రాజకీయాలు

Apex Council Meeting Postponed: తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా, తదుపరి సమావేశాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర జల శక్తి శాఖ

Hazarath Reddy

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (Apex Council Meeting) కేంద్ర జలశక్తి శాఖ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరుకాలేనని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర జల శక్తిశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. త్వరలోనే మరో సమావేశం తేదీని తెలియచేస్తామని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

TS New Secretariat Design: కొత్త సెక్రటేరియట్ డిజైన్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర, ఏడాదిలోపే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచన, కరోనా కట్టడిపై కొనసాగుతున్న కేబినెట్

Hazarath Reddy

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం (New Secretariat Design), నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలు, కొవిడ్‌ (Covid) నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు, కృష్ణా జలాల అంశం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీ, రిటైల్‌ ట్రేడ్‌, లాజిస్టిక్‌ పాలసీపై చర్చిస్తున్నారు. సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

Asaduddin Owaisi: మోదీతో పాటు నేను కూడా భావోద్వేగానికి గురయ్యా, అక్కడ మసీదు మసీదుగా మిగిలిపోతుంది, ప్రజాస్వామ్యం,లౌకికవాదం ఓడిపోయి హిందుత్వం గెలిచిందన్న అసదుద్దీన్ ఒవైసీ

Hazarath Reddy

రామ మందిర నిర్మాణ శంకుస్థాపను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi) తప్పు పట్టారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని పదవీ స్వీకారంలో చేసిన ప్రమాణాన్ని మోదీ ధిక్కరించారని మండిపడ్డారు. కాగా, పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్వానన్న ప్రధాని వ్యాఖ్యలను ఓవైసీ ప్రస్తావిస్తూ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు.

Three Capitals Row: మూడు రాజధానులపై హైకోర్టు స్టే, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 14కు విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై (three separate capitals) రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది.

Advertisement

Three Capitals Issue: చంద్రబాబు 48 గంటల సవాల్, అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామంటూ పిలుపు, మీరు రాజీనామా చేసి వస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని తెలిపిన పేర్ని నాని

Hazarath Reddy

మూడు రాజధానుల అంశంపై (Three Capitals Issue) ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాలని, అందరం కలసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మీడియాతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని (AP Capital) ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

National Education Policy 2020: కేంద్రానికి తమిళనాడు షాక్, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయమని తెలిపిన సీఎం పళని స్వామి, పునరాలోచించాలని ప్రధానికి విజ్ఞప్తి

Hazarath Reddy

కేంద్ర సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన నూతన జాతీయ విధానం(NPE)పై తమిళనాడు సర్కారు (Taminadu Govt) అసహనం వ్యక్తంచేసింది. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలోని ‘త్రి భాషా సూత్రా’న్ని (3 Language Formula) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి పళని స్వామి (Edappadi Karuppa Palaniswami) ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు.

'Tik Tok Ban in US': అమెరికాలోనూ టిక్ టాక్‌పై నిషేధాన్ని పరిశీలిస్తున్నామన్న డొనాల్డ్ ట్రంప్, తమ వద్ద మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వెల్లడి, మెక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందని ఊహాగానాలు

Team Latestly

టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాల్సిందిగా దాని సంస్థ బైట్‌డాన్స్‌ను ఆదేశించేందుకు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం సిద్ధమవుతోందని ప్రముఖ మీడియా సంస్థలు న్యూయార్క్ టైమ్స్ మరియు ఫాక్స్ బిజినెస్ కథనాలు వెలువరించాయి. చైనీస్ యాజమాన్య హక్కులు ఉపసంహరించుకునేలా బైట్‌డాన్స్‌ను ఆదేశించే నిర్ణయాన్ని ట్రంప్ పరిపాలన విభాగం త్వరలో ప్రకటించవచ్చని....

Nimmagadda Ramesh Kumar: వివాదాల నడుమ ఏపీ ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ నియామకం, అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి నియామకం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Govt) గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Biswabhushan Harichandan) పేరుతో ఈ ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Water War: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోం! నదీ జలాల వాటాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష, తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని తీర్మానం

Team Latestly

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది....

Apex Council Meeting: జల వివాదం, ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (Telugu States CMs) అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని (Apex Council Meeting) నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల ఐదున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ (water resources secretary UP Singh) బుధవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

Rajasthan Assembly Sessions: రాజస్థాన్ పొలిటికల్ డ్రామాకు తెరపడింది, ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు, అంగీకరించిన గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్న సీఎం

Hazarath Reddy

గత కొంత కాలం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న రాజస్తాన్‌ పొలిటికల్ డ్రామాకు (Rajasthan Political Drama) ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను (Rajasthan Assembly Sessions) ప్రారంభించేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా (Rajasthan Governor Kalraj Mishra) అంగీకరించారు. ఈ అంగీకారంతో గవర్నర్, కాంగ్రెస్‌ సర్కార్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ముగిసింది. కాగా జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్‌ గెహ్లాట్ (CM Ashok Gehlot) కేబినెట్‌ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్‌ వెనక్కు పంపిని విషయం విదితమే.

