రాజకీయాలు

BJP Activists Attack on TRS MLA House: హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరిన బీజేపీ నేతలు, వివాదాస్పదమైన ఎమ్మెల్యే అయోధ్య రామాలయం వ్యాఖ్యలు

Hazarath Reddy

అయోధ్య రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. బీజేపీ నేతలు రావు పద్మారెడ్డి, శ్రీధర్‌తో పాటు 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

AP Local Body Polls: వైసీపీ గెలిస్తే రాష్ట్రం వల్లకాడే, సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, నిమ్మగడ్డపై విరుచుకుపడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దివంగత వైఎస్సార్‌ని పొగిడిన ఎస్ఈసీ, ముగిసిన తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

Hazarath Reddy

ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎన్నికల కమిషనర్ పొగిడారు. వైఎస్సార్‌ వద్ద పని చేయడం వల్లే తన కెరీర్‌లో గొప్ప మలుపు వచ్చిందని చెప్పారు. ఆయన వద్ద మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన తనను, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్‌భవన్‌లో ఉన్నత బాధ్యతల కోసం పంపించారన్నారు.

AAP To Fight 6 State Polls: బీజేపీకు సరైన ప్రత్యర్థి అదేనా? వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో పోటీకి సై అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్ ఏర్పడి 9 సంవత్సరాలైన సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

Hazarath Reddy

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వ‌చ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (AAP To Fight 6 State Polls) ఆమ్ ఆద్మీ పార్టీ పోటీప‌డ‌నున్న‌ట్లు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు.

AP Panchayat Elections 2021: ఏకగ్రీవాలను స్వాగతించాలని కోరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌, సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021), వ్యాక్సినేషన్‌ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Advertisement

Farmers' Tractor Rally: ఢిల్లీ హింసాత్మక పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం, పారామిలిట‌రీ ద‌ళాల‌ను హైఅలెర్ట్‌లో ఉండాలని ఆదేశాలు, హింసాత్మకంగా మారిన రైతుల కిసాన్ పరేడ్

Hazarath Reddy

కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ.. రిప‌బ్లిక్ డే నాడు రైతులు తలపెట్టిన కిసాన్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ‌లోని సీనియ‌ర్ అధికారులు అత్య‌వ‌స‌రంగా సమావేశ‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారాన్ని వాళ్లు సేక‌రిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు (Amit Shah takes stock of law and order situation) సమీక్షిస్తున్నారు. పారామిలిట‌రీ ద‌ళాల‌ను హైఅలెర్ట్‌లో ఉండాల‌ని ఆదేశించారు. ఎర్ర‌కోట ద‌గ్గ‌ర మ‌రిన్ని బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

AP Panchayat Elections 2021: తేలిపోనున్న ఏపీ ‘పంచాయితీ’, సుప్రీంకోర్టులో నేడు విచారణకు ఏపీ పంచాయితీ ఎన్నికల పిటిషన్, ఎస్ఈ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ, ఎస్ఈసీ తీరుపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

Hazarath Reddy

ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పంచాయితీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections 2021) నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు (A.P. High Court) ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే.

Farmers Tractor Rally: ట్రాక్టర్ల ర్యాలీతో కేంద్రాన్ని కదిలించనున్న రైతులు, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు, ర్యాలీలో ఆకర్షణగా మారనున్న మహిళా రైతులు

Hazarath Reddy

రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి (Farmers Tractor Rally) ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

AP Panchayat Elections Row: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటన, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Team Latestly

హైకోర్ట్ తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తూ, షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జనవరి 8న ఎస్‌ఇసి పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుండి పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి....

Advertisement

Farmers-Government Meet: కొత్త వ్యవసాయ చట్టాలు 18 నెలల పాటు నిలిపివేత, కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చిన కేంద్రం, వ్యతిరేకించిన రైతు సంఘాలు, జనవరి 22న మరోసారి భేటీ

Hazarath Reddy

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను (Farm Laws) మూడింటి అమలును 18 నెలల పాటు నిలిపివేయనున్నట్లు రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. ఏడాదిన్నర పాటు చట్టం అమలును నిలిపి ఉంచేందుకు సిద్ధమని, ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో రైతు ప్రతినిధులు విభేదించారు. సాగు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలని పునరుద్ఘాటించారు.

Devineni Uma Arrested: టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్ట్, గొల్లపూడిలో 144 సెక్షన్, దీక్షకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు, బహిరంగ చర్చకు సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Hazarath Reddy

విజయవాడలోని గొల్లపూడిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేవినేని ఉమ సవాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీక్షకు యత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి (Devineni Uma Arrested) తీసుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

'PM Modi in Pakistan': పాకిస్తాన్‌లో మార్మోగిన ప్రధాని మోదీ పేరు, పాక్‌ నుంచి స్వాతంత్య్రం కావాలంటున్న సింధీలు, అంతర్జాతీయ నేతల ఫొటోలు ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు

Hazarath Reddy

పొరుగుదేశం పాకిస్థాన్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. తమకు పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కావాలని పోరాడుతున్న సింధీలు సోమవారం సింధ్‌ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఫొటోలు ఉన్న పోస్టర్లను (PM Naredra Modi's posters raised) పట్టుకొన్నారు. ప్రజలంతా ఆయన ఫ్లకార్డులు పట్టుకుని.. తమకు మద్దతునివ్వాల్సిందిగా (PM Modi Slogans In Pakistan) మోడీని అభ్యర్థించారు.

West Bengal Polls: బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన దుండుగులు, డివైడర్ చాటున దాక్కున్న బీజేపీ నేతలు, భారతీయ జనతా పార్టీని వాషింగ్ మెషిన్‌తో పోల్చిన మమతా బెనర్జీ, నందిగ్రామ్ నుండి అసెంబ్లీకి పోటీకి సై అంటున్న దీదీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Polls) సమీపిస్తున్నా కొద్ది భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రోజు రోజుకు వార్ వేడెక్కుతోంది. తాజాగా రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీపై కొందరు రాళ్లు (Stones pelted at BJP workers) రువ్వారు. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, సువేందు అధికారి (state chief Dilip Ghosh and Suvendu Adhikari) పాల్గొన్నారు.

Advertisement

Congress MLA Harsh Gehlot: మహిళా అధికారివి అయిపోయావ్..పురుష అధికారి వుంటే గల్లా పట్టుకొని మరీ మెమరాండం ఇచ్చే వాడిని, సంచలనం రేపుతున్న ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్‌ వీడియో

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Madhya Pradesh Congress MLA Harsh Gehlot) ఒక ఎస్‌డిఎం ర్యాంకుకు చెందిన లేడీ ప్రభుత్వ అధికారిని బెదిరిస్తున్నట్లుగా కెమెరాలో చిక్కింది. ఆయనని Sailana Constituency కి చెందిన హర్ష్ విజయ్ గెహ్లాట్‌గా గుర్తించారు.

Tamil Nadu Polls: బీజేపీకి షాకిచ్చిన రజినీకాంత్ అభిమానులు, స్టాలిన్ పార్టీ డీఎంకే కండువా కప్పుకున్న అభిమానులు, మీ ఇష్టం ఏ పార్టీలోనైనా చేరండని తెలిపిన ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ టీమ్

Hazarath Reddy

రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేనని చెప్పడంతో అభిమానులు తలో దారి చూసుకుంటున్నారు. కొంద‌రు జిల్లాల నేత‌లు డీఎంకేలో చేరారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ టీమ్ స‌భ్యులు స్పందించారు. ఇక ఎవ‌రైనా టీమ్‌కు రాజీనామా చేసి, వేరే ఏ పార్టీలో అయినా చేర‌వ‌చ్చు అని ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. అయితే వాళ్లు ఏ పార్టీలో చేరినా ర‌జ‌నీకాంత్ అభిమానులం (Rajinikanth Fans) అన్న విష‌యాన్ని మాత్రం మ‌ర‌చిపోవ‌ద్ద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు.

Rajinikanth Emotional Letter: నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు, అభిమానుల ధర్నాపై స్పందిస్తూ.. లేఖను విడుదల చేసిన రజినీకాంత్

Hazarath Reddy

ర‌జినీకాంత్‌ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డంపై ఆయ‌న స్పందించారు. దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు విజ్ఞప్తి (Rajinikanth emotional letter) చేశారు

US Congress Certifies Biden's Win: జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా అధికారికంగా ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్, ఎట్టకేలకు తలవంచిన ట్రంప్.. అధికార బదిలీకి సుముఖత, జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం

Team Latestly

తన ఎత్తులేమి పారకపోవడంతో ఇక డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పలేదు, ఎట్టకేలకు ఆయన దిగివస్తూ జో బైడెన్ కు అమెరికా అధ్యక్షుడిగా అధికార బదిలీకి చట్టబద్ధంగా సహకరిస్తానని ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ....

Advertisement

US Capital Violence: డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుల అరాచకం, యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు, అల్లర్లలో నలుగురి మృతి, అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు

Team Latestly

కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీ మేయర్ నగరంలో కర్ఫ్యూ విధించారు, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను కొంత మంది పాటించలేదు, దీంతో వాషింగ్టన్ డీసీలో 15 రోజుల పాటు ఎమెర్జెన్సీ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.....

EVM Row: ఈవీఎం వాడకం నిలిపివేయాలంటూ పిటిషన్, తిరస్కరించిన సుప్రీంకోర్టు, హైకోర్టును సంప్రదించాలని కోరిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) వాడకాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికలలో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించేలా భారత ఎన్నికల సంఘానికి (Election Commission of India) ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్-న్యాయవాది సిఆర్ జయ సుకిన్‌కు (petitioner-advocate CR Jaya Sukin) సలహా ఇచ్చింది.

Covid in India: కొత్త కరోనా దాడి..71కి చేరుకున్న యూకే కోవిడ్ స్ట్రెయిన్ కేసులు, దేశంలో తాజాగా 18,088 కరోనా కేసులు నమోదు, కొవిడ్‌-19 టీకాల ఎగుమతిపై ఎలాంటి నిషేధం లేదని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

దేశంలో యూకే కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు (UK Coronavirus Strain) 71కి చేరాయి. మంగళవారం ఉదయం వరకు సంఖ్య 58 ఉండగా.. సాయంత్రానికి మరో 13 మందికి నిర్ధారణ అయింది.

Bandi Sanjay: వైసీపీ మూటా ముల్లె సర్దుకునే రోజు దగ్గర పడింది, బైబిల్‌ పార్టీ కావాలో..భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలే తేల్చుకోండి, ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో (Tirupati Bypoll) బైబిల్‌ పార్టీ కావాలో..? భగవద్గీత పార్టీ కావాలో..? తిరుపతి ప్రజలే తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement