రాజకీయాలు
Rajya Sabha Elections: ఏపీలో ఫలించిన అంబానీ వ్యూహం, ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు పేర్లు బయటకు వచ్చేశాయి, వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వర ప్రసాద్
Hazarath Reddyదేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు (Rajya Sabha election) జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగే రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఇక ఏపీలో (AP ) ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలను (AP Rajya Sabha) అధికార వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధిష్టానం (YSRCP) ఖరారు చేసినట్లు సమాచారం.
AP Local Body Elections 2020: జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తు, పంతొమ్మిది రాజకీయ పార్టీలకే గుర్తులు, స్థానిక ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
Hazarath Reddyఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి (AP local Body Elections 2020) మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులు 19 రాజకీయ పార్టీల గుర్తుల నుంచే పోటీ చేయాల్సి ఉంటుంది.
AP Local Body Election Nomination: గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి, ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు నేటి నుంచే, నామినేషన్‌కు కావాల్సిన అర్హతలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా (Andhra Pradesh local Body Elections 2020) మోగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు (MPTC, ZPTC) నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
Apni Party: జమ్మూకాశ్మీర్‌లో మరో కొత్త పార్టీ, ‘అప్నీ పార్టీ’ని ప్రారంభించిన పీడీపీ మాజీ నేత సైయద్ అల్టాఫ్ బుఖారి, పార్టీలో చేరిన 40 మంది ఇతర పార్టీల మాజీ ఎమ్మెల్యేలు
Hazarath Reddyఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) అనేక మార్పులు వచ్చాయి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత.. ఇప్పుడు మళ్లీ అక్కడ సామాన్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాజకీయ వేదికపై (Jammu and Kashmir politics) మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. 'జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ' (జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఆదివారంనాడు శ్రీనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
AB Venkateswara Rao: ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీవీకి కేంద్రం షాక్, సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసని తెలిపిన వెంకటేశ్వర రావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (AP former intelligence chief AB Venkateswara Rao) కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ (Home Ministry) ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 7 లోపు ఏబీ వెంకటేశ్వర రావు పై (AB Venkateswara Rao) నమోదు చేసిన అభియోగాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి (AP Goverment) కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Telangana Budget 2020 Highlights: రూ.25వేల వరకు ఒకేసారి రైతు రుణమాఫీ, రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు, రూ.1,82,914.42 కోట్లతో టీఎస్ బడ్జెట్, ఆర్థిక మంత్రిగా తొలిసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన హరీష్ రావు
Hazarath Reddyరాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను (Telangana Budget 2020) ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు (Telangana Finance minister T Harish Rao) నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఆర్థిక మంత్రిగా హరీష్ రావు తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను (TS Budget 2020-21) ప్రవేశపెట్టారు. కాగా, బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి వచ్చే ముందు హరీష్ రావు గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు.
Telangana Budget 2020: ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్, దమ్ము లేకనే పారిపోయారంటూ కేసీఆర్ ధ్వజం, కాంగ్రెస్ పార్టీ దుస్థితికి వారే కారణమంటూ చురక, ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyతెలంగాణా అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Budget Session-2020) రెండో రోజు హాట్ హాట్ గా సాగాయి. ఈ రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చ సంధర్భంగా సీఎం కేసీఆర్ ( CM KCR) మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు (Congress Leaders) అడ్డుపడుతున్నారంటూ శాసనసభ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.
Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ, ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాల్సిందే, తేల్చి చెప్పిన రాంపూర్ కోర్టు
Hazarath Reddyప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు (BJP leader Jaya Prada) రాంపూర్ కోర్టు (Rampur court) నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను రాంపూర్ కోర్టు ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. జయప్రద రాజకీయ ప్రత్యర్థి అజం ఖాన్ కూడా మోసం కేసులో జైలులో ఉన్నాడు.
Election Code In AP: ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్, ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు, హింసకు తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకోండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడి
Hazarath Reddyఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections 2020) సమరానికి వేళయింది. దీంతో అక్కడ తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ (State Election Commissioner, N Ramesh Kumar) ప్రకటించారు. ఎన్నికల సంఘం పోల్ షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ (Model Code of Conduct (MCC)) అమల్లోకి వచ్చేసింది. ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యకూడదో క్లియర్‌గా స్పష్టం చేస్తుంది.
AP CM YS Jagan: కరోనాపై ప్రజలను ఆందోళనకు గురి చేయకండి, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, కాల్ సెంటర్ ఏర్పాటుచేయాలని ఆదేశాలు
Hazarath Reddyసీఎం జగన్ సమీక్షలో ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించడంతోపాటు.. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానిత కేసులుంటే వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్‌ నిరోధంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
Rythu Bandhu Funds: అసెంబ్లీ సమావేశాల ముందు మరో దఫా 'రైతుబంధు' పథకం నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మార్చి 20 వరకు కొనసాగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Vikas Mandaతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం 'రైతుబంధు' పథకం విడుదల చేసినప్పటికీ, సాంకేతిక కారణాల చేత చాలా మంది రైతులకు ఆ నిధులు అందలేదు. ఇదే విషయంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.....
AP Local Body Election Schedule: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 29న కౌంటింగ్
Hazarath Reddyఏపీలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ (AP Local Body Election Schedule) (MPTC, ZPTC Electons) విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి.
Rajya Sabha Elections Notification: ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్, తెలంగాణా నుంచి రెండు సీట్లు ఖాళీ, మార్చి 26న ఓటింగ్
Hazarath Reddy2020 రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ (Rajya Sabha Elections Notification) విడుదల చేశారు. మార్చి 6 నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
'No Yes Bank': యస్ బ్యాంకు సంక్షోభం, ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, భారత ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ నాశనం చేస్తోందని విమర్శలు, డిపాజిటర్ల డబ్బు సురక్షితంగానే ఉందన్న ఆర్థికమంత్రి
Hazarath Reddyయస్ బ్యాంకు సంక్షోభం (Yes Bank crisis) దేశంలో ప్రకంపనలను రేకెత్తిస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. యస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోదీ సర్కార్‌ (Narendra Modi government) భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ‘యస్‌ బ్యాంక్‌ కాదు..మోదీ ఆయన ఆలోచనా విధానాలు ఆర్థిక వ్యవస్థను పతనం బాటన పయనింపచేస్తున్నాయని ఆరోపించారు.
AP IPS Transfers and Promotions: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారు కీలక నిర్ణయం
Hazarath Reddyమరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలు జరగనున్న వేళ వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, ఇంటిలిజెన్స్‌తో పాటూ మరికొన్ని కీలక స్థానాల్లో మార్పులు, చేర్పులు (AP IPS Transfers) చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.
Telangana Assembly Budget Session-20: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై, రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
Vikas Mandaఇక శాసనసభ మరియు మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి ఈరోజే బీసీఏ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ఏ తేదీన ప్రవేశ పెట్టాలి, సిఎఎ వ్యతిరేక తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనే విషయాలను బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.....
Polavaram Project: పోలవరంపై కేంద్రం తీపికబురు, 2021కల్లా పూర్తి చేస్తామని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, వందశాతం పోలవరం ప్రాజెక్ట్‌ ఖర్చును కేంద్రమే భరిస్తుందని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Construction) 2021 డిసెంబర్‌నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ (Gajendra singh shekhawat) చెప్పారు.
Cow Dung for Coronavirus: కరోనావైరస్ నివారణకు ఆవు పేడ, ఆవు మూత్రం దివ్యౌషధాలు, అసెంబ్లీలో స్పీచ్ దంచికొట్టిన ఎమ్మెల్యే, నోరెళ్ల బెట్టిన సహచర సభ్యులు
Vikas Mandaఆవుపేడలో ఆవుమూత్రం కూడా కలిపి, బాగా పిసికి, ఆ మిశ్రమాన్ని రోగుల ఒంటినిండా పూస్తారు. ఇలా చేయడం వల్ల క్రమంగా వారి క్యాన్సర్ రోగం కొంతవరకు నయమైంది. క్యాన్సర్ నే ఆవుపేడ నయం చేయగలుగుతున్నపుడు, కరోనావైరస్ ఎంత" అని.....
India-EU Summit: కరోనా దెబ్బ, ప్రధాని మోదీ బ్రస్సెల్ పర్యటన రద్దు, సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీ వెల్లడిస్తామని తెలిపిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌
Hazarath Reddyప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ (Coronavirus Outbreak) ఇప్పటికే విస్తరించింది. పలు దేశాలకు ఈ వైరస్ విస్తరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో (India-European Union Summit) భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్‌ పర్యటన (Brussels Visit) రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు.
IMR AG Meets AP CM: కడపలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతిపాదన, సహకరించాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఐఎంఆర్‌ ఏజీ కంపెనీ ప్రతినిధులు, ఎలాంటి సహకారానికైనా సిద్ధమన్న ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఆ దిశగా ఏపీ సర్కారు (AP Govt) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో (YSR Kadapa) మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ (IMR AG) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు (IMR Company Representatives) గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసారు. వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.