Maharashtra Politics: మహారాష్ట్రను టార్గెట్ చేసిన బీజేపీ, శివసేన ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపిన చంద్రకాంత్‌ దాదా పాటిల్‌, వ్యూహాలను సిద్ధం చేయాలని నడ్డా సూచన

Hazarath Reddy

మహారాష్ట్రలో తిరిగి కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ (BJP) నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. గతంలో సీట్ల పంపకాల్లో విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి విడిపోయిన పార్టీలను తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకు ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్‌ చంద్రకాంత్‌ దాదా పాటిల్‌ (Maharashtra Bjp chief Chandrakant Dada Patil) చేసిన కీలక వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శివసేన (Shiv Sena) ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేనను తిరిగి ఎన్డీయేలో (NDA) చే​ర్చుకునేందుకు తామకు ఏమాత్రం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Rajasthan Political Heat: రాష్ట్రపతి రంగంలోకి రావాలి, బీజేపీ నియమించిన గవర్నర్లు రాజ్యాంగాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై స్పందించిన కాంగ్రెస్ నేత చిదంబరం

Hazarath Reddy

రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశానికి పిలుపునివ్వడంపై రాజస్థాన్ గవర్నర్ కలరాజ్ మిశ్రా, సిఎం అశోక్ గెహ్లాట్ మధ్య కొనసాగుతున్న గొడవ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం (Senior Congress leader P Chidambaram) బీజేపీ పార్టీ మీద, గవర్నర్ల మీద ఫైర్ అయ్యారు. బిజెపి నియమించిన గవర్నర్లు (BJP-appointed governors) రాజ్యాంగ పరిధిలోని లేఖను మరియు ఆత్మను పదేపదే ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్రపతి (Ram nath kovind) జోక్యం చేసుకుని రాజస్థాన్ గవర్నర్‌కు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తారని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు.

Rajasthan Political Crisis: గుజరాత్‌, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్‌భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం గుజరాత్ ను తాకింది. బిజెపికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు (Congress workers) గాంధీనగర్‌లోని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‌ కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన (Gujrath Congress protest) ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా (Gujarat Congress president Amit Chavda), ప్రతిపక్ష నేత పరేశ్ ధానాని (Paresh Dhanani) సహా దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rajasthan Political Drama: కరోనాపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయమన్న సీఎం అశోక్ గెహ్లాట్, మరింత సమాచారం కావాలని కోరిన గవర్నర్, సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న స్పీకర్

Hazarath Reddy

రాజస్తాన్‌ రాజకీయ పరిణామాలు (Rajasthan Political Drama) శరవేగంగా మారుతున్నాయి. జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. ఇక సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి (CP Joshi) సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పీకర్ సుప్రీంలో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో న్యాయ పోరాటం వద్దని... రాజకీయంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంతోనే స్పీకర్ ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Rajasthan Crisis: రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. జూలై 31న అసెంబ్లీ సమావేశ పరుస్తున్నట్లు ప్రకటించిన రాజస్థాన్ సీం అశోక్ గెహ్లాట్, ఫ్లోర్ టెస్ట్ కోసం మాత్రం కాదని ట్విస్ట్

Team Latestly

రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అయితే అధికార పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పదవి మరియు పీసీసీ చీఫ్ గా వ్యవహరించే సచిన్ పైలైట్ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు లేవనెత్తారు. తనకు 18 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రకటించారు. సీఎం అశోక్ గెహ్లాట్ తన బలాన్ని నిరూపించుకోవాలని...

Advertisement

India- China Border Row: భారత్ - చైనా సరిహద్దు వివాదం.. బలగాలను ఉపసంహరించుకుంటున్న చైనా; ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ ప్రసంగం

Team Latestly

తూర్పు లడఖ్‌లో మోహరించిన ఇరు దేశాలకు చెందిన దళాలను "వెంటనే మరియు పూర్తిగా" ఉపసంహరించుకోవాలని భారత్ మరియు చైనా శుక్రవారం రోజున ఒక ఏకాభ్రియానికి వచ్చాయి. ఆ మరుసటి రోజే ఈ అభివృద్ధి జరిగింది. సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించే దిశగా...

Rajasthan Political Crisis: వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, రాజ్‌భవన్‌ని ముట్టడించిన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

రాజస్తాన్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు (Rajasthan Political Crisis) చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేల నోటీసు విషయం సుప్రీం వరకు వెళ్లింది. అక్కడ గెహ్లాట్ సర్కారుకు (Ashok Gehlot Govt) ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, గవర్నర్‌ను ( Governor Kalraj Mishra) కలిసేందుకు జైపూర్‌లోని ఆయన నివాసమైన రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే ఆయన వెనుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

Rahul Slams Modi Govt: కేంద్రం నా హెచ్చరికలను పట్టించుకోవడం లేదు, దేశంలో కరోనా కల్లోలానికి, చైనా వివాదానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణం, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Slams Modi Govt) మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ( economic slowdown), చైనాతో సరిహద్దు వివాదం సహా పలు కీలకాంశాలపై రాహుల్‌ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కోవిడ్‌-19 (COVID 19), ఆర్థిక వ్యవస్థ దీనస్థితిపై తాను హెచ్చరిస్తునే ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని..ఆపై ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూశామన్నారు. చైనా విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..వారు వినిపించుకోవడం లేదని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

Rajasthan Political Game: గవర్నర్ కేంద్రం ఒత్తిడికి లొంగిపోయాడు, తాడో పేడో తేల్చుకుంటామని తెలిపిన ఆశోక్ గెహ్లాట్, సుప్రీంకోర్టులో పైలెట్ వర్గానికి ఊరట, కేంద్రంపై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం

Hazarath Reddy

రాజస్తాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు (Rajasthan Political Game) చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ (CM Ashok Gehlot) తాజాగా కేంద్రంపైన, గవర్నర్ పైన ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఒత్తిడి కారణంగానే గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా (Kalraj Mishra) తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చిన విధంగానే రాజస్తాన్‌లో కూడా బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని.. ఎవరి బలమెంతో అక్కడే తేలుతుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement