రాజకీయాలు
Formula E Race Case: ఫార్ములా-ఈ కార్ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్
Hazarath Reddyఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Narendra Varma Raju Vegesana: వీడియో ఇదిగో, మందేసి చిందేసి బీజేపీ నేతకు ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బర్త్‌డే పార్టీలో రచ్చ చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
Hazarath Reddyసతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు.
One Nation, One Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఈ-ఓటింగ్, కొత్త పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి
Hazarath Reddyలోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Hazarath Reddyలోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Hazarath Reddyలోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.
One Nation One Election Bill: సుప్రీం లీడర్ ఈగో మసాజ్ కోసమే జమిలి ఎన్నికల బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
One Nation, One Election: వీడియో ఇదిగో, లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్
Hazarath Reddyకేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ వెంటనే వ్యతిరేకించారు, ఈ ప్రతిపాదన "ఈ సభ యొక్క శాసన సామర్థ్యానికి మించినది" అని అన్నారు.
Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.
Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
Hazarath Reddyనల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.
One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraదేశవ్యాప్తంగా ఎంతో చర్చకు దారితీసిన జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు)పై నేడు మరో కీలక అడుగు పడనుంది. మంగళవారం లోక్ సభలో కేంద్రం రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది.
Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా కేబినెట్ భేటీ జరిగింది.ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
KTR Slams CM Revanth Reddy: రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyరేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మవి నువ్వు
Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyకాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అసెంబ్లీ వేదికగా నిజమేనని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని అసెంబ్లీ వేదికగా బాంబ్ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి, సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసిన మంత్రి సీతక్క
Hazarath Reddyసర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు.
Telangana Assembly Session 2024: సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో
Hazarath Reddyకొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024 ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.
Telangana Cabinet Today: నేడు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
Rudraతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానున్నది. శాసనసభ ప్రాంగణంలోని అసెంబ్లీ కమిటీ హాల్-1లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కానున్నది.