Latestlyవిధ్వంసక శక్తులు మరియు ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించుకోవాలనే సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తులు ఎంతో కాలం ఆధిపత్యం చెలాయించలేరని, వారి ఉనికి శాశ్వతం కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భయపెట్టే ధోరణితో వారు కొంతకాలం పాటు...
Jan Ashirwad Yatra: ఏపిలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి లేదు, నీటి సమస్యలను ఏపి- టీఎస్ రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి, 'జన్ ఆశీర్వాద యాత్ర' పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Team Latestlyకిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర పథకాల అమలు మినహా ఏపిలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని అన్నారు. ఏపికి కేంద్రం అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు...
Pegasus Row: పెగాస‌స్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు, ప‌దిరోజుల్లో దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశాలు, వీటిపై బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేమ‌ని కోర్టుకు నివేదించిన తుషార్ మెహ‌తా
Hazarath Reddyపెగాస‌స్ స్పైవేర్ ద్వారా ప్ర‌భుత్వం ఫోన్ హ్యాకింగ్‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల‌పై కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్యాప్తు చేపట్టాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు (Supreme Court Issues Notice to Centre) జారీ చేసింది. ప‌దిరోజుల్లోగా దీనిపై స‌వివ‌రంగా బ‌దులివ్వాల‌ని కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణ 10రోజులకు వాయిదా వేసింది.
BJP vsTRS: నువ్వెంత నీ బతుకెంత..బండి సంజయ్‌పై విరుచుకుపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపాటి, మల్కాజ్ గిరి బంద్‌కు బీజేపీ పిలుపు, పలువురు అరెస్ట్, మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు
Hazarath Reddyటీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద పరిస్థితి (BJP workers attack TRS MLA Mynampally Hanumantha Rao house ) ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్ పై నిన్న దాడి జరిగిన సంగతి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన ఈ దాడుల్లో కార్పొరేటర్ తీవ్రంగా గాయపడ్డారు
Chhattisgarh: కొత్తగా నాలుగు జిల్లాలు, 18 కొత్త త‌హ‌సీల్ కార్యాల‌యాలు, స్వాతంత్ర్య దినోత్స‌వ వేళ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్రజలకు శుభవార్త అందించిన సీఎం భూపేశ్ బ‌ఘేల్
Hazarath Reddyఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌జ‌ల‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేశ్ బ‌ఘేల్ శుభ‌వార్త వినిపించారు. రాష్ట్రంలో ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణను దృష్టిలో ఉంచుకుని కొత్త‌గా నాలుగు జిల్లాలు (Chhattisgarh to Get 4 New Districts, 18 Tehsils) ఏర్పాటు చేస్తున్నామ‌ని సీఎం (CM Bhupesh Baghel) తెలిపారు.
Taliban Militants: ఒంటరయిన ఆప్ఘాన్, దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు, తమ సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్న అమెరికా, రక్తపాతాన్ని జరగనివ్వనని తెలిపిన అఫ్గానిస్థాన్‌ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, ఇంతకీ తాలిబన్లు ఎవరు, అసలు అఫ్గానిస్థాన్‌‌లో ఏం జరుగుతోంది?
Hazarath Reddyఅఫ్గానిస్థాన్‌ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఆఫ్ఘ‌నిస్థాన్ ( Afghanistan ) పూర్తిగా తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డానికి ఇక ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తాలిబ‌న్ (Taliban Militants) తిరుగుబాటుదారులు రాజ‌ధాని కాబూల్‌లోకి ప్రవేశించిన‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ వెల్ల‌డించింది
Rahul Gandhi Twitter Row: రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా అన్‌లాక్, సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ అధికారిక ఖాతాలో ట్వీట్, ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ళ బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Hazarath Reddyకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తో పాటు ఆ పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ పునరుద్దరించింది. ఇటీవ‌ల ఢిల్లీలో రేప్‌, హ‌త్య‌కు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేప‌థ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విష‌యం తెలిసిందే.
Huzurabad By-poll: హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఈనెల 16న ద‌ళిత బంధు ప్రారంభ సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు ప్రమోట్ చేయనున్న సీఎం కేసీఆర్
Team Latestlyఈ ఆగస్టు 16న హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 'ద‌ళిత బంధు' పథకం ప్రారంభోత్సవ సమావేశాన్ని తెరాస నిర్వహించనుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గెల్లు శ్రీనివాస్ ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం....
'All Sacredness Destroyed': లోక్‌సభ నిరవధిక వాయిదా, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదని కంటతడి పెట్టిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, ప్రతిపక్షాల నిరసనల మధ్య కొనసాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Hazarath Reddyరాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్‌ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో గందరగోళ పరిస్థితులపై (Rajya Sabha Ruckus by Opposition) కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు.. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభలో సభ్యుల ప్రవర్తన కలచివేసిందని, విపక్ష సభ్యులు హంగామా చేసి చర్చను అడ్డుకున్నారని వాపోయారు
Supreme Court: 48 గంటల్లోగా అభ్యర్థి క్రిమినల్ రికార్డు బయటపెట్టాలి, రాజకీయ పార్టీల‌కు కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, పెగాసస్ స్పైవేర్‌ విచారణలో వ్యవస్థపై తప్పనిసరిగా నమ్మకం ఉండాలని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyదేశంలోని రాజకీయ పార్టీల‌కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం (Supreme Court) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఓ అభ్య‌ర్థిని ఎంపిక చేసిన 48 గంట‌ల్లోపు ఆ అభ్య‌ర్థికి సంబంధించిన క్రిమిన‌ల్ రికార్డుల‌ను (Political Parties must publish criminal antecedents) బ‌య‌ట‌పెట్టాలని స్ప‌ష్టం చేసింది.
BJP Leader Tarun Chugh: సీఎం చౌహాన్ శివుడుగా, శర్మ విష్ణువుగా ఉండగా కరోనా ఏమి చేస్తుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్, కోవిడ్ విలయతాండవంలో వీరు ఏమయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ చురక
Hazarath Reddyబిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ (BJP Leader Tarun Chugh) సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) ‘శివుడైనప్పుడు’.. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ విష్ణుదత్ శర్మ (Vishnu Dutt Sharma) ‘విష్ణువు’ అయినప్పుడు కరోనా మధ్యప్రదేశ్‌‌ను ఏం చేయగలదంటూ వ్యాఖ్యానించారు.
Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Team Latestlyధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....
CM KCR Tour Highlights: గురువారం నుంచే దళిత కుటుంబాల అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ, వాసాలమర్రిలో వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, గ్రామంలో కలియదిరుగుతూ సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ
Team Latestlyగ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు....
6 TMC MPs Suspended: ఆరుగురు టీఎంసీ సభ్యుల సస్పెన్షన్‌, పెగాసస్‌ అంశంపై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకొచ్చి ఫ్లకార్డులు ప్రదర్శించిన తృణమూల్ ఎంపీలు, 255 నిబంధనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన వెంకయ్యనాయుడు
Hazarath Reddyపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. రాజ్యసభలో ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు (6 TMC MPs suspended) పడింది. వెల్‌లోకి దూసుకొచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో రూల్‌ 225 ప్రకారం ఆరుగురు టీఎంసీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు (Rajya Sabha Chairman Venkaiah Naidu) ఒకరోజుపాటు సస్పెండ్‌ చేశారు.
E Peddi Reddy Joins TRS: నన్ను చంపినా సరే అబద్దాలు చెప్పి మోసం చేయను, కేసీఆర్‌ చెప్పాడంటే జరిగి తీరాల్సిందే, దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి
Hazarath Reddyదళితుల సమగ్రాభివృద్ధికోసం బృహత్‌ సంకల్పంతో రూపొందించిన దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తరతరాలుగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన దళితుల జీవితాలను పూర్తిగా మార్చివేసేందుకే ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఈ పథకానికి రూపకల్పన చేశామని తెలిపారు.
Devineni Uma: రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ, 14 రోజులు రిమాండ్ విధించిన మైలవరం జడ్జి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వైసీపీ నేతపై దాడి చేశారని ఆరోపణలు
Hazarath Reddyహనుమాన్‌ జంక్షన్‌ సీఐ ఆఫీసులో జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను (Devineni Uma Maheshwararao ) హాజరుపర్చారు. దేవినేని ఉమకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ (Devineni Uma remanded for 14 days) విధించారు. రాజమహేంద్రవరం జైలుకు (Rajahmundry jail) తరలించాలని మైలవరం జడ్జి షేక్ షేరిన్ ఆదేశించారు.
Father-Son Chief Ministers: తండ్రీ కొడుకులిద్దరూ సీఎంలే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలలో సీఎంలుగా తండ్రి కొడుకులు, పూర్తి లిస్ట్ పై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyకర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం (Basavaraj Bommai is new Karnataka CM) చేశారు. ఆయన తండ్రి కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంలుగా (Father-Son Chief Ministers) చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.
Basavaraj Bommai Sworn in: కర్నాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం, 19 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయనున్న కొత్త సీఎం, 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు
Hazarath Reddyకర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణ స్వీకారం (Basavaraj Bommai Takes Oath as Chief Minister) చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప (BS Yediyurappa) బసవరాజ్ బొమ్మయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.
CM Basavaraj Bommai: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి ఎంపిక, బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం, బుధవారమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
Vikas Mandaకర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఎన్నికయ్యారు. మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటెల్ లో జరిగిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభాపక్ష సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మాయినే తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జి. కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌లను కేంద్ర పరిశీలకులుగా హజరయ్యారు.